#defenceweapen
Explore tagged Tumblr posts
Video
youtube
భారతీయ రాజుల రహస్య ఆయుధం - పులి పంజాలు!
Hey guys, ఈ రోజు మనం చాలా interesting అయిన ఒక పురాతన భారతదేశపు ఆయుధాన్ని చూడబోతున్నాము, దాని పేరు బాగ్ నక్ అంటే పులి యొక్క గోర్లు అని అర్ధం. మీరు ఇక్కడ చూసేది అసలైన పురాతన వస్తువు, ఇంకా ఈ పులి గోర్లను వంద సంవత్సరాలకు ముందు ఉపయోగించారు. దీనికి ఐదు పంజాలు రెండు ఉంగరాలు లాంటివి ఉన్నాయి, So మీరు ఈ ఉంగరాలలో మీ వేళ్ళను దూర్చితే మీ అరచేతిలో ఆ గోళ్లను ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అని మనం demo చేసి చూద్దాం, నేను ఒక కార్డ్‌బోర్డ్‌ని పట్టుకున్నాను కాబట్టి అది నా శరీరాన్ని గాయపరచదు.
చూడడానికి అతను తన ఒట్టి చేతులతో నన్ను కొట్టినట్లు కనిపిస్తోంది, కానీ నిజానికి ఇది నా శరీరంపై లోతైన గాయం ఏర్పరుస్తుంది. ఇది చూడడానికి అంత useful అయిన ఆయుధంగా అనిపించదు, కానీ మీరు కార్డ్ బోర్డ్‌ను చూసినప్పుడు, ఇది ఎంత తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుందని మీకు అర్ధ��వుతుంది. చెప్పాలంటే, ఈ కార్డ్ బోర్డ్‌కి backsideలో కూడా గీరిన గాయాలు తెలుస్తున్నాయి చుడండి. So, ఇది చాలా danger అయిన ఆయుధం, నేను already చెప్పినట్లు ఇది ఒక పురాతన వస్తువు, దీని చివర కొంచం మొద్దుబారింది కానీ ఒక కొత్త bagh nakh ఆయుధం ఎంత ప్రాణాంతకమని కొంచం ఊహించుకుంటే మీకు బాగా అర్ధమవుతుంది. నేను మీకు చెప్పినట్లుగా, బాగ్ నఖ్ అంటే పులి గోళ్లు, tiger claws అని అర్థం. ఎందుకు ఈ పేరు వచ్చింది?
ఎందుకు దీన్ని బాగ్ నఖ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే పులులకు retractable claws అంటే వాటికి ఇష్టమైనప్పుడు పంజాలను లోపలికి ముడుచుకుంటాయి, అవసరమైనప్పుడు పంజాలను బయటికి తీస్తాయి. ఒక పులి పాదం యొక్క anatomy అంటే శరీర నిర్మాణ శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలా interestingగా ఉంటుంది, ఎందుకంటే దాదాపు 3 నుండి 4 అంగుళాల పొడవు ఉన్న ఈ పంజాలు ఇంచుమించు మన కంటికి కనిపించకుండానే ఉంటాయి. చూడండి, దీన్ని చూస్తుంటే ప్రమాదకరం కాదన్నట్టు తెలుస్తుంది కదా, కానీ పులి మీపై దాడి చేయాలనుకున్నప్పుడు మాత్రమే పదునైన ఈ పంజాలు బయటకు వస్తాయి.
అందుకే ఈ ఆయుధాన్ని టైగర్ క్లాస్ అని పిలుస్తారు, ఎందుకంటే మీరు ఈ ఆయుధాన్ని మీ చేతికి వేసుకుని మీరు శత్రువులపై దాడి చేసే వరకు దాని గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆయుధం నింజా వాళ్లకు కూడా చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఒక నింజా వ్యక్తి సాధారణంగా ఒక రహస్య ఏజెంట్ అని చెప్పవచ్చు, అతను అనుకోని సమయాళ్ళల్లో దాడిచేయడం, మోసగించి కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా. అందువల్ల ఇప్పుడున్న నింజాలు కూడా ఈ bagh nakhలను ఇష్టపడి choose చేసుకుని దాన్ని ఆధునిక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ Ninjas కోసంమనే bagh nakhలను Amazon.com ఇంకా ఇతర వెబ్సైట్లలో కూడా అమ్ముతున్నారు.
ఈ టైగర్ క్లాస్ లను ఉపయోగించే విధానం ఇంకా మోసం చేసి గాయపరిచే విధానం ఇవన్నీ తెల్లవాళ్ళను చాలా ఆకర్షించింది, అందుకే దీన్ని Forged in Fire అనే టీవీ షోలలో దీన్ని చూపించారు. ఇదంతా వినడానికి చాలా fancyగా అనిపిస్తుంది, కానీ టైగర్ క్లావ్లు నిజంగా సమర్థవంతమైన ఆయుధమేనా అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. Yes, ఈ ఆయుధం మన భారతదేశ చరిత్రను ఎలా మార్చిందని అనడానికి మన దగ్గర historical evidencesలు ఉన్నాయి. పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో, అంటే దాదాపు మూడువందల అరవై సంవత్సరాల క్రితం, కొన్ని సమస్యలను రాజతంత్ర విషయాలతో పరిష్కరించుకోవడానికి ఇద్దరు గొప్ప రాజులు కలుసుకున్నారు.
వాళ్ళు ఎవరంటే ఒకరు శివాజీ, మరొకరు Afzal Khan, అయితే afzal khanకు ఒక అలవాటు ఉంది, అది ఏంటంటే ఇతర రాజులను రాజతంత్ర చర్చల కోసం పిలిచినప్పుడు, సరేలే మాట్లాడడానికే కదా పిలుస్తున్నాడని ఆ రాజులు ఏ ఆయుధాలు తేకుండా వస్తారు, ఆ తర్వాత చర్చ జరిగేటప్పుడే వారిని మోసం చేసి హత్య చేయడమే ఈ Afzal Khan అలవాటు. రాజా శివాజీ కూడా అలాంటి ఒక చర్చకు ఆయుధాలతో వెళ్ళనట్టు నటించారు, కానీ ఈ పులి గోళ్లను శివాజీ ఆయన చేతిలో దాచి పె��్టుకున్నాడు. ఇక్కడ interesting అయిన విషయం ఏంటంటే చాలా పెద్ద రూపంతో ఆరు అడుగులు ఏడు ఇంచుల ఎత్తుగా ఉంటాడు, కానీ శివాజీ కేవలం ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
Afzal Khan శివాజీని కౌగిలించుకున్నపుడు ఒక పెద్ద కత్తితో శివాజీని పొడవడానికి try చేసాడు, కానీ ఆశ్చర్యకరంగా, శివాజీ తన బట్టల లోపల కవచాన్ని వేసుకున్నాడు కాబట్టి అది శివాజీని కాపాడింది. శివాజీ వెంటనే పులి గోళ్లను ఉపయోగించి Afzal Khanను పొడిచేసారు. పులి గోళ్లు అతని శరీరంపై తీవ్ర గాయాన్ని చేసి రక్తస్రావం కావడంతో Afzal Khan చనిపోయాడు. So దీని నుండి మనకు ఏం తెలుస్తుందంటే, ఈ టైగర్ పంజాలను రహస్యంగా ఉపయోగించే ఒక మంచి ఆయుధం మాత్రమే కాదు, ఇది శత్రువుపై దాడి చేయడానికి ఇంకా చంపడానికి కూడా సమర్థవంతమైన ఆయుధంగా ఉంది.
భారతీయ ఆయుధాల గురించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆయుధాలను చాలా వరకు జంతువులు స్ఫూర్తితో ఇంకా ప్రకృతి ఆధారంగా చేయబడుతున్నాయి. నేను ముందు వీడియోలో మడు అనే ఆయుధాన్ని మీకు చూపించాను గుర్తుందా, ఇది కృష్ణ జింక యొక్క కొమ్ముల ఆధారంగా చేయబడింది. ఈ పులి పంజాలు చాలా modificationsతో అనేక typesలలో కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వాటికి కత్తులు attach అయినట్టు ఉన్నాయి, ఈ కత్తులను బిచ్చువా అని అంటారు, బిచ్చువా అంటే తేలు కుట్టడం. Yes, ఈ ఆయుధాన్ని తేలు యొక్క తోకను ఆధారంగా చేసి దీన్ని చేశారు.
- Praveen Mohan Telugu
#Southindia#Indianweapon#Ancientindianweapon#Hinduism#History#AdvancedAncientTechnology#thursdayvibes#TamilNadu#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#AdvancedWeapons#defenceweapen#Baghnakhweapon#tumblr feed#tumbleweed#Tumblr tweet
0 notes