Don't wanna be here? Send us removal request.
Photo

గండి చెరువు రంగనాథ స్వామీ దేవాలయం https://www.instagram.com/p/CI-MMzzM79R/?igshid=srgd8a43dee0
0 notes
Photo

Pathirakali Amman Temple dedicated to the goddess Bhadrakali, a form of the goddess Kali Amman in Trincomalee, Eastern Province of Sri Lanka https://www.instagram.com/p/CI7WchGM7_y/?igshid=y0b9mrnl4wz2
0 notes
Photo

కొడంగల్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం..పేదల తిరుపతి గా ప్రసిద్ధి చెందిన క్షేత్రం..వైఖనసా అగమలను పాటించే బహు కొన్ని దేవాలయాలు ఇది ఒకటి. #Kodangal #KodangalBalajitemple https://www.instagram.com/p/CI7VA5tM16a/?igshid=ma275i4hn3wq
0 notes
Photo

కూకట్పల్లి రంగనాథ స్వామి దేవాలయం https://www.instagram.com/p/CI7EEsGMQDd/?igshid=1lmd6dkx5vjse
0 notes
Photo

జియగుడా రంగనాథ స్వామీ దేవాలయం https://www.instagram.com/p/CI59GkjsFi_/?igshid=1ddt7ukx2plrl
0 notes
Photo

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం | సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే | భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ || జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ | దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ || కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ | వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ || హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత | పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ || యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ | యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ || ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః | మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ || భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే | జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ || దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ | సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ || జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే | జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ || భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే | నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ || బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే | ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ || అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే | విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ || సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ | సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ || శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర | యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ || క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ | దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ || దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే | గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ || శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ | సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ || ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ | దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ || https://www.instagram.com/p/CI4kTPzsOn_/?igshid=1wp4qtyjf32rw
0 notes
Photo

#మనదేవాలయాలు_మనసంపద #ప్రతిఒక్కరు_తప్పకుండా_షేర్_చేయండి #రంగనాథస్వామీదేవాలయాలు #ranganathaswamytemples #ధనుర్మాసం రంగనాథ స్వామీ దేవాలయాలు-4 తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం -నెల్లూరు -------------------------------------------------- నెల్లూరు జిల్లా పెన్నా నది తీరన వెలసిన ప్రసిద్ద వైష్ణవ క్షేత్రం తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం. పల్లవులు 7 వ శతాబ్దం లో విగ్రహన్ని ప్రతిస్తించగా 12 వ శతాబ్దం లో చోళులు దేవాలయాన్ని నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది.17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి వారు దక్షిణం దీషగా శిరస్సుంచి పచిమముఖంగా శేసశాల్ప శాయనుడై బక్తుల సేవలు ఆడుకుంటున్నాడు . ఏకాదశి ,ధనుర్మాసం లో ఇక్కడ విశెసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీ��ింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. మీ శ్రేయోబిలాషి గిరీష్ www.manatemples.in 91-9866933582 https://www.instagram.com/p/CI4XSXWsVeB/?igshid=vy3a6cp4bgyn
0 notes
Photo

#మనదేవాలయాలు_మనసంపద #ప్రతిఒక్కరు_తప్పకుండా_షేర్_చేయండి #రంగనాథస్వామీదేవాలయాలు #ధనుర్మాసం #అనేగుండి #ranganathaswamytemples రంగనాథ స్వామీ దేవాలయాలు-3 13-15వ శతాబ్ధములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి. . రంగనాథ స్వామి దేవాలయం :-అనేగుండి ---------------------------------------------------- కర్ణాటక రాష్ట్రము లోని కొప్పల్ జిల్లలో గంగావతి తాలుక లో అనేగుండి లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. రాయల వారి కాలం లో దే దిప్య మనంగా వెలసిన దివ్యమైన రంగనాథ స్వామి దేవాలయం నగరం నడి బొడ్డు లో ఉంటుంది.తుంగభద్ర నది కి సమీపం లో కొలువైన దివ్యమైన ప్రదేశం ఇది. ఈ దేవాలయం లో ఆ రంగనాథుడు ఎంతో అందంగా,చూడ చక్కగా ఉంటాడు . దేవాలయాని కి ఎదురుగా రంగనాథుని ఊరేగింపు చేయడానికి వాడె రథోత్సవం ఎంతో అద్బుతంగా ఉంటుంది . ఈ క్షేత్రం లోనే రాయల వారి తరానికి సంబదించిన కుటుంబీకులు ఉండేవారు అట. ఇప్పటికి ఆ నాటి రాయల వారి కుటుంబాలకు సంబదించిన గృహాలు ఉంటాయి . వెళ్ళు మార్గం : - కర్ణాటక లోని హోస్పేట నుండి ఇక్కడికి సులువుగా వేల్లవొచ్చు . #AnegundiRanganathaswamytemple #Ranganathaswamy #HampiTour #SrikrishnaDevarayaSamrajyam మీ శ్రేయోభిలాషి గిరీష్ www.manatemples.in 91-9866933582 https://www.instagram.com/p/CI3YthnMyxg/?igshid=19qo6qiseq75a
#మనద#ప#ర#ధన#అన#ranganathaswamytemples#anegundiranganathaswamytemple#ranganathaswamy#hampitour#srikrishnadevarayasamrajyam
0 notes
Photo

ఋణ విమోచన నృసింహ స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ || ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ || స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ || సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ || ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ || క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ || వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ || య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ | అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ || నరసింహావతారం ------------------------ దశావతారాల్లో నాల్గవదే నరసింహావతారం. మహావిష్ణువు బాలభక్తుడైన ప్రహ్లాదుని మాటనిలపడంకోసం, క్రూరుడైన హిరణ్యకశ్యపుని చంపి మానవులను,విష్ణు భక్తులైన మునులనూ కాపాడటంకోసం , హిరణ్యకశ్యపుని వరాలకు అతీతమైన అవతారం ఎత్తాడు.అదే నరసింహావతారం. హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి.తన సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలనూ,మానవులనూ, మునులను సైతం బాధిస్తూ , బలగర్వంతో భూమిని పైకెట్టి సముద్రంలో వేస్తాడు. మునుల ప్రార్ధనతో విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిని కాచి, అతడ్ని సం హరిస్తాడు.దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించీ తపస్సుచేసి నరులవలన, స్త్రీపురుషులవలనా, ఏఆయుధంవలనా , పగలు, రాత్రి ,నేలపైనా, ఆకాశంలో ఎక్కడా మరణం లేనివరం పొదుతాడు.అందువలన విష్ణుమూర్తి ,ఆవరాలకు అతీతమైన అవతారం ఎత్తవలసి వచ్చింది.నడుంవరకూ సింహం పంజాతో ఉండేవిధంగా అవతరించి పగలు రాత్రికాని సాయంసమయంలో , గుమ్మమ్మీద కూర్చుని తనవడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకుని సిం హం గోళ్ళతో కడుపుచీల్చి సమ్హరిస్తాడు.అందువలన మానవ+ సిమ్హ రూపం గనుక నరసిమ్హావతారంగా పేరు వచ్చింది. మీ శ్రేయోభిలాషి గిరీష్ https://www.instagram.com/p/CI3OPFis1zl/?igshid=z62w93ylu1ey
0 notes
Photo

కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం..పిలవగానే పలికే తల్లి యప్రాల్ సంతాన నాగదేవత అమ్మ వారు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఇ దేవాలయంలో అమ్మ వారికి ప్రతి నిత్యము మరి శుక్రవారం విశేషమైన అభిషేకాలు,పూజలు నిర్వహించ��డుతాయి. ప్రత్యేక కార్యక్రమాలు /సేవలు ---------------------------------- కుంకుమ పూజలు శివ అభిషేకం నవగ్రహ పూజలు రాహు కేతు ప్రతిస్టాలు సంకటహర చతుర్థి గణపతి వ్రతం శుక్రవారం అమ్మవారికి అభిషేకం దేవాలయానికి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలి అన్న నాకు సందేశం పంపవచ్చు. మీ శ్రేయోభిలాషి గిరీష్ www.manatemples.in Whatsapp:91-9866933582 https://www.instagram.com/p/CI3CsnKMNnq/?igshid=72duzwx930v9
0 notes
Photo

#దయచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి #మనదేవాలయాలు_మనసంపద #మనదేవాలయాలు #bolikonda బోలికొండ రంగనాథ స్వామి దేవాలయం -బోలికొండ --------------------------------------------------- అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారి లో గుత్తి పట్టణానికి 9 కి మీ దూరం లో గల తొండపాడు గ్రామం లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది మరియు మహిమన్మితమైన విష్ణు క్షేత్రం . మహర్షుల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రం లో వెలిసాడు అని పురాణాలూ చెబుతున్నాయి . స్వామివారు కొలువై వున్న కొండకు “శ్వేతగిరి అని పేరు. తెల్లటిరాళ్ళు ఉన్నటువంటి కొండ కనుక దీనికి ‘శ్వేతగిరి’ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఆ కొండకే ‘బోలికొండ’ అని పేరు. కొండపైన తెల్లటి పొడలు వచ్చినట్లుగా (బొల్లి) ఉండడం మూలంగా ఆ కొండకు “బోలికొండ’’ అనే పేరు ఏర్పడిందని కూడా ప్రచారంలో ఉంది. బోలికొండ మీద కొలువైవున్న రంగనాథస్వామి కనుక “బోలికొండ రంగనాథస్వామి’’ అనే పేరు ఈ స్వామికి వచ్చినట్లు కథనం. కొండపైన గల ఆలయంలో వెలసిన శ్రీరంగనాథస్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీరంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు. దక్షిణాభిముఖంగా వున్న ఈ ఆలయం ముఖమండపం, గర్భాలయాలను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీరంగనాథస్వామి శేషతల్పంపై శయనించి, భక్తులపై తన చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి చరణముల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చుని వుంటారు. స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడిని, స్వామివారి ముందు వైపునగల ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనవచ్చు. ఈ రంగనాథస్వామికి “మాణిక్య రంగనాథస్వామి’’ అని పేరు. పవిత్రమైన హృదయాలతో ఈ స్వామిని సేవిస్తే కోరికలన్నీ తీరుతాయని ఈ ప్రాంత భక్తుల నమ్మకం. వెళ్ళు మార్గం :- ‘తాడిపత్రి – గుత్తి’ ప్రధాన రహదారిలో వున్న తొండపాడు వద్ద బస్సులు ఆగుతయి మీ శ్రేయోభిలాషి గిరీష్ www.manatemples.in https://www.instagram.com/p/CI139lxMzpT/?igshid=1x0heox7bfug3
0 notes
Photo

తమిళనాడు లోని Thoothukudi జిల్లాలోని vettuvan koil గ్రామం లో 8వ శతాబ్దం లో చెక్కబడిన శివ దేవుని ఆలయం. #vettuvankoil https://www.instagram.com/p/CI1t9c_MZOu/?igshid=vzhw6zy6k4zi
0 notes
Photo

ధనుర్మాసం శుభాకాంక్షలు https://www.instagram.com/p/CI03d5cMTDO/?igshid=au6flxsk448v
0 notes
Photo

హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్|| ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయ https://www.instagram.com/p/CI0voJ9s14D/?igshid=u6zqfbcs02v0
0 notes
Photo

#మనదేవాలయాలు_మనసంపద #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి #మనదేవాలయాలు #thondamanudu శ్రీకాళహస్తి కి సమీపం లో తొండమానుడు గ్రామం లో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామీ దేవాలయం ఎంతో ఘనమైన చరిత్రగల దేవాలయం. తొండమన్ చక్రవర్తి వయస్సు పైబడి తిరముల వెంకటేశుని దర్శించుకోలేక బాధపడుతూ ఉంటే అయిన భక్తికి మెచ్చుకోని స్వామి వారే శ్రీదేవి,భూదేవి సమేతంగా వచ్చి కొలువైనారు అని స్థల పురాణం. తొండమన్ చక్రవర్తి నిర్మించిన ఇ దేవాలయం తిరుమల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.గర్భాలయం లో వెలసిన స్వామి ఒక చేతితో యోగముద్ర,మరొక చేతితో అభయ హస్త ముద్ర తో శ్రీదేవి,భూదేవి సమేతంగా కూర్చొని దర్శనం ఇస్తారు..ఇలాంటి దర్శనం మనకు చాలావరకు ఎక్కడ దొరకదు. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజలు నిర్వహించబడుతాయి.ఆలయం లో తిరుమల తిరుపతి దేవస్థానం అద్వర్యం లో నడుస్తుంది.కోరిన కోరికలు తీర్చే దేవుడు వెంకటేశుడు. ఎలా వెళ్ళాలి:శ్రీ కాళహస్తి నుండి 9కిమి దూరం లో ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రం!! మీ శ్రేయోభిలాషి గిరీష్ https://www.instagram.com/p/CI0hJb3ssDK/?igshid=1o542dpk3n18o
0 notes
Photo

కొడంగల్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం https://www.instagram.com/p/CI0Y_5vMtxf/?igshid=hgsacu8l81zt
0 notes
Photo

Amruteshvara temple is located in the village of Amruthapur Karnataka. The temple was built in 1196 C.E. https://www.instagram.com/p/CI0Y21tskeT/?igshid=4mbmhc9yay4k
0 notes