Don't wanna be here? Send us removal request.
Link
Punjab Election: ప్రముఖ పంజాబీ సింగర్ “సిద్ధూ మూసీవాలా” కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్ లో సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సమక్షంలో సిద్ధూ మూసీవాలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంజాబీ గాయకుడు కాంగ్రెస్ తీర్థం స్వీకరించడం విశేషం
సిద్ధూ మూసీవాలా ఓ యూత్ ఐకాన్ అని,ఇంటర్నేషనల్ ఫిగర్ అని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ అన్నారు. సిధ్ధూ మూసీవాలాని కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు విలేఖరులతో మాట్లాడుతూ నవజ్యోత్ సిద్ధూ తెలిపారు. సందర్భం��ా సింగర్ సిద్ధూ మూసీవాలా మాట్లాడుతూ.. పంజాబీల గళం దేశమంతటా వినిపించడానికే తాను కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు.
పంజాబ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వివిధ రంగాల్లో ప్రముఖులుగా పేరు సంపాదించిన వాళ్లను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు చేస్తున్నారు.
0 notes
Link
Delhi Pollution : ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్…ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు తగ్గుముఖం పట్టాయని, యూపీ పరిశ్రమల కలుషిత గాలి ఢిల్లీ వైపు వెళ్లడం లేదని వాదించారు. పాకిస్తాన్ వైపు నుంచి వెలువడే కలుషిత గాలే..ఢిల్లీలోని గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుందని యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకి తెలిపారు. యూపీ దిగువగా ఉన్నందున పాకిస్థాన్ నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పింది.
0 notes
Link
Woman convinces guys to get vaccinated in return for a date కరోనాతో ప్రపంచం అంతా పోరాడుతోంది. కరోనా నుంచి కాపాడుకోవటానికి చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. కానీ ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు ఎంతగా చేస్తున్నా పట్టించుకోవట్లేదు. తాను చెప్పిన పని చేస్తే చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశపెట్టినట్లుగా ఓ అందాల భామ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడని అబ్బాయిలంతా టీకా వేయించుకోవటానికి వెళ్లి వేయించుకుంటున్నారు.
0 notes
Link
Omicron Symptoms : ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్నాటకలో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శని లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో ఒమిక్రాన్ మరింత ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు.
Read More : India Omicron : భారత్‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు
ఒమిక్రాన్ లక్షణాలు 1.విపరీతమైన అలసట- తేలికపాటి కండరాల నొప్పులు
ఈ విపరీతమైన అలసట లక్షణం… వయసుతో సంబంధం లేకుండా ఒమిక్రాన్ సోకిన వారందరిలో కనిపించాయని సౌతాఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు. యువత అయనా.. కూడా వారిలో అలసట బాగా కనిపించిందని తెలిపారు.
2.గొంతులో గరగర
ఒమిక్రాన్ సోకిన వారిలో గొంతు దగ్గర దురద లాంటి లక్షణాలు కనిపించాయని పలు దేశాల్లో స్టడీస్ చెబుతున్నాయి.
3.పొడి దగ్గు.. కొంతమందిలో మాత్రమే జ్వరం
ఈ వేరియంట్ సోకిన వారిలో పొడి దగ్గు కనిపిస్తుందని… కొంతమందికి మాత్రమే జ్వరం వచ్చిందని రీసెర్చ్ లు చెబుతున్నాయి. చికెన్ గున్యాకు, ఒమిక్రాన్‌కు చాలా వరకు ఒకే లక్షణాలు వస్తాయంటున్నారు.
4.ఈసారి ఆక్సిజన్ షార్టేజ్ సమస్య లేదు
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ కారణంగా ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఆక్సిజన్ షార్టేజ్ సమస్య రాలేదని సౌతాఫ్రికా పరిశోధనలు తెలిపాయి.
5. రుచి, వాసన సమస్యలు ఉండవు
ఫస్ట్ వేవ్ లో ఇండియాలో కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం మంది రుచి, వాసన కోల్పోయారు. ఐతే.. ఒమిక్రాన్ సోకిన వారిలో ఈ లక్షణాలు కనిపించలేదని సౌతాఫ్రికా వైద్య రంగ నిపుణులు తెలిపారు.
6. హాస్పిటలైజేషన్ అవసరం లేదు
ఒమిక్రాన్ ఎక్కువమందికి వేగంగా సోకుతుంది అనేది పరిశోధనల్లో తేలింది. ఐతే… దీని నుంచి జాగ్రత్తలు, మంచి ఆహారంతో తొందరగానే బయటపడొచ్చని.. హాస్పిటలైజ్ కావాల్సిన అవసరం లేదని సౌతాఫ్రికా సహా పలుదేశాల్లో కేసులను బట్టి తేలింది. ఎక్కువమందికి అలసట, అనారోగ్యం లాంటి సమస్య వస్తే.. ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి.
ఎయిర్ పోర్టుల్లో కఠిన చర్యలు : – మరోవైపు… ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో కఠిన చర్యలు అమలవుతున్నాయి. ప్రమాదం పొంచి ఉన్న జాబితాలోని దేశాల నుంచి వచ్చే పౌరులకు పరీక్షలు చేయడంతో పాటు కఠిన క్వారంటైన్ నియమాలు అమలవుతున్నాయి. ప్రయాణికులకు టెస్టులు చేసిన అనంతరం ఫలితం తేలకుండా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదని కండిషన్ పెట్టారు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలితే ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. మహారాష్ట్రకు చేరుకునే ప్రయాణికులంతా తప్పనిసరిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన పెట్టారు.
0 notes
Link
Dr YSR Horticultural University : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎమ్మెస్సీ (హార్టికల్చర్) ; ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగేళ్ల బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. పది పాయింట్ల స్కేల్ మీద కనీసం 5.5 ఓజీపీఏ తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఐకార్ ఏఐఈఈఏ పీజీ 2021 అర్హత పొంది ఉండాలి.
మొత్తం 57 సీట్లు ఉన్నాయి. విభాగాల వారిగా సీట్ల వివరాలను పరిశీలిస్తే ఫ్రూట్ సైన్స్ 9, వెజిటబుల్ సైన్స్ 11, ఫ్లోరి కల్చర్ అండ్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ 8, ప్లాంటేషన్ – స్పైసెస్ – మెడిసినల్ – అరోమాటిక్ క్రాప్స్ 6, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ 6, ప్లాంట్ పాథాలజీ 4, ఎంటమాలజీ 4 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యుఎస్ సీట్లు 5, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం 4 సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 18న కౌన్సిలింగ్ ఉంటుంది.
0 notes
Link
Omicron Suspects కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNGP) హాస్పిటల్ లో చేరిన కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
గురువారం LNGPలో ఎనిమిది మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరగా, ఇవాళ మరో నలుగురు అనుమానితులు చేరినట్లు సమాచారం. ఇవాళ హాస్పిటల్ లో చేరిన నలుగురిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని,మిగిలిన ఇద్దరి టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
0 notes
Link
0 notes
Link
0 notes
Link
0 notes
Link
0 notes
Link
1 note
·
View note