#DeepDiveCommunity
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 month ago
Text
youtube
సహస్రలింగంలో రహస్య గ్రహం X! ఎవరు చెక్కారు?
Hey guys, ఈ రోజు నేను మీకు ఒక పవిత్ర స్థలంలో అధునాతన సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించిన కొన్ని దృఢమైన ఆధారాలను చూపించబోతున్నాను. సాధారణంగా, నేను మిమ్మల్ని ఒక పురాతన హిందూ దేవాలయానికి తీసుకెళ్తాను, కానీ ఈరోజు, నేను హిందూ దేవాలయానికి కాదు, కర్ణాటక రాష్ట్రంలోని ఒక నదికి వెళ్తున్నాను. ఏంటీ నదినా? అవును. ఇదే. మీరు చూడగలిగినట్లుగా ఈ నది ప్రవహిస్తోంది, అలాగే నది యొక్క రాళ్లపై, వివిధ sizeలలో, చెక్కబడిన చాలా లింగాలను మీరు చూడవచ్చు. ఈ అద్భుతమైన లింగాలను నేను మీకు తరువాత చూపిస్తాను, కానీ ఈ వీడియోలో మాత్రం, ఈ శిల్పాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది నిజంగా చరిత్రను మార్చే శిల్పం. దీన్ని చూడండి. ఇది ఏమి చూపిస్తుంది? First చూడగానే, అది ఒక UFO లాగా కనిపిస్తుంది, మధ్యలో ఒక పెద్ద వృత్తం, దాని చుట్టూ చిన్న వృత్తాలు ఉన్నాయి చూడండి. కానీ మీరు చిన్న వృత్తాల సంఖ్యను లెక్కించినప్పుడు మాత్రమే, ఏమి జరుగుతుందో మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. వాటిని కలిపి లెక్కిద్దాం.
1,2,3,4,5,6,7,8 మరియు 9. అవును, ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతున్న 9 గ్రహాలు. అవును, మధ్యలో ఉన్న పెద్ద వృత్తం సూర్యుడు, మరియు దాని చుట్టూ ఉన్నవి, మన గ్రహం అయినా భూమితో సహా, ఈ 9 గ్రహాలను చెక్కారు. 2006 లో list నుండి remove చేసే ముందు, మన solar systemలో 9 వ గ్రహం ఉండేదని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో చదువుకుంటున్న students, సూర్యుని చుట్టూ 8 గ్రహాలు మాత్రమే తిరుగుతున్నాయని చదువుతున్నారు, కానీ 20 సంవత్సరాల క్రితం, సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయని అందరూ తెలుసుకున్నారు. ఇంతకీ 9వ గ్రహం పేరు ఏంటీ? ప్లూటో, కొన్నిసార్లు గ్రహం X అని పిలుస్తారు. మీరు అడగవచ్చు, సూర్యుని మరియు 9 గ్రహాల చెక్కడమే కదా ఎందుకు అంత పెద్ద విషయం చేస్తున్నారని మీరు అనవచ్చు? సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయని మనకు ఎప్పుడూ తెలుసు, అంతే కదా? కాదు. ప్లూటో 1930లోనే కనుగొనబడింది. అవును, ఇది 100 సంవత్సరాల కిందటే కనుగొనబడింది, మరియు ఆ సమయంలో, 1930లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మానవులు ఈ గ్రహం X లేదా ప్లూటోను ఎలా కనుగొన్నారో చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
So, మనకు ప్లూటో గురించి 96 సంవత్సరాలు మాత్రమే తెలుసు, కానీ ఈ చెక్కడం చాలా శతాబ్దాల క్రితం జరిగింది. ఇవి వేల సంవత్సరాల నాటివని స్థానికులు చెప్తున్నారు, కానీ పురావస్తు శాస్త్రవేత్తల సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా, ఈ శిల్పాలు 300 సంవత్సరాల కంటే పాతవి. ఈ సైట్ పేరు సహస్రలింగ, మరియు వికీపీడియా పేజీ ఈ శిల్పాలు 1678 మరియు 1718 మధ్య సృష్టించబడ్డాయని స్పష్టంగా పేర్కొంది, కాబట్టి అవి కనీసం మూడు శతాబ్దాల నాటివని తెలుస్తుంది. కాబట్టి, 300 సంవత్సరాల క్రితం జీవించిన "ఆదిమ శిల్పులకు" solar systemలో అత్యంత సుదూర గ్రహం అయిన ప్లూటో గురించి ఎలా తెలుసు?కానీ పురాతన నిర్మాణదారులకు చాలా మంచి కంటి చూపు ఉండవచ్చు, మరియు వారి కంటితో ప్లూటోను చూడగలిగారు, కదా? కాదు. ప్లూటో చాలా దూరంలో ఉన్నందున, ప్లూటోను మీ కంటితో చూడటం అసాధ్యం, అలా అని మీరు బైనాక్యులర్లను ఉపయోగించినా కూడా, మీరు ప్లూటోను చూడలేరు.
మీకు కొంత దృక్పథాన్ని ఇవ్వాలంటే, సూర్యుడు మనకు చాలా దూరంలో ఉన్నాడు, అది భూమి నుండి దాదాపు 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న, ఈ దూరాన్ని ఒక Astronomical Unit (AU) అని అంటారు. ప్లూటో గ్రహం, మన భూమి నుండి 34 Astronomical units దూరంలో ఉంది, కాబట్టి ఇది సూర్యుడి నుండి మన దూరం కంటే 34 రెట్లు దూరంలో ఉంది. అయితే, పురాతన నిర్మాణదారులకు, ప్లూటో గురించి ఎలా తెలుసు, వారు ఎలాంటి పరికరాలను ఉపయోగించారు? సూర్యుడిని మరియు 9 గ్రహాలను study చేయడానికి వారి దగ్గర ఎలాంటి technology ఉండేది? నా ఛానెల్‌లో, నేను కనుగొన్న విషయాలను, మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. భారతదేశంలోని కొన్ని ప్రదేశాల్లో గ్రహాలు, నక్షత్రాలు, అభివృద్ధి చెందిన ఖగోళ శాస్త్రం యొక్క శిల్పాలు ఉన్నాయి, ఇవి ఉండకూడదన్నట్టు అనిపిస్తుంది. Recentగా, ఒక పురాతన ఆలయ గదిలో దాగి ఉన్న ఒక archను నేను మీకు చూపించాను, అది అది చాలా చంద్ర నక్షత్రాలను చూపిస్తోంది. ఈ నక్షత్ర సమూహాలను అద్భుతంగా వివరించారు. పురాతన నిర్మాణదారులు వీటిని ఎలా గమనించారు?
0 notes