Text
మోడీ ఒప్పేసుకున్న ‘మూడు అబధ్ధాలు’!
మోడీ ఒప్పేసుకున్న ‘మూడు అబధ్ధాలు’!
పిడికిలిని బిగించటం సులువే; సడలించకుండా వుండటమే కష్టం. అలా ఎంతసేపని బిగించి వుంచగలరు? కొన్ని గంటలు, లేదా కొన్ని రోజులు, కాకుంటే కొన్ని వారాలు. ఇదేమిటి? ఏకంగా ఏడాది పాటు సడలకుండా వుండటమేమిటి? చర్మాన్ని వాన తడిపేసినా, వేళ్ళను వాన కొరికేసినా, ముంజేతిని ఎండ కాల్చేసినా అదే బిగింపు. రైతు పిడికిలి. అయినా బెట్టు. ‘అధికారం మీద వొట్టు, మెట్టు కూడా దిగనన్న కేంద్రంలోని సర్కారు బెట్టు. ఒకటికి రెండు సార్లు…

View On WordPress
#BJP#Farm Laws Repealed#Khalistan#Lakhimpur Kheri#Narendra Modi#Pujab farmers stir#Punjab Polls 2022#Red Fort#Tractor Rally#UP Polls 2022
0 notes
Text
వడ్ల గింజల్లో ‘కయ్యపు’ గింజలు
Paddy Row Beteween TRS BJP
వడ్లను వలిస్తే బియ్యం రావాలి, కానీ తెలంగాణలో కయ్యం వచ్చింది. అది కూడా రెండు అదికారపక్షాల మధ్య. ఒకటి కేంద్రంలో ఏలుబడి చేస్తున్న ‘కాషాయ’ పక్షం; మరొకటి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ‘గులాబీ’ పక్షం. ఇది ‘కొని’ తెచ్చుకున్న కయ్యం కాదు, ‘కొనకుండా’ తెచ్చుకున్న కయ్యం. ‘నువ్వు కొను’ అంటే, ‘నువ్వు కొను’ అని రోడ్లెక్కుతున్న కయ్యం. రాష్ట్రంలో పండిన వడ్లను ఎవరు కొనాలీ, అన్నదగ్గర వచ్చిన జగడం. టన్నుల కొద్దీ…

View On WordPress
0 notes
Text
నిద్రగన్నేరు చెట్టు
నిద్రపోతేనే కదా…కల వచ్చేదీ! మళ్ళీ ఆకలలో నిద్రపోతే…!?ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుంది. ఇలలో చేసిన అన్ని పనులూ, కలలో కూడా చేస్తాం కదా! ఎవరినో కౌగలించుకున్నట్లూ, ముద్దు పెట్టినట్లూ , సుఖం పొందినట్లూ మాత్రమే కాదు…పరుగెత్తినట్లూ, అలసి పోయినట్లూ, నిద్రపోయినట్లూ కలవస్తుంది.మొద్దు నిద్ర. నిద్రలోని నిద్ర. కలలోని నిద్ర. మెలకువ వస్తే బాగుణ్ణు. గింజుకుంటున్నాడు. కళ్ళు తెరవలేక పోతున్నాడు. ఎవరో ఒకరు తన్ని…

View On WordPress
0 notes
Text
అక్కడ ‘జస్ట్ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!
అక్కడ ‘జస్ట్ మెర్సీ’! ఇక్కడ ‘జై భీమ్’!!
Actress Lijomol Jose as Senggeni in Jai Bhim Movie HD Images అవసరాల మధ్యనే జీవిస్తుంటాం. అవసరాలు తీర్చుకోవటమే జీవిస్తుంటాం. తిరిగి అవసరాలను అన్వేషిస్తూనే జీవిస్తుంటాం.చెయ్యటానికో ఉద్యోగం, ఉండటానికో ఫ్లాటూ, తిరగటానికో కారు. తోడుకో సహచరీ లేదా సహచరుడూ, గొప్పలు పోవటానికి పిల్లలూ, వాళ్ళ ప్రాగ్రెస్ రిపోర్టులూ.. ఇవన్నీ అవసరాలే.ఇన్ని అవసరాల్లోనూ ఆవేశం కూడా అప్పుడప్పుడూ అవసరమయిపోతుంటుంది. దీనిని…

View On WordPress
#Ambedkar#Ankuram#Gnanvel#Jia bhim telugu movie#Just Mercy#Just Mercy Movie#Justice Chandru#Marx#Pa Ranjit#SFI#Suriya
0 notes
Text
‘ప్రేమోన్మాద’మేనా? ‘కులోన్మాదం’ కూడానా?
ఇది నాదీ, అనేసుకున్నాడు వాడు. వాడిది అయిపోవాలి- అంతే. వాడే కదా చాలా బాలీ, టాలీ, వెరసి ‘జాలీ’ వుడ్ సినిమాలో హీరో! వాడు ‘అదీ, ఇదీ’ అని పిలిచేది, వస్తువునే కాదు, మనిషిని-ఆడమనిషిని- కూడా. వాడి మాటకీ, చేతకీ తేడా వుండదు. ఎలా పిలిచాడో, అలాగే చూస్తాడు. ఈ బైక్ నాదీ అన్నట్లే, ఈ పిల్ల నాదీ అనేస్తాడు. నిందితుడు శశికృష్ణ, మృతురాలు రమ్య ఎప్పుడూ జరిగే కథ ఆ అమ్మాయి బీటెక్ చదవవచ్చు; ఎంటెక్ చదవవచ్చు. వాడు ఏ…

View On WordPress
#BC boy murders Dalit Girl#Dalit Atrocities in Andhra#Dalit Girl Murder#Dalit Girl Ramya Murdered#Disha Law#Love Attack#ప్రేమోన్మాద హత్య
0 notes
Text
‘మర్యాదస్తుల’ కోపాలకీ ‘కోటా’లుంటాయా?
అత్యాచారాలు ఈ దేశానికి కొత్త కాదు; దేశరాజధాని ఢిల్లీకి కూడా కొత్తకాదు. అందుకే ఇంకో పేరుతో కూడా ఆ నగరాన్ని పిలుస్తారు: ఈ దేశపు అత్యాచార రాజధాని (‘రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’). ఎన్నో అత్యాచారాలు జరిగినా, ‘నిర్భయ’ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని చద��వుకున్న యువతీయువకులు ఆగ్రహోదగ్రులయిపోయారు. అదే ఢిల్లీ నగరంలోని పాత నంగల్‌లో అత్యాచారం జరిగింది. అత్యాచారమే దారుణం కదా!…

View On WordPress
#Dalit Girl Rape in Delhi#Delhi Rape#Disha RapeCase#Nirbhaya Case#Priest Rapes Dalit Girl#Purana Nangal Rape#Rape in Crematorium
0 notes
Text
కులం పై సెర్చిలైటు- కొరియా ‘పారసైటు’!?
కులం పై సెర్చిలైటు- కొరియా ‘పారసైటు’!?
మన దరిద్రమేమిటో కానీ, దరిద్రాన్ని ఒకేలా చూస్తాం. సినిమా వాళ్ళూ అలాగే చూపిస్తారు. నలభయ్యేళ్ళ క్రితం బిచ్చగాడెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వుంటాడు. అలాగే అడుక్కు తింటాడు. చూసి,చూసి ప్రేక్షకుడికే కాదు, తీసితీసి దర్శకుడికి కూడా చికాకు వస్తుంది. దాంతో ‘కడుపు మాడే బిచ్చగాడు’ కాస్తా, ‘తినమరిగిన బిచ్చగాడి’ గా కనిపిస్తాడు, అప్పుడు వాడి చేత ‘ధర్మం చెయ్యి తల్లీ’ అని దీనంగా అడిగించకుండా, ‘చికెనుంటెయ్యమ్మో,…
View On WordPress
#Bong Joon Ho#Caste System#Ghettos#Parasite Film#South Korea Director#పారసైట్ చిత్రం#శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి
0 notes
Text
నిజం నాకు తెలుసు - నెపం నగ్నముని మీదకి!
నిజం నాకు తెలుసు – నెపం నగ్నముని మీదకి!
ఒక జలప్రళయం ముగిశాక, సమస్త సృష్టీ సర్వనాశనమయ్యాక, నీటమునిగిన నేలతల్లి తేరుకున్నాక, ఒక వెలుగు కిరణం తొంగిచూశాక నోవహు తన ఓడనుంచి ఒక పిట్టను వదలుతాడు. ఒక పచ్చని మొక్క మొలకెత్తిన జాడను పిట్ట ముందుగా కనిపెడుతుంది. ఆ ‘వెలుతురు పిట్టే’ కవి. (ఈ మాటనిచ్చిన కవి మిత్రులు శ్రీమన్నారాయణ గారికి కృతజ్ఞతలు)
అదే జలప్రళయం తర్వాత నగ్నముని, రోడ్లపక్క ప్లాస్టిక్ చెట్ల’ను నాటడం చూసి వచ్చాడు. ప్లాస్టిక్ కంకుల్నీ,…
View On WordPress
0 notes
Text
బోగీల్లోకి సరుకులు-పట్టాలపైకి బతుకులు!
తలుపు వెయ్యటం సులువే, తీయటమే కష్టం. విమానం టేకాఫ్ కావటం తేలికే; లాండ్ కావటమే ఇబ్బంది. పద్మవ్యూహంలోకి వెళ్ళటం సులభమే, రావటమే దుర్లభం- తెలివి వుంటే తప్ప. ఇంటికి కాదు, ఏకంగా దేశానికే తాళం వేసిపారేశారు. ఒక తాళం అయితే సరిపోదని ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఎగబడి తాళం మీద తాళం ఎగబడి మరీ వేసేశారు. కారణం కోవిద్-19. తీస్తారు, తీస్తారు- అనేలోగా ముమ్మారు లాక్ డౌన్ పొడిగించారు. నాలుగోసారికి సిధ్ధమవుతున్నారు.…
View On WordPress
#Bhopal Gas Tragedy#Freight train mows over migrant workers#LG Polymers Gas leak#Plight of Migrant laborers in India
0 notes
Text
‘కాలా’కు కౌంటర్... ‘అల(కుల) వైకుంఠపురం లో’!?
‘కాలా’కు కౌంటర్… ‘అల(కుల) వైకుంఠపురం లో’!?
త్రివిక్రమ్ చూపే వేరు
రాను రాను రావణుడికి గిరాకీ పెరుగుతోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా. ఇలా ఈ పాత్రను చూడగా చూడగా, ప్రేక్షకులకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. ఇంతకీ రావణుడు నాయకుడా? ప్రతినాయకుడా? (హీరోనా? విలనా?) రామాయణం విన్న వారికీ, చదివిన వారికీ అతడు ‘సీతమ్మ వారిని ఎత్తుకు పోయిన పది తలల రాక్షసుడు’. అయితే ఇంకాస్త లోతుగా చదివిన వారు, రావణుడిలోని సుగుణాలను కూడా చెబుతుంటారు. అందులో ఒకటి…
View On WordPress
#ala vaikunthapuramu lo. Trivikram Srinivas#Allu Arjun#Caste in Indian Fims#Kaala#Kondaveeti Venkatakavi#NTR#Pa. Ranjit#Rajni kanth#Ravana charecter#Samutharakani#అల వైకుంఠపురంలో#త్రివిక్రమ్ శ్రీనివాస్
0 notes
Text
‘ఊరు వెలుపలే’నా... ఈ ‘తెలుగు’ తబలా..!?
‘ఊరు వెలుపలే’నా… ఈ ‘తెలుగు’ తబలా..!?
ఇ ఫర్ ఇంగ్లీష్
భాష అంటే కూసేదా? రాసేదా? ముందు కూసేది; తర్వాత రాసేది. చాలా భాషలు ఇప్పటికీ కూత దగ్గరే ఆగిపోయాయి. రాత వరకూ రాలేదు. మాట్లాడేదే భాష. ఈ వాగ్రూపానికి దృశ్యరూపం ఇస్తే అప్పుడు రాత. దీనినే మనం లిఖిత రూపం అనుకుంటాం. అదే లిపి. తెలుగు లిపి లో అక్షరాలు గుండంగా వుంటాయి. కుదురుగా రాస్తే, ముత్యాలు గుదిగుచ్చినట్టే వుంటాయి. తెలుగు పలకటానికే కాదు, చూడటానికీ ముద్దుగా వుంటుంది. ఇంత అందమైన భాషకు…
View On WordPress
#English Medium Education#Srinivas Guntupalli in Andhra Pradesh - Medium of Instruction- Telugu Medium -High Court-#Sudhish Rambhotla
0 notes
Text
‘శివసాగరం’ కాదు - విప్లవ మహాభారతం!
‘శివసాగరం’ కాదు – విప్లవ మహాభారతం!
శివసాగర్
శివసాగర్ ఒక యుగం పేరు! ఇది పొగడ్తా కాదు. తిట్టూ కాదు. ఏం అనుమానం లేదు. యుగమంటే కాలమే. కాలమే కవి కి జన్మనిస్తుంది.(శివసాగర్ మాటల్లోనే చెప్పాలంటే… ‘కాలం కడుపుతో వుండే’ కవిని కంటుంది.) ఆ కాలంలో అసలు కవితో పాటు చాలా మంది కవులు పుట్టుకొస్తారు. వారిని కాలం కనదు. వారు ‘స్వయంభువులు’. కాలం తో పాటు కొట్టుకుంటూ వెళ్తారు. అలాంటి వారు అనేకం వుంటారు. వారితో యుగానికి ఏమీ పనివుండదు. ఆ యుగంతోనే వారికి…
View On WordPress
0 notes
Text
నవ్వమంటోంది కరోనా! ఏడ్వమంటోంది కరోనా!
రోడ్లే ఇళ్ళు- ఇళ్ళే రోడ్లు
.కరోనా! కరోనా! ప్రపంచ దేశాల నోట కరోనా నామ స్మరణే. వచ్చేస్తే, ‘వచ్చేసింది బాబోయ్’ అని. రాకుంటే ‘ఎప్పుడొస్తుందో..ఏమో!’ అని. ఇది దేశాధినేతల బాధ. ఇక ప్రజల తీరు వేరు. మన దేశంలో అయితే, 135 కోట్ల మందిని గృహనిర్బంధం చేశారు. వారూ ‘కరోనా’నే జపిస్తున్నారు. ఒకప్పుడయితే ఒక ఇంటి గోల ఒక ఇంటికి వినిపించేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. ఇంటి గోడలకు చెవులే కాదు, కళ్ళూ, నోళ్ళూ వచ్చేశాయి.…
View On WordPress
0 notes
Text
కరోనా పక్కనే కల్చరల్ వైరస్ కూడా!
కరోనా. లోకంలో ఈ మాట తప్ప మరొకటి వినపడటం లేదు. మరో మాట వినటానికి కూడా లోకానికి ఇష్టం లేదు. కరోనా అసలు పేరు కోవిద్-19. ఇదో ఒక వైరస్ పేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఈ ఒక్క వైరస్ తో యుధ్ధం చేస్తున్నాయి. మందు లేని రోగం. మందు కనుగొనటానికి సమయమివ్వని జాడ్యం. ఎక్కడ నుంచి వచ్చిందో కూడా కనిపెట్టేటంత ఆస్కారాన్ని కూడా ప్రపంచానికి ఇవ్వలేదు. ఈ రోగం బారిపడిన రోగుల్ని తొలుత చైనాలో గుర్తించారు కాబట్టి,చటుక్కున…
View On WordPress
0 notes
Text
చాసో పసివాడు కూడా..!
చిత్రం: అన్వర్
చాసోకి చుట్టకాల్చడం ఇష్టం. అంతకన్నా కథలు రాయడం మరీ యిష్టం. ఎన్ని చుట్టలు కాల్చాడో లెక్కలేదు. కథలు మాత్రం కొన్నే రాశాడు. ఆ కొన్నింటిలోనూ సగం చించి పారేశాడు. నచ్చిన కథలు నలభై దాటతాయేమో. అంతే.
చుట్ట సొంత సుఖం. చాసో లెక్క ప్రకారం సొంత సుఖానికి ఆట్టే ఆనందం వుండకూడదు.
కానీ, చాసోకి చుట్ట కలల్నిస్తుంది. కథల్నిస్తుంది, కథల్నిండా సామాజిక దుఃఖాలూ; ఆ దుఃఖాలకి కారణాలూ; కారణాల మీద తన…
View On WordPress
#Chaganti Somayajulu#Chaso#EM Forster O Henry#Telugu Short Stories#కుంకుడాకు#చాగంటి తులసి#చాగంటి సోమయాజులు#చాసో#చాసో కథలు#చిన్నాజీ#దుమ్ములగొండె
0 notes
Text
స��ీష్ చందర్ ముద్రిత గ్రంథాలు
సతీష్ చందర్ ముద్రిత గ్రంథాలు
List of published books by Satish Chandar
S.no Book Thumbnail Name/Title Genre Description Year Price 1 Made in India
(మేడ్ ఇన్ ఇండియా) Satire ఎనభయ్యవ దశకం చివరి పాదంలో ఎన్టీ ఆర్ ముఖ్యమంత్రిగా వుండగా రాసిన వ్యంగ్యం. ఈ పుస్తకం చదివాకే ఎబికె ప్రసాద్ సతీష్ చందర్ ను ఆర్ట బుచ్ వాల్డ్ తో పోల్చారు 1992 Out of Print 2 [Image Not Available] Dunkel Bells
(డంకెల్ బెల్స్) Play డంకెల్ ప్రతిపాదనల వల్ల…
View On WordPress
0 notes
Text
నత్తనడక న్యాయానికి 'ఎన్‌కౌంటర్' విరుగుడా..?
నత్తనడక న్యాయానికి ‘ఎన్‌కౌంటర్’ విరుగుడా..?
ఎక్కడ చంపారో, అక్కడే చచ్చారు. అది కూడా పదిరోజుల్లో. ఇదీ న్యాయం! అసలు న్యాయమంటేనే ఇలా వుండాలి!?
మరి? వాళ్ళు చేసింది మామూలు నేరమా? ఆ రోజు (నవంబరు 27) రాత్రి, షాద్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ను ఎత్తుకు వెళ్ళి, అత్యాచారం చేసి, హత్య చేసి, తగులబెట్టారు. ఇంత నీచమైన నేరం చేసిన ఆ నలుగుర్నీ (ఆరిఫ్, శివ, నవీన్. చెన్నకేశవుల్నీ) పదవరోజు (డిశంబరు6) తెల్లవారు ఝామున వారిని పోలీసులు తమ ‘ప్రాణరక్షణార్థం’…
View On WordPress
#Acid attack on Swapnika and Pranita#Acid attackers killed in Encounter#Disha rape and murder#Nirbhaya Case#Rapists Killed#Shadnagar Encounter#Teku Lakshmis Gang rape and Murder#Trolling women activists
0 notes