Tumgik
7insidefacts · 1 year
Text
iPhone Craze : ప్రాణం కంటే విలువైందా ఐఫోన్..!?
Tumblr media
iPhone Craze : చేతిలో యాపిల్ ఐఫోన్ ఉంటే చాలు వాళ్లెంత రిచ్చో అనుకుంటారు చూసిన వాళ్లు.. ఐఫోన్ చాలా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) గానే కాకుండా స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో ఐఫోన్ కి అంత క్రేజ్. ఇంక యూత్ లో ఐఫోన్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన ప్రతిసారి దాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్య తక్కువేం కాదు.
Tumblr media
iPhone కొనలేని వారు, కొన్నవాళ్ళ ఐఫోన్ పై వేసే జోకులు మాములుగా ఉండవు. అందులో ఫేమస్ జోక్.. కిడ్నీ అమ్మైనా సరే ఐఫోన్ కొనుక్కోవాలని.. ఇదే జోక్ ని నిజం చేసాడు చైనా (China) కు చెందిన 17 ఏళ్ల షాంగ్‌కన్. 2011లో ఏకంగా తన కిడ్నీనే అమ్మేసుకున్నాడు. ఆ డబ్బుతో ఐఫోన్ కొని సరదా తీర్చుకున్నాడు. ఆ తర్వాతే అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. బాడీలో ఒకటే కిడ్నీ ఉండడం.. అది కూడా సరిగా పని చేయకపోవడంతో మెల్లిగా ఆరోగ్యం క్షిణించి చివరకు మంచానికే పరిమితమయ్యాడు షాంగ్‌కన్. Children Mobile Addiction : పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు.. మరో ఘటనలో ఐఫోన్ పై ఉన్న మోజుతో ఓ యువకుడు మరో వ్యక్తి ప్రాణాలే తీసేసాడు. ఈ సంఘటన మన పక్క రాష్ట్రం కర్ణాటక (Karnataka) లో జరిగింది. కర్ణాటకలోని హసన్‌ జిల్లాకు చెందిన హేమంత్‌ దత్‌ (20) ఐఫోన్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసాడు. డెలివరీ బాయ్‌ ఆర్డర్ ఇంటికి తెచ్చాక ఆ టైంకి ఆ యువకుడి వద్ద డబ్బులు లేకపోవడంతో ఐటమ్ రిటర్న్ చేయకుండా ఏకంగా డెలివరీ బాయ్ నే చంపేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
Tumblr media
iPhone ఇటీవల జరిగిన మరో సంఘటన అందరూ నివ్వెరపోయేలా చేసింది. ఐఫోన్ పిచ్చి జనాలకు ఎంతగా ఎక్కిందో మరోసారి ఋజువు చేసింది. కేవలం ఐఫోన్ కోసం కన్నపేగునే కాదనుకుంది ఓ జంట. ఖరీదైన ఐఫోన్-14 కొనుక్కొని ఇన్ స్టా రీల్స్ చేసేందుకు ఓ జంట ఏకంగా కన్న బిడ్డనే అమ్ముకున్నారు. కోల్ కతా లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన జైదేవ్ ఘోష్, సాధీ అనే దంపతులు 2 లక్షలకు వారి 8 నెలల మగబిడ్డను అమ్ముకున్నారు. మిగిలిన డబ్బుతో జల్సా చేయాలనుకున్నారు. కానీ రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం త్వరలోనే వెలుగులోకి రావడంతో పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దంపతులు పరారీలో ఉన్నారు. onliOnline Earning : ఆన్లైన్ లో మనీ ఎర్నింగ్.. స్టీవ్ జాబ్స్ 2007లో ఏ మూహూర్తానా ఐఫోన్ ని మార్కెట్ లోకి తెచ్చాడో కానీ సామాన్యులకు 'ఆపిల్' అందని ద్రాక్షగానే ఉంది. ఏదేమైనా ఆపిల్ కంపెనీ (Apple Company)  ఐఫోన్ పిచ్చి మనుషులను ఎంతగా దిగజారుస్తుందో ఈ ఘటనలే ఉదాహరణ. ప్రాణాలనే పణంగా పెట్టి ఒకరు, ప్రాణాలే తీసి ఇంకొకరు ఐఫోన్ ను దక్కించుకునే విధానం చూస్తుంటే.. ప్రాణం కంటే ఐఫోనే విలువైందా అని అనుమానం కలుగుతుంది..! Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Funny Facts : ఫన్నీ ఫ్యాక్ట్స్..
Tumblr media
Funny Facts : ● మనం ప్రేమకు చిహ్నంగా పావురాలు వాడుతూ ఉంటాం.. కానీ ప్రేమకు చిహ్నంగా పావురాలనే ఎందుకు వాడతారో తెలుసా? పావురాలు జీవితకాలంలో ఒక భాగస్వామినే కలిగి ఉంటాయి. వాటిలో ఒక పావురం చనిపోతే మరో పావురం కూడా గుండె పగిలి చనిపోతుంది. అందుకే Lovers కి ఇచ్చే గిఫ్ట్స్ పై జంట పావురాలు ఉంటాయి. జీవితాంతం నేను నీతోనే ఉంటాను అని Symbolic గా చెప్పడం అన్నమాట..
Tumblr media
Love Birds ● ఇప్పుడైతే మనం Coca Colaను Cool Drink గా వాడుతున్నాం కానీ ఒకప్పుడు CocaColaను తలనొప్పికి Tonic గా వాడేవాళ్లట. ● పార్లమెంట్ అనగానే మనకు ఢిల్లీలో ఉండే లోక్ సభ, రాజ్యసభలు గుర్తుకు వస్తాయి కానీ గుడ్లగూబల గుంపును కూడా పార్లమెంట్ అనే పిలుస్తారని మీకు తెలుసా? ● ప్రపంచంలో అత్యధిక మంది తినే చిరుతిండి Chips.. Chips Packetలో నైట్రోజన్ Gas ను నింపుతారు. ఎందుకంటే... నైట్రోజన్ కు రంగు, రుచి వాసన ఉండదు. అదే ఆక్సిజన్ ను నింపితే Chips త్వరగా మెత్తబడి పాడవుతాయట.
Tumblr media
CocaCola, Chips ● ఆస్ట్రేలియా అంటేనే.. Natural Wonders కి, Beachలకు, ఎడారులకు పెట్టింది పేరు.. ఒక్క ఆస్ట్రేలియాలోనే సుమారు 10,000 లకు పైగా బీచ్ లు ఉన్నాయి. మనం రోజుకి ఒక బీచ్ ని చూసినా.. ఆస్ట్రేలియాలోని అన్ని బీచ్ లను చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. ● సాధారణంగా ఏవైనా జంతువులు కానీ పక్షులు, కీటకాల మొండెం నుంచి తలని వ���రుచేస్తే ఎన్ని రోజులు బతుకుతాయి.. రోజులు కాదు కదా కొన్ని గంటలు కూడా బతకలేవు.. కానీ బొద్దింకలు మాత్రం body నుంచి తలను వేరు చేసినా అవి ఏకంగా ఏడురోజులు ప్రాణాలతో ఉంటాయట.
Tumblr media
Australia Wonders ● ప్రపంచవ్యాప్తంగా ఉండే జెల్లీ Fish గురించి అందరూ వినే ఉంటారు. ఈ జెల్లీ ఫిషుల్లో 98 శాతం నీరే ఉంటుంది. మనం వీటిని ఎండలో పెడితే పూర్తిగా ఆవిరైపోతాయి. ● న్యూయార్క్ లో ఉండే స్వేచ్ఛకు చిహ్నమైన Statue of Liberty కిరీటంలో ఉండే ఏడు కొనలు ఏడు ఖండాలను సూచిస్తాయి. ● ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు ప్రతికూల భావోద్వేగాలకు త్వరగా లోనవుతారు.. కోపం, భయం లాంటి Emotions కి ఈ Left Handers తొందరగా లోనవుతుంటారు..
Tumblr media
Jelly Fish ● ముంతాజ్ పై ఉన్న ప్రేమకు చిహ్నంగా షాజహాన్ నిర్మించిన అందమైన కట్టడమే తాజ్ మహల్. ఈ సుందరమైన కట్టడాన్ని సందర్శించడానికి ఏటా దేశవిదేశాల నుంచి అనేకమంది Tourists వస్తుంటారు. అయితే TajMahal ఒక్కో సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తుందని మీకు తెలుసా.. మాములు సమయంలో TajMahal White Color లో కనిపిస్తుంది. - Early Morning - Pink Color, - Evening - Gold Color, - Night - Blue Color లో కనిపిస్తుంది. అయితే దీనికి కారణం సూర్యకిరణాలు TajMahal పై పడే దిశను బట్టి మనకు అలా Different Different Colours లో కనిపిస్తుంది. ● Computer భాగాలు బాగా Heat ఎక్కినప్పుడు వాటిని చల్లబరచడానికి Fan నో, Ac యో ఉన్నట్లే.. ఆవులింతలు మెదడును చల్లబరుస్తాయి.
Tumblr media
Taj Mahal ● కొన్ని చారిత్రక ప్రదేశాల్లో గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను మీరు చూసుంటారు. కానీ గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పవచ్చని మీకు తెలుసా.. - గుర్రం ముందు రెండు కాళ్ళు గాల్లో ఉంటే.. ఆ రాజు యుద్ధంలో మరణించాడని, - ఒక కాలు నేల మీద మరొక కాలు గాలిలో ఉంటే.. యుద్ధంలో తగిలిన గాయాల వలన తరువాత చనిపోయాడని, - అదే నాలుగు కాళ్ళు నెలపైనే ఉంటే.. ఆ రాజు సహజంగా మరణించాడని అర్థం. ● మనమేదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు మన మెదడు దాని ఆకృతిని మార్చుకుంటుంది. Thalaikoothal : చివరి స్నానం (తలైకూతల్).. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Sugar Control Food : షుగర్.. మానసిక సమస్య..
Tumblr media
Sugar Control Food : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ రోజుల్లో అధిక బరువు, వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ అవడం చాలామందిలో చూస్తూనే ఉన్నాం. మనం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం 80% మన చేతుల్లోనే ఉంటుంది.
Tumblr media
Fruits బరువు తగ్గడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలనుకునే వారు భోజనానికి ముందు పండ్లు తీసుకోండి.. * పండ్లు తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పీచు పదార్థాలు, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు అందుతాయి. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. * భోజనానికి ముందు పండ్లు తీసుకోవడం వలన సగం కడుపు నిండి.. ఆహారం తక్కువగా తీసుకొంటారు. Thalaikoothal : చివరి స్నానం (తలైకూతల్).. * ఆపిల్, జామ, ద్రాక్ష, బత్తాయి తొనలు అంటే.. తొక్కతో పాటు తినగలిగే పండ్లను, తొక్కతో పాటే తినాలి. ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఎక్కువ పీచుపదార్థం తొక్కల్లోనే ఉంటుంది. * పండ్లు తినడం అలవాటు చేసుకొంటే.. వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు మన బరువు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. * పండ్లు తినే ముందు వాటిని ఒక 3 నిముషాలు ఉప్పు నీటిలో ఉంచి.. తర్వాత మంచి నీటిలో కడిగి తినాలి. ఎందుకంటే ఆపిల్ లాంటి పండ్లు ఎక్కువ నిల్వ ఉండడానికి కెమికల్ పూతలు పూస్తారు.
Tumblr media
Fruits మానసిక సమస్యల కారణంగా ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలౌతాయి. ఈ హార్మోన్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ ని అమాంతం పెంచేస్తాయి. సో.. ఫ్రూట్స్ తినడం వల్ల మానసిక ప్రశాంతత కల్గుతుంది. తద్వారా షుగర్ ను కొంత వరకు కంట్రోల్ లో ఉంచే అవకాశం ఉంటుంది. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Mangala Gowri Vratam : మంగళగౌరీ వ్రతం విశిష్టత..
Tumblr media
Mangala Gowri Vratam : శ్రావణమాసంలో ప్రతి మంగళవారం.. మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణంలో సోమవారం వ్రతానికి ఎంత ప్రాధాన్యత ఉందో మంగళవారం వ్రతానికి అంతే విశిష్టత ఉంది. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ప్రతి మంగళవారం కొత్త వస్త్రాలను ధరించి, ఉపవాసం ఉంటూ.. పండ్లు, పూలు, పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. మంగళగౌరీ వ్రతం విశిష్టత.. శ్రావణమాసంలో ప్రతి మంగళవారం పెళ్ళైన మహిళలు తమ భర్తలు దీర్ఘాయువుతో ఉండాలని మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. తల్లులు పిల్లల క్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. శ్రావణమాసంలో మొత్తం నాలుగు మంగళవారాలు ఈ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తయిదువులను పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ, కొబ్బరీ, పండు, తాంబూలంతో వాయనాలిస్తారు.. కుదిరితే అందరి ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు.. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.
Tumblr media
Mangala Gowri Vratam మంగళగౌరీ పూజా విధానం.. శ్రావణ మంగళవారం రోజున మహిళలు ఉదయాన్నే లేచి తలంటి కొత్త బట్టలు ధరించి పసుపు, కుంకుమలు ఆచరించి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ వ్రతంలో కొబ్బరికాయకి ఎరుపు రంగు జాకెట్ ముక్కను చుట్టి రాగి చెంబుపై పెట్టాలి. అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు,పెట్టి పూజ ప్రారంభించాలి. పూజ ముగిసిన తర్వాత మంగళ గౌరీ వ్రతం కథను చదవండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి పూజని ముగించండి. ఈ గౌరీ వ్రతాన్ని చేసిన రోజు ఉప్పు లేకుండా భోజనం చేయాలి. కేవలం ఒక పూట మాత్రమే ఆహారాన్ని తీసుకొని.. ఆ తర్వాత పాలు పండ్లు తీసుకోవాలి. ఇలా శ్రావణ మంగళవారం రోజున గౌరీవ్రతాన్ని చేయడం వల్ల పసుపుకుంకుమలు పదిలంగా ఉండి, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని ప్రతీతి. శ్రీ మాత్రే నమః... Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Voting : ఏమనాలి..!?
Tumblr media
Voting : డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుంటే వ్యభిచారి అంటాం.. మరి అదే డబ్బు కోసం ఓటు అమ్ముకునే వాళ్ళని ఏమంటాం..!? ఒళ్ళమ్ముకుంటే కలిగేది వ్యక్తిగత నష్టం.. ఓటమ్ముకుంటే జరిగేది సమాజ వినాశనం.. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Love : ప్రేమంటే ఇదేనా..!?
Tumblr media
Love : ఒకరు "నాది స్వచ్ఛమైన ప్రేమ" అంటారు. మరొకరు "నేను ఇంత సిన్సియర్ గా ప్రేమిస్తే నన్ను మోసం చేసింది/చేశాడు" అంటారు. మనం ప్రేమించినా/ స్నేహం చేసినా అది మానసికంగా ఆధారపడే మన బలహీనతే కానీ అవతలి వాళ్లని ఉద్ధరించడానికి కాదు. మనం ఒక వ్యక్తితో జీవితం పంచుకోవాలి అనుకున్నప్పుడు మన జీవితం వాళ్ళతో సంతోషంగా ఉంటుందా లేదా అని చూస్తాం కానీ అవతలి వ్యక్తి జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించం. మనం మన జీవితంలోకి ఎవరిని ఆహ్వానించినా అది మన అనందం కోసమే! ఇంతకాలం మనతో ఉన్న వ్యక్తి మనల్ని కాదని తన జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానిస్తే.. వాళ్ళను నువ్వు నిందిస్తూ, దాడులు చేస్తున్నావంటే.. అవతలి వ్యక్తి నీతో ఉండాలి అనుకుంటున్నావే తప్ప.. ఆనందంగా ఉండాలి అనుకోవట్లేదు..! Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Hair Fall Control : హెయిర్ ఫాల్ సమస్యకి సింపుల్ చిట్కా..
Tumblr media
Hair Fall Control : జుట్టు ఉన్నవాళ్ళకి దాని విలువ తెలియదు కానీ అది ఊడిపోతున్నప్పుడే అందులో ఉన్న బాధ అర్థమవుతుంది. ఆ తర్వాత రకరకాల షాంపులు, క్రీములు, ట్రీట్మెంట్స్ అని ఎన్ని డబ్బులు వృథా చేసిన ఫలితం శూన్యం. మనం తీసుకునే ఆహారం వల్ల కానీ లేదా మన జీన్స్ వల్ల కానీ, పొల్యూషన్స్.. కారణాలు ఏవైనా, ఎన్నైనా జుట్టు రాలడం అనేది సర్వసాధారణం అయిపోయింది. జుట్టు రాలడంతో చాలామందిలో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇంట్లోనే సహజంగా తయారు చేసుకున్న ప్యాక్ లు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Tumblr media
కావాల్సిన పదార్థాలు : * మెంతులు * అలోవేర * మందార ఆకులు * 2 స్పూన్ల కొబ్బరి నూనె/ ఆముదం / బాదం నూనె ● రాత్రంతా నానబెట్టిన మెంతులు మీ హెయిర్ లెన్త్ ని బట్టి రెండు లేదా మూడు స్పూన్లు తీసుకోండి. ఈ మెంతుల్లో బిటో కెలిటిన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ E వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. ● అలోవేర వలన ఆయుర్వేదపరంగా ఎన్నో ప్రయోజనాలున్న విషయం తెలిసిందే. అలోవేర ఫేస్ ని, స్కిన్ ని, హెయిర్ ని హెల్దీగా ఉంచుతుంది. ఈ అలోవేరలోని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ● మందార ఆకులు చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని ఆపుతుంది. అలాగే తల్లో ఉండే పేలు, డాండ్రఫ్ తగ్గేలా చేస్తుంది.
Tumblr media
తయారు చేసుకునే విధానం : రాత్రంతా నానబెట్టిన మెంతులు, అలోవేరా గుజ్జు, మందారకులు మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కొబ్బరినూనె లేదా రెండుస్పూన్ల ఆముదం, లేదా రెండు స్పూన్ల బాదం ఆయిల్ ఏదైనా మీకు అందుబాటులో ఉండేది అందులో వేసి అన్నీ బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసి అరగంట తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. New Born Mom : పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన ఆహారం.. మీరు ఫస్ట్ టైం పెట్టుకోగానే దీని రిజల్ట్ మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని ది కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ (The king of hair pack) అనొచ్చు. దీన్ని మీరు ఫస్ట్ టైం అప్లై చేయగానే మీ హెయిర్ ఊడిపోవడం ఆగిపోతుంది. సెకండ్ టైం పెట్టేసరికి మీ హెయిర్ పెరగడం మీకు అర్థమవుతుంది. మీరు ప్రతి వారం క్రమం తప్పకుండా దీన్ని పెట్టుకుంటే ఒక నెల రోజుల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Hichki Movie : రాణి ముఖర్జీ 'హిచ్కీ' మూవీ రివ్యూ..
Tumblr media
Hichki Movie :  Casting : Rani Mukerji, Supriya Pilgaonkar, Harsh Mayar Etc.. Director : Siddharth P. Malhotra Producer : Aditya Chopra, Maneesh Sharma Language : Hindi Release date : 23 March 2018 OTT Platform : Amazon Prime రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఓ సందేశాత్మక చిత్రం "హిచ్కీ". ఈ చిత్రంలో రాణి ముఖర్జీ 'నైనా మాథూరి' అనే పాత్రలో జీవించేశారు. నైనా.. టూరెట్ అనే సిండ్రోమ్ తో (మెదడులోని నరాల బలహీనత వల్ల వచ్చే ఒక వ్యాధి) బాధపడుతుంది. దీని ప్రభావంతో శరీరానికి షాక్ తగిలినట్లుగా అయి అసంకల్పితంగా చక్.. చక్.. వా.. వా.. అనే వింత శబ్ధం వస్తుంది. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎగతాళి చేసేవారు.
Tumblr media
Hichki Movie ఆమె వలన ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అనే కారణంతో నైనాను స్కూల్ లో చేర్చుకునేవారు కాదు. ఈ సమస్య వలన నైనా 12 స్కూల్స్ మారాల్సి వచ్చింది. చదువుకునే రోజుల్లోనే తనని అన్ని స్కూల్స్ నుంచి పంపించారు అంటే.. తనే ఒక స్కూల్ టీచర్ అవ్వాలంటే ఇంకెన్ని స్కూల్స్ తిరగాలో..!?? Trivikram Dialogues : త్రివిక్రమ్ పెన్ను నుంచి గన్నులా పేలిన డైలాగ్స్.. టూరెట్ సిండ్రోమ్ ని కారణంగా చూపి ఎన్నో స్కూల్స్ తన అప్లికేషన్ ను రిజెక్ట్ చేశాయి. కొందరైతే ఆ ఉద్యోగానికే నువ్వు పనికి రావు అంటూ అవమానించే వారు కానీ, నైనా పట్టువదల లేదు. దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు తను చదివిన సెయింట్ నోట్కార్ స్కూల్లో 9F విద్యార్థులకు బోధించే అవకాశం వచ్చింది. ఆ 9F లో ఉండే విద్యార్థులు స్కూల్ మొత్తానికి తలనొప్పి లాంటి వారు.
Tumblr media
Hichki Movie ఆ క్లాస్ కి వచ్చిన ఏ టీచర్ అయినా కొన్నాళ్ళకే రిజైన్ చేసి వెళ్లిపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 9F తరగతిలో ప్రవేశించిన నైనా టీచర్ ఎన్నాళ్ళు ఉన్నారు.. ఆ విద్యార్థులు టీచర్ తో ఎలా ఆడుకున్నారు.. ఆ టీచర్ స్టూడెంట్స్ కి ఏం నేర్పించింది, ఎలా నేర్పించిందో తెలియాలంటే మాత్రం హిచ్కీ చూడాల్సిందే. Thalaikoothal : చివరి స్నానం (తలైకూతల్).. "ఒక సాధారణ ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు, ఓ మంచి ఉపాధ్యాయుడు వివరిస్తాడు, ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు, అత్యుత్తమ ఉపాధ్యాయుడు స్ఫూర్తినిస్తాడు" అన్న మాటలే ఈ సినిమాకి స్ఫూర్తి అనుకుంటా. Bad Students ఉండరు, Bad Teachers మాత్రమే ఉంటారు అనే మాటలు మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Tumblr media
Hichki Movie ఒక సినిమా చూశాక మళ్లీ అదే సినిమాని కొన్నాళ్లకు చూడాలంటే చాలా బోర్ గా ఫీల్ అవుతాం కానీ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అదే హిచ్కీ మూవీ మహాత్యం. ఇంకా ఈ మూవీ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది మిస్ అవ్వకుండా చూడండి. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Atukula Garelu : అద్భుతమైన అటుకుల గారెలు..
Tumblr media
Atukula Garelu : ఇంట్లో కాసిని అటుకులు ఉంటే చాలు. ఇన్స్టెంట్ గా ఎన్నో వంటలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం... రుచికి రుచి. అటుకులు వివిధ రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అటుకులతో వివిధ రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా అటుకులతో మిక్చర్, పోహా వంటివి తయారు చేస్తుంటారు. అయితే ఇవే కాకుండా రకరకాల పదార్థాలను చేసుకోవచ్చు. అందులో ఒకటి అటుకుల గారెలు (వడలు) చేసుకోవడం ఇంత సింపుల్ లా అనిపిస్తుంది కానీ దాని రుచి మాత్రం అద్భుతం. తిన్నవాళ్ళు ఎవరైనా వహ్వా.. అనాల్సిందే.
Tumblr media
అటుకుల గారెలు కావలసిన పదార్థాలు : అటుకులు - ఒక కప్పు, శనగపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు బియ్యప్పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ - ఒకటి అల్లం తురుము - ఒక టీ స్పూను తరిగిన పచ్చిమిర్చి - ఆరు పసుపు - పావు టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను కొత్తిమీర - ఒక కట్ట నూనె - వేగించడానికి సరిపడ ఉప్పు - రుచికి సరిపడ తయారీ విధానం : అటుకులను అర కప్పు నీటిలో పది నిమిషాలు నాన బెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక చిన్నచిన్న వడలు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండు వైపులా ఫ్రై చేసుకుని.. కొబ్బరి పచ్చడి లేదా టమాట పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
ప్రసాదం : ప్రసాదం అంటే ఏంటో తెలుసా..!?
Tumblr media
ప్రసాదం : భగవంతుని ప్రసన్నం చేసుకుని సమర్పించిన ఆహారాన్ని "ప్రసాదం" అంటారు. ఆహారాన్ని భక్తులు తీసుకుంటే మానసిక, శారీరక రుగ్మతలు పోతాయని నమ్మకం. ప్రతి గుడికి ఒక్కో ప్రసాదం, దానికి ప్రత్యేక విధివిధానం, వాడే పదార్థాలు, చేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఇక్కడే మనకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. మరే ఏ మతంలో లేని సామాజిక న్యాయం మనకు ఈ ప్రసాద వితరణలో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు.
Tumblr media
ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండకపోవడంతో.. అందరికీ తినడానికి బలమైన ఆహారం అందించడానికీ.. పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఈ ప్రసాదంలో ఉండేలా ప్రసాదంగా పెడతారు. తద్వారా ఊరిలోని జనాలందరికీ బలం, ఆరోగ్యం అందివ్వాలనేది మన పెద్దల ఉద్దేశ్యం. తిరుపతి లడ్డూ.. కలియుగ దైవం తిరుమలేశుడికి నైవేద్యంగా లడ్డూని సమర్పిస్తారు. ఈ లడ్డూకి 307 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఆగస్టు 2వ తేదీ 1715 సంవత్సరంలో మొదటిసారి లడ్డూ తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టారని చరిత్ర చెబుతుంది. ఈ తిరుపతి లడ్డును, ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. తాము తిరుపతికి వెళ్లి వచ్చాము. తమకి కలిగిన అలోకిక ఆనందం మిగతా వారు కొంతైనా అనుభవించాలని వారూ భావిస్తూ.. తిరుపతి నుంచి తెచ్చిన "లడ్డూ"ని ప్రసాదంగా పెట్టి సంతోషపడతారు. అంతేకాదు తిన్న వారికి పంచిన వారికి పుణ్యమని వారి నమ్మకం.
Tumblr media
Tirupati Laddu శబరిమల.. తిరుపతి (Tirupati) లడ్డూలకి ఉన్న ప్రాముఖ్యతే శబరిమల ప్రసాదానికి కూడా (Sabarimala Prasadam) ఉంది. ఎవరైనా శబరిమల వెళ్తున్నారంటే ప్రసాదం మాకు కూడా తీసుకుని రా.. అని చెప్పి తెప్పించుకుంటుంటారు. అన్నీ సీజన్‌లలో దొరకని ఈ ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ. అందుకే శబరిమలై వెళ్లే భక్తులు కాస్త ఎక్కువ ప్రసాదాన్నే తెచ్చుకుంటుంటారు. అన్నవరం.. 19వ శతాబ్దిలో కలకత్తా నుంచి చెన్నై వరకూ వేసిన రైళ్లు అన్నవరం మీదుగా వెళ్ళేవట. ఆ రైలుకట్ట నిర్మించడానికి వచ్చిన ఉత్తరాది వారి గోధుమలు.. స్థానిక ఆహారంపై ప్రభావం పడుంటుందని, ఆ ఉత్తరాది కూలీలు చేసుకునే గోధుమల రవ్వ వంటకాన్ని చూసి, నేర్చుకుని దాన్ని స్థానికులు స్వామివారికి.. గోధుమనూకతో తయారు చేసే అన్నవరం ప్రసాదం అప్పుడు ప్రారంభమైందని ప్రతీతి. అయితే ఈ విషయాన్ని నిరూపించడానికి.. దేవస్థానం అధికారుల వద్ద ఖచ్చితమైన వివరాలు ఏమి లేవు. గోధుమలతోనే ఈ ప్రసాదం తయారు చేయడం వెనుక ఉత్తరాది (కలకత్తా) వారి ప్రభావం ఉందని అన్నవరం ప్రాంతంలో ప్రచారం ఉంది.
Tumblr media
Annavaram Prasadam అయ్యప్ప స్వామి ప్రసాదం.. శబరిమల ఆలయంలోని ప్రసాదం అరవన పాయసం. ఇది నల్లగ బెల్లం పాకంతో అమ్మడానికి ఒక నెల ముందు నుంచి తయారు చేస్తారు. దీన్ని బియ్యం, నెయ్యి, చక్కెర ఇంకా బెల్లం ఉపయోగించి తయారు చేస్తారు. శబరిమల ఆలయంలో ప్రసాదం తయారు చేయడానికి అవసరమైన బియ్యాన్ని"చెట్టిగులంకర దేవి" ఆలయం సరఫరా చేస్తుంది. Covid 19 తర్వాత Home Delivery Rs450 చొప్పున అందచేశారు. హిందూ గుళ్ళలో పెట్టే ప్రసాదం భక్తులు ఆకలితో ఉండకూడదని, కనీసం ఏడాదిలో కొన్నిరోజులు అయినా వాళ్ళ ఆరోగ్యరీత్యా మంచి పోషకాలు ఉన్న ఆహారం విక్రయించడాకి ఆచారంగా వస్తోంది. ఎప్పటి నుండో ఉన్న ఈ ఆచారం అనాచారం అయ్యింది. ప్రసాదానికి అర్థమే మార్చేసి.. అక్కడ కూడా కులాలు, వర్గాల రంగు పులిమారు. డబ్బులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు తిరుపతి లడ్డూ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎన్ని కావాలి అంటే అన్నీ.. ఎంతకు అంతా డబ్బులు ఇవ్వు మహదేవా అని ప్రసాదం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Politics : BRS మూడోస్థానం.. ఆంధ్రలో హారాహోరి..
Tumblr media
Politics : తెలంగాణాలో ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అని కర్ణాటక ఎన్నికలు ఊపులోనే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ అందరం వింటున్నాం. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిస్తే BRSకి మూడో స్థానమే అని కొందరు అంటున్నారు. ఇదే నిజం అయితే BRS పరిస్థితి ఏంటీ.. ఏమీ చేసి తిరిగి బయట పడొచ్చు అని కొంచెం ఆలోచిస్తే.. బీజేపీ పుంజుకుంటే BRSకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి BRSకి గొప్ప మేలు జరుగుతుంది. బీజేపీ పుంజుకోకుంటే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే.. కమ్యూనిస్ట్ లతో BRSతో కలిస్తే కొంచం అయినా ఓట్ల సహాయం అంటే 1000-5000 ఓట్లతో అయినా గెలవచ్చు.
Tumblr media
ఒక్కో BRS MLA.. అందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారా BRSతో కలిసేందుకు అని చూస్తే.. కమ్యూనిస్టులు KCR మీద కోపంగా గుర్రుగా ఉన్నారటా.. మునుగోడు ఉపఎన్నికలు తర్వాత KCR కమ్యూనిస్టులకి ఒకసారి కూడా అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు అన్న కారణంతో కోపంగా ఉన్నారని.. ఈసారి కమ్యూనిస్టులు తిరిగి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని కసిగా పట్టుదలతో ఉన్నారని ఓ ప్రముఖ ఛానెల్ కథనం. ఈ కథనమే నిజమయితే.. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే BRSకి మూడోస్థానం వచ్చినా ఆశ్చర్యం లేదు. Bro The Avatar : ‘బ్రో’లో ఏపీ ప్రభుత��వంపై పవన్ పంచులు.. ఒకవేళ బీజేపీ పుంజుకుంటే తప్పా.. మరి BRS ఏమీ చేస్తే మేలు జరుగుతుంది.. తెలుగుదేశం అవసరం చాలా ఉంటుంది అని అర్థం అవుతుంది. తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే BRSకే మేలు లేదా తెలుగుదేశం BRS కలిసి పోటీ చేస్తే ఇంకా BRSకే మేలు. అంటే BRS వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఒకటో స్థానం.. ఓడిపోతే మూడో స్థానం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఏపీ రాజకీయం.. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ, జనసేన కూటమి ఖరారు అయిపోయింది కానీ, బీజేపీ ఈ కూటమిలో కలుస్తుందా లేదా అని చూస్తుంటే.. దాదాపు కలిసేలాగే ఉన్నట్టు అర్థం అవుతుంది. దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త కమిటీనే.. మా పొత్తు టీడీపీతో కాదు కేవలం జనసేనతోనే అంటూ ఉండగానే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుండి సోము వీర్రాజుని తొలగించి పురందరేశ్వరి కొత్త అధ్యక్షురాలుగా బీజేపీ ప్రకటించడమే దీనికి నిదర్శనం అని ప్రజల అనుమానం.
Tumblr media
ఇంచార్జిగా సునీల్ డియోధర్ తీసేయడం కూడా ఆ అనుమానాకి ఆద్యం పోసినట్టు అయింది. బీజేపీ, టీడీపీతో ముఖ్యంగా కలిసేది పార్లమెంట్ ఎన్నికల కోసమే అన్నట్టుగా ఉంది.. సగానికి సగం అంటే 10-15 ఎంపీ సీట్లు బీజేపీ బ్లాక్ చేస్కొని టీడీపీని తమ దగ్గర లాక్ చేసేలా ఉంది బీజేపీ. నిజం చెప్పాలంటే తెలంగాణాలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే బలమైన నేతలు బీజేపీకి ఉన్నారు కానీ ఓటర్లు క్యాడర్ లేదు. అందుకనే ఎక్కువ ఎంపీ సీట్లు పోటీ చెయ్యాలని బీజేపీ అనుకుంటుంది. Manipur Violence : ది మణిపూర్ స్టోరీ.. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయడమే ముఖ్య లక్ష్యంతో పవన్ ఉన్నారు. అదే జరిగితే కూటమి MLAల సంఖ్య 34 నుంచి మొదలు అవుతుంది. ఎన్నికల రిజల్ట్స్ సమయంలో.. ఇక వైస్సార్సీపీ ఓటమి దాదాపు ఖాయం.. కానీ వైస్సార్సీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అని అనడానికి లేదు. ఎందుకంటే రెడ్డి, దళితులు, ముస్లిం బలమైన ఓటు బ్యాంకుతో వైస్సార్సీపీ బలంగా ఉంది.
Tumblr media
మరోవైపు సంక్షేమ పథకాలు పొందుతున్న పేదలు చాలా ఆనందంతో ఇంకోసారి జగన్ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ ఈక్వషన్స్ తో ఒక సర్వే లో వైస్సార్సీపీ గెలవగా ఇంకో సర్వేలో టీడీపీ కూటమి గెలుస్తుంది అని వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలు, రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు మొత్తం 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రాయలసీమ 52 స్థానాల్లో కనీసం సగానికి పైగా టీడీపీ గెలవాలాని ఆశిస్తుంది. దీనికి తోడు విచిత్రంగా కడప ఎంపీ సీటు కూడా తమదే అనే ఆత్మ విశ్వాసంతో కడప జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. Indian Drainage System : మన డ్రైనేజీ సిస్టమ్ ఎందుకిలా..!? తర్వాత పక్కన ఉన్న నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి, వేంకటగిరి MLA ఆనం & ఉదయగిరి MLA మేకపాటి వైస్సార్సీపీ సస్పెండ్ చేయగా ఈ ముగ్గురు MLAలు టీడీపీలో చేరేసినట్టుగా పార్టీ పనుల్లో బిజీ అయిపోయారు. ఇదే నెల్లూరు జిల్లా నుండి మరో ఇద్దరు MLAలు వైస్సార్సీపీ నుండి టీడీపీ చేరుతారని నెల్లూరు టీడీపీ సీనియర్ నేత బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో సూళ్లూరుపేట సర్వేపల్లి మినహాయించి మిగతా నియోజకవర్గాలకి MLA అభ్యర్థులు టీడీపీ నుండి సిద్ధంగా ఉన్నారు.
Tumblr media
అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇక సర్వేపల్లి విషయానికి వస్తే నెల్లూరు ఎంపీ వైస్సార్సీపీ నుండి టీడీపీకి వస్తారని.. ఆదాల గారికి సర్వేపల్లి MLA టికెట్ ఇచ్చి సోమిరెడ్డి గారిని నెల్లూరు ఎంపీ గా పోటీ చేయించాలని చూస్తుంది టీడీపీ. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు & రాయలసీమ జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నం అని అర్థం అవుతుంది. ఇక చంద్రబాబు బీజేపీ NDAతో చేరుతారా లేక ప్లాన్ Bతో KCRతో పాటు విపక్షాలు ఇండియా కూటమి లేదా సొంత ఫెడరల్ ఫ్రంట్ కూటమి పెడతారు అనేది వేచి చూడాల్సిందే..! Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Thalaikoothal : చివరి స్నానం (తలైకూతల్)..
Tumblr media
Thalaikoothal : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవో.. వాటి మాటనే భయంకరమైన ఆచారాలు కూడా దాగున్నాయి. అలాంటిదే తమిళనాడులోని దక్షిణ ప్రాంతాల్లో జరిగే తలైకూతల్ (Thalaikoothal) ఒకటి. తలైకోతల్ అంటే.. వయసు మీద పడి, ఇతరుల మీద ఆధారపడే ముసలి వాళ్లను, వాళ్ల కుటుంబీకులే ఎటువంటి నొప్పి కలగకుండా చంపే పద్ధతి. చివరి స్నానంగా అని పిలవబడే.. తలైకూతల్ లో తలై అంటే.. 'తల'.. కూతల్ అంటే.. స్నానం.
Tumblr media
తమిళనాడులో చాలా ఏళ్ల నుంచి ఈ దురాచారం కొనసాగుతోంది. వాళ్లు తమ ఇంట్లో మంచాన పడిన ముసలి వాళ్లకు.. పొద్దున్నే నూనెతో తలంటి పోసి, వారిచేత చాలా గ్లాసులు లేత కొబ్బరి నీళ్ళు తాగిస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ల కిడ్నీలు చెడిపోయి, తీవ్రమైన జ్వరంతో ఆ వ్యక్తి నాలుగు గంటలు లేదా ఒక రోజులో చనిపోతాడు. Artificial Intelligence : మన బ్రెయిన్ మనకు ఉండగా.. అరకొర బ్రెయిన్ ఎందుకు దండగా.. నూనెతో తలకు పోయడం కాకుండా చల్లని నీళ్ళతో కూడా పోస్తారు. అలాగే దీనికోసం అల్యూమినియం పొస్పట్ ను వారు తినే అన్నం లో కలుపుతారు. దీంతో ఆ వ్యక్తి త్వరగా చనిపోయే అవకాశం ఉంది. ఇంకా పని త్వరగా పూర్తి కావడానికి కెమికల్ ఇంజక్షన్స్ ని కూడా వాడతారు. అసలు ఇది ఎందుకు చేస్తారంటే.. వయసు మీద పడి ఒకరి మీద ఆధారపడే వాళ్ల తల్లిదండ్రులని పోషించడం.. వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లు ఆ వృద్ధులను ఒక పనికిరాని చెత్త లాగా చూస్తారు.ఈ దూరాచారాన్ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటిసారిగా 2010లో FIR File చేశారు. తమిళనాడులోని విరుద్ నగర్ కి చెందిన ఒక ముసలాయన తనని చంపేసిన తర్వాత.. అతని కొడుకులు ఆస్తిని ఎలా పంచుకుంటారో మాట్లాడుకుంటున్నప్పుడు అతను విని అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ విషయం చట్టం దృష్టిలోకి వచ్చింది.
Tumblr media
ఆ తర్వాత చట్టం రంగంలోకి దిగి ముసలి వాళ్లకి ఆ��్థిక సహాయం అందించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఈ దూరాచారాన్ని వాళ్లు ఆపలేదు. ఎవరైనా దీని గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తే.. ఊరంతా కలిసి వాళ్ళ మీద విరుచుకుపడతారు. ఆ తంతు అంతా నాలుగు గోడల మధ్యే జరుగుతుంది. ఇలా చేసేటప్పుడు కొంతమంది వారి బంధువులను కూడా పిలుస్తారు. Farmers Suicide in India : దేశానికి రాజు, వెన్నుముక “రైతు”.. ఈ సాంప్రదాయం గురించి న్యూస్ సెవెన్ చానల్ కి చెందిన "ప్రమీల కృష్ణన్" అనే జర్నలిస్టు, స్వయంగా అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడిన తర్వాత, కొంతమంది ముసలివాళ్లు ఈ దూరాచారాన్ని సమర్థిస్తున్నట్లు తెలిసింది. ముసలి వాళ్ళమై ఎవరి మీదైన ఆధారపడే కంటే.. చనిపోవడం ఉత్తమం అని వారన్నారు. అయితే చాలామంది ముసలి వాళ్లు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆచారం చట్టం దృష్టికి వచ్చిన తర్వాత చాలామంది ముసలివాళ్లు అక్కడ నుంచి పారిపోయి మానసిక ధైర్యంతో సంతోషంగా జీవిస్తున్నారు. తర్వాత ముసలి వాళ్లకు ప్రభుత్వం పింఛను ద్వారా డబ్బు ఇస్తున్నప్పటి నుంచి ఇది చాలావరకు తగ్గిందని సమాచారం వచ్చింది కానీ... అది నిజం కాదని త్వరలోనే తేలింది.
Tumblr media
ఇతర దేశాల్లో కూడా.. ఇలాంటి సంప్రదాయం మన భారతదేశంలోనే కాదు, కెనడియన్ ఆర్కిటిక్ లో ముసలి వాళ్లను కత్తులతో గన్స్ తో చంపేవారు. ఉత్తర ఆఫ్రికాలో ముసలి వాళ్లను జంతువుల తోకలకు కట్టివేసి చంపేవారు. తూర్పు సైబీరియాలో అయితే మంచాన పడిన ముసలి వాళ్లను ఊరంతా కలసి కర్రలతో కొట్టి కానీ, గొడ్డలితో నరికి కానీ చంపుతారు. ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా వారు తమ పెద్ద వాళ్ళని ఎటువంటి నొప్పి కలగకుండా పరలోకానికి పంపుతామని చెప్పారు. ఈ సంప్రదాయం మీద జనవరి 15, 2010 లో,"Deccan Chronical", జనవరి 16,2013 లో "Los Angeles Times", మార్చి 20, 2010 లో "The Hindu" వంటి పెద్ద పెద్ద వార్త పత్రికలు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఈ సాంప్రదాయం డబ్బున్న వాళ్ళ ఇంట్లో చాలా అరుదుగా చోటుచేసుకుంటుందని తేలింది. ఇప్పటిదాకా ప్రభుత్వం చాలా మందిని అరెస్టు చేసింది. అయినా కూడా నాలుగు గోడల మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
Tumblr media
పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్లను చూసుకోవడానికి ఎవరైనా ఉండేవారు ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగాల కోసం బయటి ప్రాంతాలకి వెళ్ళటం కూడా ఈ ఆచారం పెరగటానికి ఒక కారణం. ఏదేమైనా ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. ఇదే పరిస్థితి రేపు వాళ్లకూ ఎదురవ్వొచ్చు.. ఈ ఆచారంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సముద్రఖని ముఖ్యపాత్రలో "తలైకూతల్" అనే మూవీ కూడా వచ్చింది Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Women Freedom : ప్రతి అమ్మాయి కోరిక..
Tumblr media
Women Freedom : పొద్దున్నే లేస్తూనే అడుగులు వంటింట్లోకి దారి తీయనప్పుడు.. ఇంట్లో పనులన్నీ చేసి ఆఫీస్ కి వెళ్తే.. అక్కడ ఏ మాత్రమైన లేట్ అయినా ఆఫీస్ నుంచేనా వచ్చేది అన్న చూపులు మనల్ని గుచ్చుకొనప్పుడు, కాస్త టైం దొరికితే (వీలుచేసుకొని) కొంచెం పనుందంటూ మన ఫోన్ ని ఎంక్వయిరీ చేయనప్పుడు, ఇంట్లో నుంచి బయటికెళ్లేప్పుడు ఇంకొకరి పర్మిషన్ అడగాల్సిన అవసరమే లేనప్పుడు, ఏ టైంలో అయినా నచ్చిన Social Media Platformలో ఉండగలిగి.. తెల్లారిందని బలవంతంగా లేపే వాళ్లే లేనప్పుడు అప్పుడు ఎందుకుండదు జీవితం HAPPYగా.. Character Assassinate : పుట్టుకే.. విమర్శతో మొదలైంది.. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Character Assassinate : పుట్టుకే.. విమర్శతో మొదలైంది..
Tumblr media
Character Assassinate : నొప్పి ఎవరికైనా ఒకేలాంటి ఫీల్ ఇస్తుంది. జెండర్ వేరని కాలు విరిగితే నొప్పి ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ రాదు కదా..!? మరి మిగతా ఫీల్స్ అలా ఉండవా అంటే.. సొసైటీలో మాట్లాడే మాటలను, మనుషులను బట్టి ఉండవనే చెప్పాలి. ఇక్కడ చూసే విధానాన్ని బట్టి లైఫ్స్ స్పాయిల్ అయిపోతున్నాయి. ఈ పక్షపాతం ఎక్కడ మొదలైనా ఇప్పుడు దాన్ని పెంచి పోషిస్తుంది మాత్రం మనమే. దీనికి ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకు ఉండొచ్చు.. కానీ కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలిగా.. కొంతమంది హీరోయిన్లు ఒకరితో డేట్ చేసో, ప్రేమించో, పెళ్లి చేసుకొనో విడిపోయిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఆ కేటగిరీలో చిన్నాపెద్దా అనే తేడా లేదు! నాటి విశ్వసుందరి ఐ్వర్యరాయ్ నుంచి నేటి సూపర్ స్టార్ నయనతార, సమంత, రష్మీక, మధుప్రియ వరకు అందరూ బాధితులే. వీళ్లంతా ప్రేమ, పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పిన వాళ్లే.. కారణాలు వాళ్ల వ్యక్తిగతం అయినప్పటికీ..
Tumblr media
అయితే వీళ్లకు దక్కిన అరుదైన ఘనత మాత్రం వాడుకుని వదిలేశారని, అవునూ.. వాడుకొని వదిలేసారనే అనుకుందాం.. అసలు ఏ హీరో కానీ ఏ అబ్బాయి కానీ వాళ్ళ రిలేషన్ కి బ్రేకప్ చెప్పలేదా.. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళ విషయంలు మాత్రమే ఎందుకు ఎక్కువ ట్రోల్ (Troll) అవుతున్నాయి. ఆడవాళ్ళు మాత్రమే Troll కి ఎందుకు ఎక్కువగా గురవుతున్నారు..!? నిజమే.. చాలాసార్లు ఆడవాళ్ళు ప్రేమించి.. పెళ్లికి మాత్రం కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారు. దానికి కారణం ఆమె జీవితాన్నీ పెద్దల అభిప్రాయాలు, ఆలోచనలు, అడ్డుకట్ట వేస్తాయి. ఆడవాళ్ళు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంత మోసం చేశారు.. ఇంత మోసం చేశారని మాట్లాడే "మహానుభావులు" మీ ఇంట్లో ఉన్నా అమ్మని కానీ, భార్యని కానీ, అక్కని, చెల్లిని కానీ ఆఖరికి కూతురినైనా నువ్వు ఎవరినైనా ప్రేమించేవా అనే ధైర్యం ఉందా మీకు..!? అమ్మాయి మోసం చేసిన సినిమాలను చూసి.. (Baby, RX100) ఊగిపోతూ బండబూతులు తిట్టే ప్రతి ఒక్కరూ.. తనని తాను ప్రశ్నించుకుంటే.. మీ ప్రేమ కథ విషాదం ఎందుకయ్యిందో తెలుస్తుంది. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
New Born Mom : పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన ఆహారం..
Tumblr media
New Born Mom : గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి స్త్రీ జీవితంలోనూ అద్భుత‌మైన, ఆనంద‌క‌ర‌మైన సమయం. అయితే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండే ఆడవాళ్లు.. డెలివరీ తర్వాత త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్ట‌డం మానేస్తుంటారు. కానీ అలా చేయ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది. నిజానికి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కంటే డెలివరీ తర్వాతే బాలింతకే పౌష్టికాహారం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా, బ‌లంగా మార‌తారు.
Tumblr media
Healthy Food సాధార‌ణంగా బాలింత‌ల్లో ర‌క్తహీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్‌, తేనే, బెల్లం, అలాగే రెగ్యులర్ గా చేసే బ్రేక్ ఫాస్ట్ కాకుండ రస్క్&బ్రెడ్ పాలు తీసుకోవాలి. పొద్దున్న 7 To 8 తినేయాలి. 12 To 1లోపు ఒక కప్పు రైసు ఒక చపాతి అందులో కూరలు కూడా ఏది పడితే అది కాకుండా బీరకాయ, తోటకూర, పాలకూర, పొట్లకాయ, దొండకాయ, ఇలా కొన్ని పద్యం కూరగాయలు మాత్రమే తినాలి. IPhone-14 : ఐఫోన్ కోసం బిడ్డను అమ్మిన తల్లి.. సాయంత్రం 4కి డ్రై ఫ్రూట్స్ నువ్వుల ఉండలు పల్లీల లడ్డు ఇలాంటివి తీసుకోవాలి. నైట్ 7కి కచ్చితంగా డిన్నర్ రెండు చపాతీలు లేదా మినప్పిండి రొట్టె తీసుకోవాలి. నైట్ 9కి పసుపు, మిరియాల పాలు ఒక గ్లాసు తీసుకోవాలి. సొంటి పొడి వెల్లుల్లి ప్రతిరోజు ఏదో ఒక్కవిధంగా మీ ఆహారంలో తీసుకోవాలి. దోరగా పండడం, బప్పాయి తినడం వల్ల పాలు పుష్కలంగా పడతాయి.
Tumblr media
New Born Mom అలాగే చిన్న, చిన్న చేపలు పాలపరిగెలు అంటారు. వాటిని తినడం వల్ల కూడా పాలు పడతాయి. చికెన్, ఫిష్ ఏది కనీసం మూడు నెలల వరకు తినకూడదు. మటన్ లో కైమా వారంలో రెండు, మూడుసార్లు తిన్న మంచిదే. C స��క్షన్ అయిన వాళ్లకి కుట్లు తొందరగా మానిపోతాయి. డెలివరీ తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతంతో అష్టైశ్వర్యాలు.. నరాలు ఎముకలు అన్ని వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. అలాగే మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా అలసటగా ఈ టైంలో రెస్ట్, మంచి ఫుడ్ చాలా అవసరం. మీరు పిల్లలకి పాలిస్తూ అలాగే కొన్నికొన్ని జాగ్రత్తలు, పౌష్టిక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకుంటే మీరు మీ సంతానం ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉంటారు. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Drinking Water : నీళ్లు తాగడం కూడా ఒక ఆర్ట్..
Tumblr media
Drinking Water : నీరు తాగడం మన ఆరోగ్యానికి మంచిది మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా అనే డౌబ్ట్ చాలామందికి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఆహారం తీసుకున్న వెంటనే కొందరు ఫుల్‌గా నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్న తర్వాత పరిమితంగానే నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకోవడానికి, నీరు తాగడానికి మధ్య కనీసం అరగంటైనా గ్యాప్ ఉండాలి. ఆహారం తినటానికి కనీసం 40 నిమిషాల ముందు మాత్రమే నీటిని త్రాగాలి. ఆహారం తిన్న తర్వాత నోరు మరియు గొంతును శుభ్రం చేసుకోవటానికి వెచ్చని నీటిని రెండు లేదా మూడు సిప్స్ తీసుకోవచ్చు.
Tumblr media
Hot Water నిజంగా దాహం ఉంటే కనుక.. ఉదయం భోజనం తర్వాత సీజనల్ పండ్ల తాజా రసం మరియు లంచ్ తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తర్వాత పాలను తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎక్కువగా నీరు కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి జీర్ణక్రియల కోసం శరీరానికి సహాయం చేస్తాయని వైద్యులు అంటున్నారు. World Sparrow Day : ఈ పిచుకలు కనబడుట లేదు.. నీరు తాగడంలో మరికొన్ని టిప్స్.. * జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు వేడి వేడి టీ తాగండి. * ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని త్రాగాలి. * గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు చల్లని నీటిని తాగకండి. * చల్లని నీరు త్రాగటం వలన వివిధ అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. తద్వారా గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, మెదడు రక్తస్రావం వంటి రోగాలకు దారి తీస్తుంది. అందుకే.. దాహం వేయగానే గ్లాస్ లకు గ్లాస్ ల నీళ్లు తాగడం కాదు.. వాటర్ తాగడం కూడా ఒక ఆర్ట్. Farmers Suicide in India : దేశానికి రాజు, వెన్నుముక “రైతు”.. Read the full article
0 notes
7insidefacts · 1 year
Text
Money Heist Web Series : 'మనీ హెయిస్ట్' వెబ్ సిరీస్ రివ్యూ..
Tumblr media
Money Heist Web Series : ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎల్లలు లేవు. అందుకే లోకల్‌ కంటెంట్‌తో పాటు గ్లోబల్‌ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సీరీసుల్లో ‘మనీ హెయిస్ట్’ (Money Heist) ఒకటి స్పానిష్ (Spanish) లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ వెబ్ సీరిస్ తొలి సీజన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ (Netflix) పుణ్యమా అని ఊహించని విధంగా అందరికీ ఫేవరెట్ అయ్యింది.
Tumblr media
మనీ హెయిస్ట్‌ ఒరిజినల్‌ (స్పానిష్‌) టైటిల్‌ ‘లా కాసా డె పాపెల్‌’ (La casa de papel). బ్యాంకుల దోపిడీ (హెయిస్ట్‌) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. మంచి – చెడు అనేది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. దొంగతనం నేరం. కానీ ఓ వ్యక్తి తన వారి కడుపు నింపడానికి గత్యంతరం లేక ఆ పని చేస్తే.. ఆ తప్పును కూడా సానుభూతితో చూసేవారు ఉంటారు. ‘మనీ హెయిస్ట్’ వెబ్ సీరిస్ ఈ పాయింట్ మీద నడుస్తోంది. Megastar Chiranjeevi : మెగాధీరుడు.. ఈ సిరీస్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్‌ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్‌ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్‌వాల్వ్‌ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఓ సంవత్సరం క్రితం అనుకుంటా అందరూ Money Heist మేనియాలో ఉన్నప్పుడు, హా నా రేంజ్ కి Family Man, Suid Game లే ఎక్కువ అనుకోని వదిలేసా. కానీ ఒక్కసారి స్టార్ట్ చేసాక.. ఒక్క పార్ట్ అయిపోగానే తిండి, నిద్ర మానేసి దానిమీదే పడిపోయాను. మైండ్ లో మొత్తం Professor, Raquel, Berlin, Tokyo, Nairobi ఇవే తిరుగుతున్నాయ్.
Tumblr media
ఓ పెద్ద Robbery ని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ ని ఓ Professor ప్రేమించడం ఏంటో.. ఆ పెద్ద Robbery కి Master Plan వేసిన ఈ Professor ని ఆ Inspector ప్రేమించడం ఏంటో.. వీళ్లిద్దరిని మనం ప్రేమిస్తూ.. ఎప్పుడు ఏం చేస్తున్నారో ఏంటో.. అని వేయి కళ్ళతో మనం ఎదురు చూడ్డం ఎంటో.. అంతా Money Heist మాయలా ఉంటది..! దోపిడీ సమయంలో ప్రేమలో పడకూడదు అంటారు కానీ అప్పటికే వాళ్ళందరితో మనం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయుంటాం. వాళ్లంతా దొంగలు అన్న ఫీల్ మనకు ఎప్పుడూ రాదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు, బంగారం కంటే మన విలువైన మనసులు దోచుకుంటారు. అందుకే వాళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వుతాం.. వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాం.. చివరకు వాళ్ళతో పాటు ఏడ్చేస్తాం.. Gangubai Dialogues : గంగూబాయి క్లైమాక్స్ పవర్ఫుల్ డైలాగ్స్.. Berlin మిగతా వాళ్లకోసం తన ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు.. Rio ని పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నప్పుడు.. Raquel ని Shoot చేసినప్పుడు Professor కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూసినప్పుడు.. Mascow చనిపోయినప్పుడు.. Nairobi ని ఓ పిచ్చినా కొడుకు చంపినప్పుడు.. అన్నిటికంటే ముఖ్యంగా TOKYO ఇంకాసేపట్లో చనిపోపోతుంది అని మనకు తెలిసినప్పుడు.. మనకు తెలీకుండానే కన్నీళ్లొచ్చేస్తాయ్..
Tumblr media
అదేంటో.. ఆ Professor ని ఎంతసేపు చూసినా అలానే చూడాలి అనిపిస్తుంది. ఏదో Magic ఉంది ఆయనలో.. కాసేపు ఆయనతో ఎవరు మాట్లాడినా ప్రేమలో పడిపోతారు ఆఖరికి పోలీసులతో సహా.. Tokyo.. ఈ Character గురించి ఏం చెప్పలేం ఆమెని చూడాలి అంతే. తను చనిపోయినప్పుడు ఓ మాట అంటారు. "Tokyo కి స్వర్గంలో బోర్ కొట్టి చనిపోయింది" అని. దీన్నిబట్టి Risk తీసుకోవడం అంటే టోక్యోకి ఎంత ప్రేమో అర్థమవుతుంది. TOKYO.. ఈ పేరులోనే ఏదో Energy ఉంది, Love ఉంది, Risk ఉంది, ఆ పేరులో ఇంకేదో తెలీని Emotional Feel ఉంది. ఆమెను చూస్తూ.. LOVE YOU TOKYO అని ఎన్నిసార్లు అనుకుంటామో గుర్తే ఉండదు.. Love Failure : ఉన్నది ఒకటే జిందగీ.. కొన్ని గుర్తుండిపోయే డైలాగ్స్.. * నిజానికి Accident అవ్వడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వదు. దాని చుట్టూ జనాలు గుమిగూడడం వల్ల అవుతుంది. * నీ జీవితం అస్తవ్యస్తం అవుతే.. బాత్రూం లో ఉన్నా, దోపిడీలో ఉన్నా, జైల్ ఫ్రంట్ డోర్ ముందున్న ఏం తేడా ఉండదు.
Tumblr media
* దోపిడీ సమయంలో ప్రేమలో పడకూడదు. * మనం చూడలేనివి అనుకున్న దానికన్నా ఎక్కువ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. * మనం కనపడని దాని కోసం వెతుకుతాం. ఏదైనా మనకు కనపలేదు అనుకోండి, దానికి మనం కనపడొచ్చు అన్నది మర్చిపోతాం, అది మనం సమస్యల్లో చిక్కుకున్నప్పుడు.. * బంగారం బతికుండి మనుషులు చనిపోయిన లిస్ట్ దురదృష్టవశాత్తు టోక్యో కూడా ఉంది. Read the full article
0 notes