Tumgik
#Teflonbadforyou
aarogyasutralu-blog · 6 years
Text
మీరు వంటకు ఈ పాత్రలు ఉపయోగిస్తున్నారా? అయితే మీ పని గోవింద!
Tumblr media
Which Cookware to Avoid and What Safter Alternatives you can replace with them. మనం తినే ఆహార పదార్థాల మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మనం తినే ఆహార పదార్థాలు మనకి ఔషధంగా మారుతాయా లేదా విషయంగా మారుతాయనేది ఆ ఆహారం వండిన పాత్రల మీద ఆధారపడి ఉంటుంది అంటే నమ్మగలరా? ఇది నిజమే అని ఆధారాలు చూపిస్తున్నారు నిపుణులు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వపు రోజులలో ఆహారం మట్టిపాత్రలో వండేవారు. దానితో  రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండేది. కాలం మారుతున్న సమయంలో అన్నింటిలో  మార్పులు చేసుకున్నాయి. ఈ రోజులలో వంటిల్లు అందరూ ఎక్కువగా అల్యూమినియం పాత్రలు, నాన్స్టిక్ పాత్రలు, సిరామిక్ పాత్రలు  వాడుతున్నారు. ఈ పాత్రలు ఉపయోగించడం వలన కలిగే అనారోగ్యం, ఈ పాత్రల బదులుగా ఎలాంటి పాత్రలు వాడాలో తెలుసుకుందాం. అల్యూమినియం పాత్రలు
Tumblr media
అల్యూమినియం పాత్రలలో వంట చేసుకుని తినడం వలన మనుషులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకా చాలా రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని కెనడాకు చెందిన ఒక యూనివర్సిటీ వారి పరిశోధనలలో తేలింది. యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం అల్యూమినియం పాత్రలలో వండటం వలన పాత్రలు వేడెక్కి  కరిగి ప్రతి వంటతో పాటు మన శరీరంలోకి 1 నుండి 2 గ్రాముల అల్యూమినియం చేరుతుంది. అసిడిక్ పదార్థాలు అయిన నిమ్మకాయ టమాటో లాంటివి  వండితే ఈ శాతం 5 గ్రాముల కు చేరుతుంది. ప్రతి మనిషి రోజుకు 30 నుంచి 50 గ్రాముల అల్యూమినియం తీసుకోవచ్చు, కానీ మనం త్రాగే నీరు మరియు ఇతర పదార్థాల్లో కూడా చాలా అల్యూమినియం ఉంటుంది.  చివరికి వంట గిన్నెలలో ఉండే  అల్యూమినియం కూడా వంటిలోకి చేరడంతో శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ శాతం అల్యూమినియం మన శరీరంలోకి చేరి చాలా రోగాలకు పరోక్షకారకంగా  తయారు అవుతుంది. అల్యూమినియం ఎక్కువ తీసుకోవడం వలన శరీరం బరువు పెరుగుతుంది. ఎముకలు బలహీన పడి కీళ్ళ నొప్పులు వస్తాయి. మెదడుకు సంబంధించిన వ్యాధులతో పాటు అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ పాత్రకు బదులుగా స్టీల్ పాత్రలు వాడొచ్చు. స్టీల్ పాత్రలలో ఆహరం  ఆహారం అడుగు మాడకుండా ఉండటానికి అల్ట్రా స్టెయిన్లెస్ స్టీల్, నాన్ స్టిక్ స్టీల్  లాంటివి చూసి ఎంచుకోవాలి. నాన్స్టిక్ పాత్రలు Teflon Cookware.
Tumblr media
ప్రస్తుత కాలంలో నాన్స్టిక్ పాత్రలు వాడకం బాగా పెరిగిపోయింది. కానీ  అవి ఎంత హానికరమో తెలిస్తే వాటిని అస్సలు వాడరు. ఈ టెఫ్లాన్ వంట సామాన్లు TPFE Polytetrafluroethylene యొక్క పూతతో లభిస్తాయి. ఇది ప్లాస్టిక్ పాలిమర్  572 డిగ్రీల Fahrenheit మీద వేడి చేసినప్పుడు విషాన్ని విడుదల చేయడము మొదలవుతుంది. ఈ విషపూరిత వాయువులు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తాయి. జ్వరం ఫ్లూ వంటి లక్షణాలకు దారితీస్తుంది.  Teflon Cookware లో కనిపించే మరో రసాయనిక సమ్మేళనం PFOA (Perfluorooctanoic Acid) ఇది  చాలా కాలం పాటు శరీరంలో అలాగే వాతావరణంలో ఉంటుంది. రీసెంట్ గా జరిగిన పరిశోధనలలో తేలింది ఏమిటంటే ఇలాంటి పదార్థాల వలన బ్రెస్ట్ , ప్రోస్టేట్, ఒవరియన్  లాంటి అనేక రకాల క్యాన్సర్ వస్తున్నాయని కనుగొన్నారు. వీటి బదులుగా ఇనుము పాత్రలను, క్యాస్ట్ ఐరన్ పాత్రలను  ట్రై చేయండి. ఇవి నాన్ స్టిక్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఎలాంటి హానికర పదార్థాలను విడుదల చేయవు. శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రాగి పాత్రలు
Tumblr media
కొంతమంది రాగి పాత్రలలో ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగిస్తారు. రాగి పాత్రలు వండిన ఆహారం విషంతో సమానం. రాగి మన శరీరానికి చాలా కొంచెం అవసరం. అది ఎక్కువైతే చాలా ప్రమాదకరం. నిమ్మకాయ టమాటో లాంటి సిట్రిక్ యాసిడ్ కనుక రాగి పాత్రలలో వండి వాటిని తినడం వల్ల  blood  vomiting, light headedness, yellowy skin మరియు Gastronictestinal disstress ఇంకా ఎన్నో రకాల రోగాలకు అది దారి తీస్తుంది. సెరమిక్ పూత ఉన్న పాత్రలు.
Tumblr media
సెరమిక్ పూటలో లెడ్ మరియు కాడ్మియం ఉంటాయి. ఈ పాత్రలు వాడేకొద్దీ లెడ్ మరియు కాడ్మియం ఆహారంలో  కలవడం ఆరంభిస్తాయి. వాటి వలన  పొత్తి కడుపునొప్పి, తలనొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. 100% సెరమిక్ గల పాత్రలను వాడొచ్చు కానీ అవి కొంచెం ఎక్కువ ధర  కలిగి ఉంటాయి. దీన్ని  బట్టి మీ కుటుంబం ఆరోగ్యం మీరు ఉపయోగించే పాత్రలు మీద కూడా ఆధారపడి ఉంటుంది అని తెలుస్తుంది. అల్యూమినియం, రాగి,  టెఫ్లాన్ నాన్ స్టిక్, సెరమిక్ వంటి పాత్రలకు బదులుగా స్టీల్, గ్లాస్, ఇనుప పాత్రలను ఉపయోగించండి.  వీటి వాడకం మన ఆధునిక జీవితానికి సరిగ్గా సరిపోతాయి. మట్టి పాత్రలుగనుక  ఉపయోగిస్తే అంతకు మించిన ఔషద ఆహారం మీ కుటుంబానికి మరొకటి ఉండదు. Read the full article
0 notes