Tumgik
ashokkothapalli · 5 years
Text
అమ్మ మెగాస్టారా ఈ రాయబారం కోసమేనా, జగన్ ను కలిసింది!
youtube
మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల  క్రితం ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కలయిక వెనుక వున్న  అసలు కథ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవి సతీసమేతంగా ఎపి ముఖ్యమంత్రిని తొలిసారిగా కలవటం వెనుక వ్యూహాత్మకంగా జరగలేదని తెలుస్తోంది. అప్పుడెప్పుడో సాక్షి పత్రిక ప్రారంభోత్సవానికి హాజరైన మెగాస్టార్.. ఆ తర్వాత ఎన్నడూ జగన్ మొహం చూసిన  పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. జగన్ గతంలో ఓదార్పు యాత్ర నిర్వహించిన  సమయంలో ఆయనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదు. సోనియా గాంధీ తన  ఓదార్పు యాత్రకు అడ్డు చెప్పటం , తనను కాదని కిరణ్ కుమార్ రెడ్డిని ఉమ్మడి ఎపికి ముఖ్యమంత్రిని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హస్తం పార్టీలో వుంటే మనుగడలేదని భావించి సొంతంగా పార్టీ స్ధాపించిన తర్వాతే అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రితో సహా వైకాపా నాయకులు గడిచిన  ఐదేళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆరోపణలు వాస్తవమా , అ వాస్తవమా తేల్చటానికి కోర్టులు వున్నాయి. వీటి సంగతిని కాసేపు పక్కన పెడితే మెగాస్టార్.. ఎంత బిజీగా వున్నప్పటికీ జగన్ ను కలవటంలో ఆంతర్యం ఏమిటని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. సైరా చిత్రానికి ఎపిలో కొన్ని రాయితీలు కల్పించిన మాట వాస్తవమే. అందుకు గాను కృతజ్ఞతలు చెప్పటానికి ఎపి ముఖ్యమంత్రిని కలిశారని చెప్పటంలో వాస్తవాలు ఎంత? కేవలం కృతజ్ఞతలు తెలపటానికి జగన్ తో భేటీ అయ్యారని మీడియాలో వచ్చిన  వార్తల్లో నిజా నిజాలు లేవనే చెప్పవచ్చు అంటున్నాయి ఆ వర్గాలు. తెలుగు సినీ పరిశ్రమ మేలు కోరి టాలీవుడ్ పెద్దన్నగా మెగాస్టార్ చిరంజీవి .. ముఖ్యమంత్రిని కలవటం వెనుక ఎవరి పాత్ర వుంది. దీనిపై సినీ, రాజకీయవర్గాల్లో విసృతమైన  చర్చ కొనసాగుతోంది.
తెలుగు సినీ పరిశ్రమకు నిర్ధిష్టంగా చేయబోయే విధివిధానాలను వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే సైరా నిర్మాతగా వ్యవహరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం చిరు ..అమరావతి పర్యటనలో పాలు పంచుకోలేదు. చిరు తో సహా ఆయనకు అత్యంత సన్నిహితుడైన తెదాపా శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు ముందుగా ప్రచారం జరిగినట్లు సదరు భేటీలో కానరారాలేదు.
ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి ... ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన భేటీలో గంటా గురించే గంటకు పైగా చర్చించారని వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవిలకు వున్న హోదా ముందు గంటా.. ఓ టీ స్పూన్ తో సమానమని చెప్పవచ్చు. గంటా గురించే చిరంజీవి, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిపారంటే ..ఎవ్వరికీ నమ్మశక్యంగా లేదు. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అంటే మాజీ మంత్రిని ఫ్యాన్ ఒడిలో సెద తీర్చుకోవటానికి పచ్చజెండా కోసం చిరు అడిగారా అంటే కాదనే చెప్పాలి.
వీటన్నింటికీ మించి గంటా కోసం ఎపి ముఖ్యమంత్రితో  పెద్ద బేరమే ఆడినట్లు కనిపిస్తోంది. గతంలో వైకాపా  ఆరోపించినట్లుగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా పేరొందిన మాజీ మంత్రిని .. అధికార పార్టీలో చేర్చుకోమని అడగకపోయినా.. మరో పెద్ద సాయమే చేయమని కోరినట్లు విశాఖలోని తెదాపా వర్గాలు చెపుతున్నాయి.  తెలుగుదేశం హాయంలో మానవ వనరుల శాఖ మంత్రిగా వెలగబెట్టిన సంగతి తెలిసిందే. ఆ హోదాలో సర్వశిక్షా అభియన్ కార్యక్రమంలో దాదాపుగా 5 వేల కోట్ల పైచిలుకు నిధులను స్వాహా చేశారని తరచుగా వైకాపా నేతలు ఎన్నికల ప్రచారంలో తరచూ దుమ్మెత్తి పోసేవారు. కానీ ఇవేమీ గంటా విజయ పరంపర  ముందు తూగలేకపోయాయి. తెలుగుదేశం హాయంలో తన వియ్యంకుడు పి.నారాయణకు తలొగ్గే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ గంటా శ్రీనివాసరావును ఏమీ చేయలేకపోయారని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కొనే వారు. కానీ అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి చందాన వైకాపా అధికారంలోకి రావటంతో గంటా పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. వైకాపా సర్కార్ ప్రతి పనిని రివర్స్ టెండరింగ్ పేరుతో తిరగదోడటంతో గంటా కు దిక్కు తోచని స్ధితిలో పడ్డారని విశాఖ తెదాపాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సంక్లిష్ట పరిస్ధితుల్లో తనను కాపాడమని అన్నయ్య చిరంజీవిని.. గంటా ప్రాధేయపడ్డారట.
 దీంతో గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవటానికి చేసిన యత్నాలు ఫలించకపోవటంతో మాజీ మంత్రికి . .…ఆపద్భాందవుడు చిరంజీవే దిక్కయ్యారు. చిరంజీవికి.. మాజీ మంత్రి గంటా అత్యంత ఆప్తుడు కావట��తో తమ్ముడు అడిగితే కాదన లేక అభయ హస్తం ఇచ్చారని విశాఖలోని దేశం పెద్ద నేతలు చెప్పేమాట. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అంతా సర్దుబాటు చేస్తానని .. చిరంజీవి హామీ ఇవ్వటంతో గంటా గుండె దిటువ చేసుకున్నారట. ఎపి ముఖ్యమంత్రితో ముఖాముఖి జరిగే భేటీలో గంటా శ్రీనివాసరావు కూడా వుంటారని మీడియా హొరెత్తించింది. కానీ గంటా అంత సాహాసం చేయలేకపోయారని దేశం నేతలు వెక్కిరిస్తున్నారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖకు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లటానికి ప్రత్యేక విమానం, బెంజ్ కారు తదితర ఏర్పాట్లు చేసింది విజయవాడలోని గంటా మిత్ర బృందమేనని తెలుస్తోంది. చిరంజీవి మంత్రాంగం ఫలించినట్లేనని గంటా మిత్ర బృందం ప్రస్తుతానికి భావిస్తోంది. ఎందుకంటే నిన్న ముగిసిన ఎపి కేబినెట్ భేటీ అజెండాలో ఎక్కడా గంటా భూభాగోతాలు, గలీజు వ్యవహారాల ప్రస్తావన లేకపోవటంతో గంటా రెండు చేతులు గుండెలపై వేసుకొని నిద్రపోయారని ఆయన మిత్ర బృందం ద్వారా తెలుస్తోంది. గంటాను కాపాడటం గరళం మింగటం కంటే చాలా కష్టం అనిపించిందని మెగా స్టార్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని వినికిడి. సైరా సినిమా ముసుగులో చిరంజీవి, ఎపి ముఖ్యమంత్రి వద్ద ఆడిన నటనకు మొత్తం మీద మంచి మార్కులే పడ్డాయి గంటా వద్ద అని అభిజ్ఞవర్గాల భోగట్టా.
via Blogger https://ift.tt/35LJHhz
0 notes
ashokkothapalli · 5 years
Text
Jagan Would Faces Tricky Situation Likely ?
జగన్ కు చిక్కు  ముడులెన్నో ?
ఎవరూ రాజకీయ పండితులకు అందని రీతిలో ఘన విజయం సాదించి నారావారి నార తీసిన జగన్ కు జేజేలు . ఛీర్ మీడియా (చంద్రబాబు ఏమి చేసినా అహో ఓహో అని కీర్తించే భజన బృందం అని అర్ధం) సహా వ్యవస్ధలన్నీ ఎదురొడ్డినా , అందరికీ గుణ పాఠం వచ్చేలా ప్రజలు, తీర్పునివ్వటంతో జగన్ ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబు అవుతున్నారు. ఇంతటి ఘన  విజయం ఒక్కరోజులో రాలేదు. పది సంవత్సరాలు ఇంటికి దూరమై ప్రజలు రాష్ట్రం కోసం పలు ఆందోళనలు నిర్వహించారు. 16 నెలలు పాటు జైలు జీవితం గడిపినా ఎక్కడా అలసి పోలేదు. తను నమ్ముకున్న సిద్ధాంతం, భగవంతుడి ఆశీస్సులువుంటే చాలు అని నమ్మిన వ్యక్తి జగన్. నాడు కేసులు పెట్టించిన ఢిల్లీ ఒకప్పటి సామ్రాజ్ఞి పార్టీ ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లైంతైంది. అప్పట్లో జగన్ కేసుల కోసం నియమితులైన అధికారి సైతం ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలై దిక్కులు చూస్తున్నారు. ఆయన ఉప్పందించిన సమాచారాన్ని చిలవలు పలవులు చేస్తూ జగన్ ప్రతిష్టను దిగజార్చటానికి ప్రయత్నించిన  ఛీర్ మీడియా ఇప్పుడేమి అంటుంది.
వెన్నాడుతోన్న పాత కేసులు
విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు కాబోయే 2 వ ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్ రెడ్డికి గెలిచిన ఆనందం నాలుగు రోజులైనా నిలిచేలా కనిపించటంలేదు.ఎందుకంటే దిగజారిన ఆర్ధిక పరిస్ధితులు , మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకం , తదితరాలు ఆయనకు కత్తిమీద సామే. దీనికి మించి ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరు ముఖ్యమంత్రి హోదాలో హాజరు కావటం విషమ పరీక్షే. గతంలో రాష్ట్ర అధిపతి  హోదాలో వున్న వ్యక్తులెవరూ ఆర్ధిక నేరాలపై సి.బి.ఐ కోర్టుకి హాజరైన దాఖలాలు లేవు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు తలెత్తే ప్రమాదం పొంచి వుంది. ఇప్పటికే మరణ శయ్యపై చేరుకున్న విపక్షం తెదాపాకులోనే ఓ అస్త్రం దొరికినట్లవుతోంది.
అయితే అధికార వైకాపా నేతలు మాత్రం భిన్నంగా చెపుతున్నారు. గతంలో ఎన్నికల సందర్భంలో సి.బి.ఐ కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై మళ్లీ రివ్యూ  పిటిషన్ ను దాఖలు చేసే యోచనలో అధికార పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం జగన్ తరపున దాఖలు అయ్యే పిటిషన్ ను కోర్టు అనుమతించకపోవచ్చునని చెపుతున్నారు. కాగా  నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ లో కాబోయే ఆంధ్ర ప్రదేశ్ కు కాబోయే  ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేమని తెలంగాణ సర్కార్ చెప్పనుందని వినికిడి. ఇదే వాస్తవమైతే సి.బి.ఐ కోర్టు.. జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవచ్చని న్యాయ నిపుణుల అభిప్రాయంగా వుంది.  ఒక వేళ సి.బి.ఐ కోర్టు మినహాయింపు ఇవ్వకపోతే , ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతలు ఉన్నందున  హాజరుపై సడలింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
సార్వజనీన సమస్యల ప్రస్తావనతో పాటు ప్రజలకు నేను వున్నానని ఇచ్చిన భరోసా ప్రతి ఒక్కరిని కదిలించి సానుకూల ఓటింగ్ కు దారి తీసింది. తెల్లవారు ఝాము వరకు మహిళలు క్యూలైన్లో బారులు తీరితే అవన్నీ తమ ఓట్లేనని భ్రమ పడ్డారు చంద్రబాబు . మీడియా ముసుగులో ఏమి చేసినా చెల్లు బాటు అవుతుందనే బాబు ఆలోచన తప్పని మళ్లీ తెలుగు ప్రజలు నిరూపించారు.
తప్పోప్పులను నిలదీసి ప్రశ్నించాల్సిన మీడియా గత సర్కార్ కు తాబేదార్ల వలె వ్యవహరించి ,ఘనమైన చరిత్ర వున్న తెలుగు దేశాన్ని నట్టేట ముంచి వేసిందని విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అదే పార్టీతో చేతులు కలపటాన్ని సగటు కార్యకర్త, పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారని రాజకీయ  పరిశీలకుల మాట.
తెలంగాణ గుణపాఠం నుంచి బాబు నేర్వలా :
కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీతో చంద్రబాబు పూసుకు రాసుకు తిరగటాన్ని సగటు ఓటరు,  సహించలేకపోయాడని ఓ బలమైన అభిప్రాయం వచ్చింది. తెలంగాణ లో చావు దెబ్బ తిన్న తర్వాత కళ్లు తెరిచిన తెదాపా నాయకత్వం , ఎపిలో పొత్తుకు ససేమిరా అన్న సంగతి తెలిసిందే. కానీ జాతీయ స్ధాయిలో మోడీకి తామే ప్రత్యాహ్నాయం అన్న రీతిలో రాహుల్ గాంధీ, చంద్రబాబు కలరింగ్ ఇవ్వటం వెగుటు పుట్టించదనే చెప్పాలంటున్నారు రాజకీయ  పరిశీలకులు. అయితే ఎపి కాంగ్రెస్ నేతలకు తెదాపా తీర్ధం ఇచ్చినా ఒకప్పటి అగ్రనేతలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్ తదితరులు ఘోర పరాజయం కావటం విశేషంగా చెప్పుకోవాలి.
పదవుల పంపకం కష్టతరం :
ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ నేతలను ప్రతి జిల్లా నుంచి తీసుకున్నారు, గెలిచిన శాసన సభ్యుల సంఖ్యేమో 151 గా వుంది. మంత్రి పదవులు రాజ్యాంగం ప్రకారం 30 మందికి మించటానికి అవకాశం లేదు. ఇక మిగిలింది కార్పొరేషన్ పదవులు నామినేటెడ్  , మరో  పదవులు మరో 50 వున్నాయనుకుందాం. వీటిలో శాసన సభ్యులకు , పదవులను ఆశించి పార్టీలో చేరిన వారికి ఎంత మేరకు సర్ధు బాటు చేస్తారో చూడాలి. నామినేటెడ్ పదవులకు వచ్చే సరికి జగన్ కు పరోక్షంగా, ప్రత్యక్షంగా సాయపడిన మాజీ ఐ.ఎ.ఎస్, ఐపి.ఎస్ అధికారులకు న్యాయం చేయాల్సి వుంది. వీరిలో కొంతమందిని టి.టి.డి బోర్డు సభ్యులుగా నియమించినా సరే  , అధికారిక కారు , ప్రోటోకాల్ వుండే పదవులను కోరుకునే వారే ఎక్కువ . వీరంతా శాసన సభ్యుల తర్వాత హోదాలో వున్న వారు కావచ్చు , లేదా పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీసు లకు చెందిన అధికారులు కావచ్చు. ఇక జిల్లాల వారీగా వస్తే ఉదాహరణకు రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే ఆశావాహులు చాలా మంది వున్నారు. మంగళగిరి నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ముందు వరసలో వున్నారు. పార్టీ కోసం గత ప్రభుత్వంపై కోర్టుల్లో న్యాయ పోరాటాలు చేసి ప్రజల్లోనే కాక ఎపిలో మంచి గుర్తింపు పొందారు. ఇదే జిల్లాలో నాడు వై.ఎస్.ఆర్, ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి జగన్ కు  ముఖ్య అనుచరుడిగా కష్టకాలంలో అండగా నిలిచిన అంబటి రాంబాబుకి తగిన న్యాయం చేయాల్సి వుంది.
కృష్ణా జిల్లాలో దిగ్గజ , ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన కొడాలి నాని , విపక్షంలో వున్నప్పుడు జగన్ కు కొరకరాని కొయ్యలా తయారైన దేవినేని ఉమాను ఓడించి తీరుతానని ప్రతిన పూని విజయం సాదించిన  వసంత కృష్ణ ప్రసాద్, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన పేర్ని నాని, జోగి రమేష్ వంటి వారు సైతం పదవులను ఆశిస్తున్నారు. పార్టీకి సంపూర్ణ మైన విజయాన్ని సమకూర్చిన విజయనగరం, కర్నూలు , నెల్లూరు జిల్లాల నుంచి కీలక నేతలు మంత్రి పదవులను దక్కించుకోవటానికి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారని సమాచారం. విజయనగరం నుంచి  బొత్స సత్యనారాయణ, కొలగట్ల వీరభద్ర స్వామి, నెల్లూరు నుంచి ఆనం రామ నారాయణ రెడ్డి, తెదాపా హాయంలో పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ గా పని చేసిన  బుగ్గన రాజేంద్ర రెడ్డి తదితరులు ప్రధానంగా మంత్రి పదవులను ఆశిస్తున్న వారి జాబితాలో వున్నట్లు సమాచారం. వీరికి తోడు శాసన మండలి నుంచి కనీసం ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాల్సి వుంది. సీనియర్ రాజకీయ వేత్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , పార్టీ, కొత్త ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
 నారా వారికి పెట్టని కోటైన చిత్తూరులో ఒక్క అసెంబ్లీ సీటు మినహా రెండు లోక్ సభ సీట్లలో విజయానికి కృషి సల్పిన  పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, మీడియాకు సుపరిచితారులైన రోజా, అధికారిక వాహనంలో తిరగాలని ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం.
గోపీలకు నో :
ఇప్పటికే నిండు కుండలా వున్న  వైకాపాలోకి వేరే పార్టీ నుంచే వారికి స్ధానం వుండబోదని ఆ  పార్టీ నేతలు చెపుతున్నారు. ఎందుకంటే అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ తో సహా కొంతమంది గోడమీద పిల్లులు వైకాపా అగ్రనేతలతో రాయబేరాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి. కానీ ఏ ఒక్కరినీ జగన్ చేర్చుకోబోరని ఆ  పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో తెదాపా పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించిందని విమర్శించిన పార్టీ అదే పనిని చేయబోదని ఘంటా పథంగా చెపుతున్నారు. అసలే ఖాళీ ఖజానాతో ఉద్యోగులకు జీత భత్యాలు కూడా పరిస్ధితుల్లో కొత్తగా వేరే వారిని చేర్చుకొని మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లకూడదని వైకాపా అగ్ర నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్ధితుల్లోగోపీలకు తలుపులు మూసివేసినట్లేనని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 
via Blogger http://bit.ly/2K6BEn4
0 notes
ashokkothapalli · 5 years
Photo
Tumblr media
Jagan Would Faces Tricky Situation Likely ? http://bit.ly/2K6BEn4
0 notes
ashokkothapalli · 5 years
Photo
Tumblr media
How Jagan Become Most Popular In Masses? http://bit.ly/2X6P1Y3
0 notes
ashokkothapalli · 5 years
Text
How Jagan Become Most Popular In Masses?
ప్రజలకు జగన్మోహనుడు ఎలా అయ్యాడు ? 2 కోట్ల మందితో మమేకం కావడమే ఫలించిందా ?
ఎపికి కాబోయో ముఖ్యమంత్రి వై.ఎస్ .జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎలా నచ్చేశారు. అంతకు ముందు ఓ ఆర్ధిక నేరగాడిగా  ఛీర్ మీడియా దుష్ప్రచారాన్ని అధిగమించి ముఖ్యమంత్రి ఎలా కాబోతున్నారన్న  దానిపై ఓ చిన్న పాటి రివ్యూ.
 దీనిపై రాజకీయ పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. 2014లో అధికారం అందినట్లే వచ్చి చేజారిపోయింది. దీనిని దృష్టిలో వుంచుకుని ఆయన పదునైన వ్యూహాలను రూపొందించారు. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో ప్రధాని మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజయాలందించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) సేవలను వినియోగించుకున్నారు. తెరవెనుక నుంచి ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని కమిటీ జగన్ కు అవసరమైన రాజకీయ వ్యూహాలను రూపొందించిటానికి భారీ కసరత్తే నిర్వహించారు. వారు జగన్ లోని లోపాలను గుర్తించి సరి చేశారు. వాటిలో జగన్ సామాన్య ప్రజలతో మమేకం కారని ఓ దుష్ప్రచారం ఛీర్ మీడియా బాగా తెరపైకి తెచ్చింది. పెద్దలను గౌరవించరు అనే విషపు ప్రచారాన్ని విసృతం చేసింది. వీటన్నింటినీ గమనించిన ప్రశాంత్ కిషోర్.. ఆయన ప్రజలతో మమేకమయ్యే పలు కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం అయ్యారు. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,600 కిలోమీటర్ల   రూపొందించిన కార్యక్రమంలో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలతో నేరుగా సంభాషించే ఏర్పాట్లు చేశారు. అంటే దివంగత వై.ఎస్.ఆర్ కంటే ఎక్కువగా ప్రజలతో కలిసి మెలిసి నడవగలిగారు. ఈ ప్రయోగం మంచి విజయవంతం అయిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
కాగా ఈ ప్రభావంతో ఏప్రియల్ 11న ముగిసిన ఎన్నికల్లో పోలయిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి వైకాపాకు వచ్చాయని గణాంకాలు చెపుతున్నాయి. దీంతోనే ఇంతటి అప్రహితమైన విజయం సాధించారని రాజకీయ విశ్లేషకుల అంచనాగా వుంది.
మొత్తం ఎపి జనాభాలోని మెజార్టీ కుటుంబాల్లోని వ్యక్తిని ఏదో రూపేణా పలకరించే అవకాశం   దక్కింది. దీనికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఎం.ఐ.ఎం బాస్ అసవుద్దీన్ ఒవైసీల ఆర్ధిక, రాజకీయ వ్యూహల పరోక్ష సహకారం తోడయింది. దీంతో పోలింగ్ రోజున వైకాపా శ్రేణులు , తెదాపా కంటే పోల్ మేనేజ్ మెంట్ నిర్వహణలో పైచేయి సాధించగలిగారు. చంద్రబాబు నాయుడు చెప్పుకున్న పలు సంక్షేమ కార్యక్రమాలు చివరి అంకంలో అమలు చేయటం , ఆయనకు మంచి కంటే చెరుపే ఎక్కువ చేసిందని చెప్పాలి. ఉదాహరణకు పసుపు కుంకుమ వంటి పలు పథకాలు పూర్తిగా ప్రజలకు చేరువ కాకపోవటం పచ్చ పార్టీ  ఓటమికి దారి తీసిందని  రాజకీయ విశ్లేషకుల వాదన.ఇదిలా వుంటే  ఎన్నికల ప్రచారాన్ని వ్యక్తిగతం చేసి , ఓటమిని కొని తెచ్చుకున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. జగన్ కు ఓటు వేస్తే పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి, మోడీకి గెలిపించినట్లేనని చేసిన వ్యాఖ్యలు మరింత చేటు తెచ్చాయి.
తెలంగాణలో మహా కూటమికి మొత్తం 23 సీట్లు దక్కితే , ఎపిలో సైతం సైకిల్ కు 23 సీట్లు మాత్రమే దక్కటం గమనార్హం. ఇదే అంశాన్ని నిన్న (శనివారం ) ముగిసిన వైకాపా శాసన సభా పక్ష భేటీలో జగన్ మాట్లాడుతూ 23 మంది తమ పార్టీ శాసన సభ్యులను సైకిల్ పార్టీ కొనుగోలు చేసిందని చెప్పారు. అందుకే 23 వతేదీ ఫలితాల్లో ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే దక్కాయని గుర్తు చేశారు. ముగ్గురు ఎంపీలను తమ నుంచి తీసుకు వెళితే పచ్చ పార్టీకి 3 ఎంపీలను మాత్రమే ఇచ్చి భగవంతుడు చంద్రబాబు నాయుడికి తగిన శాస్తి చేశాడని చమత్కరించారు.
అదే విధంగా తాజా మాజీ ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఏ ముహుర్తాన అన్నారో కానీ అది వాస్తవ రూపం దాల్చింది.  
అయితే సోషల్ మీడియాలో మాత్రం నా కుమారుడు ఓటమి పాలయ్యాడు, అని చంద్రబాబు అంటే,  దానికి ప్రతిగా నా బిడ్డ కూడా పరాజయం పాలైందని కెసీఆర్ చెప్పటం ద్వారా ఇద్దరూ ఒకరికి ఒకరు రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకున్నట్లయిందని చమత్కరిస్తున్నారు.
 అర్థిక పరిస్థితి కుదేలు 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఇంతగా కుదేలవడానికి దారితీసిన పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ అధికారులను ఆరా తీశారు. చంద్రబాబు సర్కారు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు గుర్తించారు. ప్రాధాన్య క్రమంలో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఐదేళ్లుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, దుర్వినియోగం చేసిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కూడా అదే విధంగా వ్యవహరించడం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు రోజే ఏకంగా రూ.2,325 కోట్ల బిల్లులు అస్మదీయులకు అడ్డగోలుగా చెల్లించేశారు. ఈ నెలలో ఇక అప్పు చేయడానికి కూడా వీలులేకుండా టీడీపీ ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా రాష్ట్రానికి ఎక్కడా కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి తక్షణం కేంద్ర ఆర్థిక సహాయం పొందడం మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం జగన్‌ గుర్తించారు. అందువల్లే రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హోదా సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ దిశగా యోచించారు.
 ఈ మధ్యాహ్నం ప్రధానితో భేటీ
ఈ సంక్లిష్ట పరిస్ధితుల్లో ఇవాళ కాబోయే ముఖ్యమంత్రి జగన్ ,  ప్రధాని మోడీతో భేటీ అయి చంద్రబాబు పథకాల వల్ల ఎపి ఎంత దివాళా తీసిందో ఆయనకు వివరించనున్నారు. తక్షణమే కేంద్రం సాయం చేయకపోతే , ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్ధితి నెలకొందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
గవర్నర్, కెసీఆర్ లను కలిసిన జగన్
శనివారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ను జగన్ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎపి.. సి.ఇ.సి గెలుపొందిన వారి జాబిత��� సమర్పించటంతో 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా  జగన్  ను నరసింహన్ ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఇరువురి భేటీలో రెండు తెలుగు  రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని , విభేదాలు తలెత్తకుండా సామరస్యంగా మెలగాలని నిశ్చయించుకున్నారు.
via Blogger http://bit.ly/2X6P1Y3
0 notes
ashokkothapalli · 5 years
Photo
Tumblr media
Fani Tufan Creates Havoc In Odisha , Its Related Vis http://bit.ly/2LmE5nG
0 notes
ashokkothapalli · 5 years
Text
Fani Tufan Creates Havoc In Odisha , Its Related Vis
ఫోనీ తుపాన్ బీభత్సం దృశ్యాలివే
అటు ఉత్తరాంధ్రను , ఆ తర్వాత ఒడిషాను గజ గజ వణికించిన ఫోనీ తుపాన్ సృష్టించిన విలయ దృశ్యాలు మిత్రుడు ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో న్యూస్ గ్యారేజ్ వీక్షకులకు అందిస్తున్నాం. కొన్ని చోట్ల రేకుల షెడ్డు వున్న పళంగా , ఎగిరి పోగా దానిలో అప్పటి వరకు తల దాచుకున్న వారు భయం భయంగా  పారిపోతోన్న దృశ్యాలను చూడవచ్చు. అలాగే నిర్మాణంలో వున్న ఓ భారీ కట్టడానికి సమీపంలో వున్న క్రేన్ ఒరిగి పడుతోన్న వీడియోను తిలకించవచ్చు. ఈప్రళయమంతా ప్రధానంగా భువనేశ్వర్, పూరీ, భద్రక్, కటక్, గోపాల్ పూర్ లోని దృశ్యాలివి . సర్వ సాధారణంగా వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చదివి వుంటాం కానీ , ఎక్కడా చూచిన దాఖలాలు లేవు. వాటి తాలూకు ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించారు. ఆ 
దృశ్యాలను మిత్రుడు ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో న్యూస్ గ్యారేజ్ వీక్షకులకు అందిస్తున్నాం. ఇదిలా వుండగా  ఒడిషాను అతలాకుతలం చేసిన తీవ్ర తుపాను బెంగాల్‌ను తాకి బంగ్లాదేశ్ దిశగా పయనిస్తోంది. ఫోనీ ప్రభావం వల్ల ఒడిషాలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ దాదాపు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్‌లో శుక్రవారం మధ్యాహ్నాం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడటం వల్ల కొన్నిచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
మిత్రుడు ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో ఒడిషా తుపాన్ దృశ్యాలివి
via Blogger http://bit.ly/2LmE5nG
0 notes
ashokkothapalli · 6 years
Photo
Tumblr media
Rgv Win Over On Babu For Laxmis Ntr Release https://ift.tt/2HNurHk
0 notes
ashokkothapalli · 6 years
Text
Rgv Win Over On Babu For Laxmis Ntr Release
ఎట్టకేలకు వర్మే గెలిచాడు
ఎన్నికలు జరగక ముందే బాబుకి ఎదురు దెబ్బతగిలింది. అదీ రాంగోపాల్ వర్మ రూపంలో వివరాల్లోకి వెళితే వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది . �� చిత్రాన్ని  ఆపాలని కొందరు ఎలక్షన్ కమీషన్ కు పిర్యాధు చేసిన సంగతి తెలిసిందే.  దీంతో నిర్మాత రాకేష్ రెడ్డి స్వయంగా ఈసీ ముందు హాజరయ్యారు.  సినిమాను లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించామని అన్నారు.  సినిమాలో పసుపు జెండాలు తప్ప పార్టీ గుర్తులెక్కడా చూపలేదని వివరణ ఇచ్చారు.  ఆయన వివరణతో సంతృప్తి చెందిన ఈసీ సినిమా విడుదల చేసుకోవచ్చని తెలిపింది.  దీంతో అడ్డంకులన్నీ తొలగాయని, చిత్రాన్ని ఈ నెల 29న విడుదలచేస్తామని నిర్మాత తెలిపారు. ఇక ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే
youtube
via Blogger https://ift.tt/2HNurHk
0 notes
ashokkothapalli · 6 years
Photo
Tumblr media
Mahesh Himself Launched His Wax Statue https://ift.tt/2HNjOnU
0 notes
ashokkothapalli · 6 years
Text
Mahesh Himself Launched His Wax Statue
టాలీవుడ్ అందగాడ్ని చూసి మైమరిచిన మహేష్
courtesy by ammulu 
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మషేష్ కు ఉన్న క్రేజ్ ను గుర్తించిన లండన్ లోని  ప్రముఖ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు కొన్ని నెలల క్రితం ముందుకు  వచ్చారు. అచ్చు మహేష్ ను పోలిన మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని ఏఎంబీ సినిమానాస్ లో విగ్రహాన్ని మహేష్ బాబు, మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబంతో పాటు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అనంతరం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.
via Blogger https://ift.tt/2HNjOnU
0 notes
ashokkothapalli · 6 years
Text
We Would Like To Watch Laxmis Ntr : Ec
'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు ఇసి బ్రేక్ వేస్తోందా ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఈ నెల 29న తెరముందుకు వస్తుందా రాదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సదరు చిత్రాన్ని తమకు చూపిన తర్వాతే విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఇవాళ నిర్మాత రాకేష్ రెడ్డి ఎన్నికల సంఘం ముందుకు హాజరు అవుతున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్ర విడుదలను ఆపేయాలని శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ వివాదాస్పద సినిమా ఎన్నికల సంఘం అనుమతి పొందితే  
రామ్ గోపాల్ వర్మకు నిజంగా పెద్ద విజయమే. ప్రేక్షక దేవుళ్ల ముందుకు వెళితే ఇంకెంత విజయం సాధిస్తుందో వేచి చూడాలి .
via Blogger https://ift.tt/2HETb5h
0 notes
ashokkothapalli · 6 years
Photo
Tumblr media
We Would Like To Watch Laxmis Ntr : Ec https://ift.tt/2HETb5h
0 notes
ashokkothapalli · 6 years
Text
Tolly Wood Super Star Becomes Mama Garu Today ..
 మామ పాత్రకు మారిన  విక్టరీ ‘వెంకటేష్’
సినీ పరిశ్రమలో బిగ్ స్టార్ దగ్గుబాటి వెంకటేష్ ..కుటుంబంలో సందడి నెలకొంది. టాలీవుడ్ విక్టరీ ‘వెంకటేష్’ రియల్‌గా మామ కాబోతున్నారు.  ఆయన పెద్ద కూతురు అశ్రిత వివాహం రాజస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ఘనంగా జరుగుతోంది. పెళ్లి వేడుకలను దగ్గుబాటి ఫ్యామిలీ భారీ స్థాయిలో చేస్తున్నారు. పెళ్లి వేడుకకు వెంకటేష్ దగ్గరి బంధువులు, సన్నిహితులకు మాత్రమే వెల్ కం ఉందంట. బాలీవుడ్ కండల వీరుడు ‘సల్మాన్ ఖాన్’ వివాహ వేడుకలో సందడి చేశాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి కొడుకు వివాహం కూడా రాజస్ధాన్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి వినాయక్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి..అశ్రితలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరు ఫ్యామిలీ పెద్దలు ఒకే చెప్పారు. పెళ్లి కంటే ముందుగా నిర్వహించే సంగీత్ వేడుకల్లో ‘రానా దగ్గుబాటి’, ‘నాగ చైతన్య’తో పాటు ‘సమంత అక్కినేని’లు సందడి చేశారంట. 
టాలీవుడ్‌లో సీనియర్ హీరో అయిన ‘వెంకటేష్’ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వెళుతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తూ అభిమానుల అలరిస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఇటీవలే ‘వరుణ్ తేజ’తో కలిసిన నటించిన ‘ఎఫ్ 2’ సినిమా సక్సెస్ కావడంతో ’వెంకటేష్’ సంతోషంగా ఉన్నాడు. మరో చిత్రానికి కూడా ఆయన సైన్ చేశాడు. ‘వెంకీ మామ’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అటు పెద్దరికం తెచ్చిపెట్టే పాత్రలతో పాటు సరదాగా వుండే మూవీస్ చేస్తూ వెంకీ వైవిధ్యాన్ని నిలబెట్టుకొంటున్నారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరు కావటం మరో ప్రత్యేకత 
youtube
via Blogger https://ift.tt/2HT8XsJ
0 notes
ashokkothapalli · 6 years
Photo
Tumblr media
Tolly Wood Super Star Becomes Mama Garu Today .. https://ift.tt/2HT8XsJ
0 notes
ashokkothapalli · 6 years
Photo
Tumblr media
I am Not Belive So Called Bullish Stories : Rgv https://ift.tt/2HOxOhd
0 notes
ashokkothapalli · 6 years
Text
I am Not Belive So Called Bullish Stories : Rgv
చెప్పింది గుడ్డిగా నమ్మేంత పిచ్చి వాడ్ని కాదు
'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' వచ్చే శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి  పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయనిలా స్పందించారు.
''ఏదైనా విశ్లేషణ చేస్తున్నప్పుడు తెలుసుకున్నది, చాలా మంది చెప్పిందాన్ని బట్టి నమ్మదగిన వాటిని బట్టి మనకు ఓ అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం అక్కడ ఉండం. అందుకే నేను నమ్మిన నిజాన్ని చెప్పాను. ఇలా జరగలేదు! అని ఎవరైనా అనుకుంటే, వారు నమ్మినదాన్ని బట్టి సినిమా తీసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు'' అని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. జీవీ ఫిలింస్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి, దీప్తి బాల నిర్మాతలుగా రాంగోపాల్‌ వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'. ఈనెల 29న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా రాంగోపాల్‌ వర్మ శుక్రవారం మీడిమాతో మాట్లాడారు.
బాలీవుడ్‌లో సినిమాలు చేశారు. అప్పుడు లేని వివాదాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ నిజం బయటకు వస్తుందనే భయం. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా తెలియని నిజాలు ఇప్పుడు ఎక్కడ తెలుస్తాయోననే భయం. అందుకే ఇన్ని వివాదాలు వస్తున్నాయి. విడుదల కాకుండా అపడానికి ట్రై చేస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, వాళ్లు ఆపడానికి అంతగా ఎందుకు ప్రయత్నించాలి.
ఇప్పుడు మీరు కుట్ర అని ఏదైతే అంటున్నారో చంద్రబాబు పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో అదే నిజమై ఉండొచ్చు కదా? ఉండొచ్చు. ఆయన అంతగా నమ్మినప్పుడు చంద్రబాబునాయుడే ఒక సినిమా తీసుకోవచ్చుగా.
నాదెండ్ల భాస్కరరావు చేసింది పెద్ద కుట్రా? చంద్రబాబు నాయుడు చేసింది పెద్ద కుట్రా? చంద్రబాబునాయుడు చేసిందే పెద్ద కుట్ర. కారణం! నాదెండ్ల భాస్కరరావు పార్టీ కోసం తప్ప ఆయనతో పెద్దగా కలిసింది లేదు. కానీ కుటుంబీకులు అలా కాదు. రక్తసంబంధీకులు, దగ్గరివాళ్ల��� చేసిన కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది.
రాజకీయాల్లో వెన్నుపోటును చాణుక్యనీతి, రాజకీయ మేథావితనం అంటారు. మీరెలా కుట్ర అని అంటున్నారు? వెన్నుపోటు, కుట్ర అనేవి ఒక మనిషి నమ్మినప్పుడు నమ్మినవాళ్లుచేసేది. దానికి రకరకాలుగా పేర్లు పెట్టొచ్చు. ఎన్ని పేర్లున్నా కుట్రని కుట్రే అనాలి.
ఈ సినిమా నిర్మాత వైసీపీ వ్యక్తి. అందువల్ల మీరు ఒక పార్టీకి సపోర్ట్ గా తీశారని అంటున్నారు? ఈ నిర్మాత వైసీపీకి చెందిన వ్యక్తి అని ముందు నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు. అది వేరే విషయం. ఒక పార్టీ వాళ్లు ఎప్పుడూ మరో పార్టీని ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు. నేను సినిమా మేకర్‌గా 25 ఏళ్ల క్రితం జరిగిన కథనే చేశా. మా నిర్మాత వైసీపీ వ్యక్తి కాదనుకోండి అయినా నేను వైసీపీకి సపోర్ట్‌ చేయొచ్చు. అలా తీయకూడదనేం లేదు కదా. పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఒకానొక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమోగానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది.
కథ ఎక్కడ నుంచి చెబుతున్నారు? 1989 తర్వాత లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఉంటుంది?.
సినిమా ఆపేస్తే రూ.50 కోట్లు ఇస్తామని ఆఫర్‌ వచ్చిందట నిజమేనా? అలాంటిదేమీ లేదు. నేను సినిమా మేకర్‌ని. నేను కష్టపడి ఓ సినిమాను చేసినప్పుడు దాన్ని రిలీజ్‌ చేయాలనే అనుకుంటా.
ఫిల్మ్‌ మేకింగ్‌ సమయంలో సినిమాను ఆపేయమని ఎవరైనా ఒత్తిడి చేశారా? 'వద్దు. ఇదెందుకు' అని అందరూ సలహాలిచ్చారు.
చంద్రబాబు మీద కసితోనే చేశారని అంటున్నారు? నాకు చంద్రబాబు వల్ల నష్టం లేదు. జగన్‌ వల్ల లాభం కూడా లేదు. వైస్రారు ఘటనలు జరుగుతున్న సమయంలో నేను 'రంగీలా' తీస్తున్నా. అప్పుడు సోషల్‌ మీడియా లేకపోవడం వల్ల పెద్దగా ఐడియా లేదు. కానీ బాలకృష్ణ నా దగ్గరకొచ్చి 'కథానాయకుడు' తీయమన్నప్పుడు ఆ సినిమాతోనే ఇది మొదలైంది. అందుకే నేను ఈ సినిమాను బాలకృష్ణకి అంకితమిస్తున్నా. నన్ను ఆయన కలిశారు. ఆయన నన్ను కలవలేదంటే ఆయన అన్నది అబద్ధమైనా అయి ఉండాలి. నేను చెప్పేదైనా అబద్ధం అయినా అయి ఉండాలి.
ఇన్ని వివాదాలు చూశాక బాలీవుడ్‌లో సినిమా చేయడం కష్టమా? ఇక్కడ చేయడం కష్టమా? ఎక్కడా కష్టం కాదు. చట్టబద్ధంగా చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఏదీ కష్టం కాదు.
వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ వర్మకు వ్యసనం అయిపోయిందనే విమర్శ ఉంది? నాకు చాలా వ్యసనాలున్నాయి. ఇది కూడా వ్యసనమైనా ఓకే. 90 శాతం నా కెరీర్‌లో ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ వివాదాస్పద అంశాలు తీసుకునే చేశా. 'సర్కార్‌', 'వంగవీటి', 'రక్తచరిత్ర' ..ఇలా ఏదైనా అలాంటివి.
ఈ సినిమాతో మార్పు వస్తుందని అనుకుంటున్నారా? ఓటు వేసేవారు హామీలు, వాటిని నెరవేర్చిన విధానం గురించి ఓ అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో నమ్మకంతో ఒక వ్యక్తికి ఓటు వేస్తారు. అలాంటి వ్యక్తి గురించి ఆకస్మాత్తుగా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందని నాకు తెలియదు. కానీ ట్రస్ట్‌ ఫ్యాక్టర్‌ అనేది రావచ్చు, పోవచ్చు. కానీ సడన్‌గా మీ గురించి గతంలో జరిగింది ఏదైనా తెలిస్తే ఆటోమేటిగ్గా నా మనసు మీద ఎఫెక్ట్‌ ఉంటుందిగా. కానీ ఏ మేర ఉంటుందనేది మెయిన్‌.
గత సినిమాలో అనంతపురాన్ని ఆనందపురం అని మార్చినట్టుగా ఏమైనా ఇందులో మార్చారా? అలాంటిదేమీ ఉండదు. సుప్రీమ్‌కోర్టు 'పద్మావత్‌', 'ఉడ్తా పంజాబ్‌' చిత్రాల తర్వాత చాలా వెసులుబాటు కల్పించింది. అందుకే 'మహానాయకుడు'లోనూ నాదెండ్ల భాస్కరరావు పేరును అలాగే వాడినట్టున్నారు. (ప్రజాశక్తి సౌజన్యంతో)
youtube
via Blogger https://ift.tt/2HOxOhd
0 notes