Tumgik
#strangecarvings
praveenmohantelugu · 9 months
Text
youtube
ప్రాచీన భారతీయులు, వీటిని పైకప్పుపై ఎందుకు చెక్కారు? వీటిలో ఉన్న ప్రాముఖ్యత ఇదేనా?
Hey guys, తిరుప్పెరున్తురై పురాతన ఆలయం ఉద్దేశపూర్వకంగానే, చాలా విచిత్రమైన శిల్పాలను దాచిపెడుతోంది. ఈ శిల్పాలు, కనుచూపు మేరలో దాగి ఉన్నా కూడా ఎవరూ చూడటం లేదా analyse చేయడంలేదు. ఈ ప్రధాన ద్వారం పైన చూడండి, ఏంటది? ఇవి ఒక కోతి మరియు ఒక బల్లి. దీనికి అర్ధం ఏంటీ? వాళ్ళు, కేవలం, 2 జంతువులు పోరాడుతున్నట్లు చూపించారా? ఇది చాలా ముఖ్యమైనది అయి ఉండాలి, లేకుంటే వారు ఈ ఆలయ ప్రధాన ద్వారం పైన ఎందుకు వీటిని చెక్కుంటారు? ఈ చెక్కడం సంగతేంటీ, ఇంతకీ దీని అర్థం ఏమిటి? ఇక్కడ మీరు ఒక కోతిని చూడవచ్చు, కానీ ఇది బల్లి కాదు, ఇది ఒక పాము. వీటిని జాగ్రత్తగా చూడండి, మీరు ఈ చెక్కడంలో కొన్ని odd detailsను చాలానే గమనించవచ్చు. ఈ ఆలయంలో, అది కూడా, పూజా మందిరంలో ఈ శిల్పాలను ఎందుకు పెడతారు? And, ఇక్కడున్న, ఈ చెక్కడం గురించి ఏంటీ? ఇక్కడ ఒక బల్లి, ఒక పామును తింటుంది.
దీన్ని చూడండి, ఇక్కడ ఈ పాము శరీరం, చాలా మందంగా కనిపిస్తుంది, ఈ శిల్పాలన్నింటికి అర్థం ఏంటీ అసలు, పురాతన నిర్మాణదారులు, ఆలయం పైన కోతి, పాము మరియు బల్లి వంటి జంతువులను ఎందుకు చెక్కారు? ఈ మూడు జంతువులు, human mindలో ఉన్న partsను సూచించే symbols. ఈ మూడు జంతువులు, మీ మనస్సు యొక్క ఇడ్(Id), Ego and Super-Egoను సూచిస్తాయి. ఇది చాలా వింతగా అనిపిస్తుందని నాకు తెలుసు, ఎందుకంటే ఈ మూడు పదాలను గత 150 సంవత్సరాలలో మాత్రమే సిగ్మండ్ ఫ్రాయిడ్ కనిపెట్టారు. Psychoanalysis founder అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్, మానవ మనస్తత్వం Id లేదా అపస్మారక స్థితి, అహం లేదా చేతన స్వీయ మరియు స్పృహ మరియు అపస్మారక స్థితిలో ఉన్న సూపర్-ఇగోతో చేసిన మంచుకొండ లాంటిదని వివరించారు. ఒక పాము Idని సూచిస్తుంది. ఇది మీ స్వచ్ఛమైన burning desiresను సూచిస్తుంది, అలానే ఇది, మీరు గర్వించని పనులను చేయడానికి మిమ్మల్ని లాగవచ్చు. Id నుండి లైంగిక కోరికలు మరియు దూకుడు ఏర్పడతాయి.
భారతీయ తత్వశాస్త్రంలో, Idని కుండలిని వంటి వివిధ పేర్లతో సూచిస్తారు, ఇది, మీలో కోరికలతో నిండిన ముడి, హద్దులేని ఒక శక్తి. కుండలినిని, సాధారణంగా పాము లాగానే సూచిస్తారు. బర్నింగ్ కోరిక యొక్క అనుభూతిని కుండలిని అని అంటారు, అలానే కోరిక యొక్క వస్తువును మాయ అని అంటారు, దీన్ని పాముగా కూడా సూచిస్తారు. ఉదాహరణకు, మీరు మగవారైతే, మీరు ఒక అందమైన అమ్మాయిని చూసినట్లయితే, మీరు, మీ రక్త ప్రవాహంలో కుండలిని పెరుగుదలను అనుభవించవచ్చు, అయితే అమ్మాయి గ్రహించిన అందాన్ని మాయ అంటారు. ఇప్పుడు, ప్రవీణ్, పాము, Idని సూచిస్తుందని ఎందుకు అంటున్నారాని మీరు నన్ను అడగవచ్చు? ఈ చెక్కడాన్ని చూడండి, ఇతర శిల్పాలతో పాటు పైకప్పుపై కూడా కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది, కదా? అతను, ఒక చేత్తో పామును పట్టుకున్నాడు కానీ, మరో చేత్తో ఏం చేస్తున్నాడో చూడండి? అతను తన ప్రాథమిక కోరికల కారణంగా స్పష్టంగా ఉద్రేకపడుతున్నాడు. మానవులు పాములను పట్టుకోవడం వల్ల ఉద్రేకం చెందరు, మీరు మీ ప్రాథమిక కోరికల వల్ల లేదా ఆ కోరికల వస్తువుల ద్వారా ఉద్రేకానికి గురవుతారు. అతని faceని చూడండి. ఈ వ్యక్తి, తన స్పృహలో లేడు, అతను జంతు, ప్రాథమిక మోడ్‌లో ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది, అతను తన కోరికలో లీనమై ఉన్నందున పూర్తిగా కోల్పోయాడు.
Praveen Mohan Telugu
1 note · View note