Tumgik
#jansenani
dotnewsindia · 6 years
Text
ప్రజాపోరాట యాత్ర లో భాగంగా ఉద్దానం కొరకు ఒక రోజు నిరాహారదీక్ష చేసిన జనసేనాని
ప్రజాపోరాట యాత్ర లో భాగంగా ఉద్దానం వెళ్లిన జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్..అక్కడి వారి సమస్యకు కొన్ని సదుపాయాలు కల్పించాలి,రాష్టానికి ఒక హెల్త్ మినిస్టర్ ని నియమంచడానికి ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చారు.అవి చేయకపోవడంతో ఆయన ఒక రోజు నిరాహారదీక్ష చేశారు.శుక్రవారం సాయంత్రం 5 నుండి తాను బస చేసే రిసార్ట్ లొనే నిరాహార దీక్ష చేప్పటారు. శనివారం ఉదయం 9 గంటల నుండి ప్రజల మధ్య దీక్ష కొనసాగించారు.మహిళలు హారతులతో స్వాగతం పలకగా..అక్కడి ఉద్దాన బాధితుడు పూల దండ వేసి అతనితో పాటు కూర్చోగా..వామపక్షాలు సంఘీభావం తెలపగా,సాయంత్రం 5 గంటలకు పిల్లవాడు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.ఆయన తన ప్రసంగంలో మీ వెన్నుపోటు తెలుసు.. నేను ప్రజల కోసం చేస్తున్న దీక్ష ఇది..మీ మైలేజ్ కోసం కాదు అని ముఖ్యమంత్రిపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ప్రధానమంత్రిని..కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు.కమ్యూనిస్టులు రాష్ట్ర,దేశ నాయకులని కడిగేశారు.పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.మొత్తం మీద ఒక రోజు దీక్ష అంటూ కోట్ల రూపాయలతో జనాన్ని తరలించిన హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దీక్ష విషయంలో ఎన్ని కారణాలు జనసేన పార్టీ ఎన్ని తెలిపినా రిసార్ట్ లో దీక్ష ఏంటి అంటూ రాజకీయ విమర్శకులు విమర్శల వర్షం కురిపిస్తునే ఉన్నారు. [penci_related_posts taxonomies="undefined" title="Janasena Party Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]
1 note · View note