Don't wanna be here? Send us removal request.
Photo

#TDP #APHighCourt #HighCourt #AndhraPradesh టీడీపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్! ఐపీఎఎస్‌ల ను అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జగన్‌కు టీఆర్ఎస్ వెయ్యి కోట్ల.. పై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ ! దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఐపీఎఎస్‌ల బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులపై ఈసీఐ జోక్యం తగదని 1978లో సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చూపారు.
0 notes
Photo

#AlluArjun #VenuSriRam మరో సినిమాకి ఓకే చెప్పిన బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దరకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.మరోపక్క సుకుమార్ కు ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు అల్లు హీరో. అల్లు అర్జున్ హోలీ సందడి చూశారా ? ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఆయన దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాల డైరక్టర్ వేణు శ్రీరామ్ తో బన్నీ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ���మాచారం. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రెండు సినిమాలు చేసిన వేణు శ్రీరామ్ ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా కి సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
0 notes
Video
youtube
#Maharshi #ChotiChotiBaatein #AllariNaresh #VamsiPaidipally మహర్షి నుండి 'చోటీ చోటీ బాతే..' పాట విడుదల వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – పూజా హగ్దే జంటగా తెరకెక్కిన మహర్షి చిత్రం మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు . నెగటివ్ రోల్ లో మిల్కీ బ్యూటీ …! ఈ నేపథ్యంలో ప్రమోషన్ ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్.తాజాగా ఈ చిత్రం నుండి మొదటి పాట ‘చోటీ చోటీ బాతే.. మీఠీ మీఠీ యాదే’ ను ఈరోజు విడుదల చేశారు. ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సహం నింపింది చిత్ర యూనిట్. వీరి ముగ్గురికి సంబంధించిన పూర్తి లుక్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి.
0 notes
Text
'ఎన్టీఆర్' కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
#Jr.NTR #RanaDaggubati 'ఎన్టీఆర్' కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన రానా దగ్గుపాటి…అందరితో ఎలాంటి బేధం లేకుండా కలిసి మెలిసి ఉంటారు.ఇక రానా బెస్ట్ ఫ్రెండ్స్ లలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ హీరో ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పుడు హీరోయిన్స్ వంతు..
అమరచిత్రకథ అనే పుస్తకాల సిరీస్ ను తారక్ కు గిఫ్ట్ గా పంపించాడు. ఈ అమరచిత్రకథలో పురాణాలు, వీరగాథలు, చరిత్రలోని గొప్పవ్యక్తుల జీవితాలు, గొప్ప సంఘటనలు, జానపద కథలు…
View On WordPress
0 notes
Photo

#AliaBhatt #DaisyEdgarJones #RRR'ఆర్ఆర్ఆర్'లో ఇప్పుడు హీరోయిన్స్ వంతు.. అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటించనున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ మారింది ! ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ షెడ్యూలు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ఇప్పుడు తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ తోపాటు హీరోయిన్లు అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారు.దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇక ఈ మూవీ లో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకానుంది.
0 notes
Photo

#Nani,Jersy #Tollywood 'జెర్సీ' లో నాని ఇలా.. వెరైటీ స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న నాని,ప్రస్తుతం 'జెర్సీ' అనే సినిమాలో నటిస్తున్నాడు.వేసవి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా అలరించబోతున్నాడు. సితార డాన్స్ కు ఫిదా అంటున్న మహేష్! గతంలో కబాడి ఆటగాడిగా భీమిలి సినిమాలో నటించిన నాని, తాజాగా క్రికెటర్ అవతారం ఎత్తడంతో ఆయన అభిమానులు ఈ సినిమా పై అంచనాలు బీభత్సంగా పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమాలో నాని చనిపోతున్నట్లు, అది కూడా గ్రౌండ్లోనే అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.నిజానికి ఈ సినిమా 38 ఏళ్ళ వయసులో గ్రౌండ్ లోనే ప్రాణాలు వదిలిన రమణ్ లాంబా అనే క్రికెటర్ కథ ఆధారంగా రూపొందుతుందట.
0 notes
Text
చరణ్ కోసం అమితాబ్ ఇలా చేసాడట!
#RamCharan #RRR #RRRMovie #AmitabhBachchan చరణ్ కోసం అమితాబ్ ఇలా చేసాడట!
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా వెండితెరకు పరిచయం అయిన రామ్ చరణ్ ,అనతికాలంలోనే టాలీవుడ్ ఇండస్��్రీ బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన కలెక్షన్లు మరియు రికార్డులు సృష్టించి తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకొన్నాడు.
రామ్ చరణ్ ఆస్తులు చూస్తే ఆశ్చర్యమే!
ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా మరో పక్క తన తండ్రి చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో…
View On WordPress
0 notes
Text
'#RRR' లో మంచు హీరో?
#RRR #RRRMovie #RamCharan #JrNTR #Rajamouli #ManchuManoj #Tollywood '#RRR' లో మంచు హీరో?
బాహుబలి తర్వార రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘#RRR’. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరో తెలుసా?
400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయికలుగా,ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ కనిపించనున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘#RRR’ లో మంచు…
View On WordPress
0 notes
Text
ప్రచారానికి నేతలు కావాలి:చంద్రబాబు
#TDP #Chandrababunaidu #Lokeshbabu #Andhrapradesh #2019Elections ప్రచారానికి నేతలు కావాలి:చంద్రబాబు
ఉదయం లేచిన దగ్గర్నుంచీ భజంత్రీలు వాయించుకునే చంద్రబాబు, రాష్ట్రంలో ప్రచారం చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటున్నారు.
ప్రచారాలలో లోకేష్ కు చుక్కెదురు!
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకూ పలు ప్రచార సభలు నిర్వహించారు. వాటికి జనం సరిగా రావడం లేదు. ఆ వచ్చిన కొద్దిపాటి జనం నుంచీ ఆయన ప్రసంగాలకు స్పందన కనిపించడం లేదు. పైగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులేంటో…
View On WordPress
0 notes
Text
పవన్ గుట్టు బయటపెట్టిన ఎం రాఘవరావు!
#Janasena #JanasenaLeader #Pawankalyan #Andhrapradesh #2019Elections పవన్ గుట్టు బయటపెట్టిన ఎం రాఘవరావు!
సినీ నటులకు అభిమాన ధనమే పెట్టుబడ��.ఆ విధంగా సినీనటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆ నటుడు అభిమానులను సమాదరించకపోయినా, అతని తీరు నచ్చకపోఅయినా నిజ జీవితంలో ఆ హీరో మీదనే అభిమాని ఫైర్ అవుతాడు.
మొన్న పోసాని.. నిన్న చిన్నిక్రిష్ణ.. నేడు ఎవరో?
ఇప్పుడు విశాఖలో అదే జరిగింది. ఆయన ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యస్ఖుడు, పైగా బ్లడ్ బాంక్ అధ్యక్షుడు. ఎన్నో కార్యక్రమాలు చిరంజీవి తరఫున చేశారు.
ప్రజారాజ్యం…
View On WordPress
0 notes
Text
వైసీపీపై భారీ కుట్ర!
#YSRCP #YSJagan #TDP #ChandrababuNaidu #Andhrapradesh #2019Elections వైసీపీపై భారీ కుట్ర!
కొంత మంది విజయానికి దొడ్డిదార్లు కూడా కనిపెడుతుంటారు. అక్రమ పద్దతుల్లో విజయం కోసం అర్రులు చాస్తారు.ఇప్పుడు అలాంటి వారిలో తెలుగు దేశం పార్టీ కూడా చేరినట్టు కనిపిస్తోంది.
దిక్కు తోచని స్థితిలో మంత్రి నారాయణ!
అసలు విషయానికి వస్తే ,ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ను శిఖండిలా అడ్డుపెట్టుకుని, ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు చూపుతున్న…
View On WordPress
0 notes
Photo

#Maharshi #MaheshBabu #VamsiPaidipally #AllariNaresh 'మహర్షి' కొత్త పోస్టర్ విడుదల వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి .మహేష్ కి ఇది 25 వ చిత్రం కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే నటించనుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘మహర్షి’ లో ఆ సీన్ హైలైట్ కానుందట ! తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి రేపు ఒక పాట విడుదల కానుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్.ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్నీ దిల్ రాజు, అశ్విని దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది
0 notes
Photo

ప్రచారంలో పాల్గొనున్న విజయమ్మ ,షర్మిల ఈనెల 29 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి వైఎస్ విజయమ్మ గురువారం నివాళులు అర్పించనున్నారు. పులివెందులలో ఎగసిన జనకెరటం 29న ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు వైఎస్ విజయమ్మ.30న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లోనూ.. 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లోనూ విజయమ్మ ప్రచారం చేస్తారు. 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.30న గూంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ.. 31న గంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోనూ షర్మిల ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
0 notes
Photo

#Seetha #PayalRajput #BellamkondaSaiSrinivas #KajalAgarwal పెప్పీసాంగ్‌కు స్టెప్పులేస్తున్న పాయల్ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నతాజా చిత్రం 'సీత'.కాజల్ నెగిటివ్‌రోల్ లో కనిపించనున్న ఈచిత్రంలో సోనూ సూద్ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం విశేషం. మహర్షి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఒక పెప్పీసాంగ్‌కు స్టెప్పులేసే లక్కీ చాన్స్ దక్కించుకుందట పాయల్. అనూప్ రూబెన్స్ స‍్వరపర్చిన ఈ పాటను హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. పాయల్, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కానున్నాయి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
0 notes
Photo

#SaiPallavi #ALVijay సాయి పల్లవి డేటింగ్ పై స్పందించిన విజయ్ కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ , సాయి పల్లవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలను కొట్టిపారేశారు విజయ్. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘ఫిదా’ బ్యూటీ కోసం పాత పాత్రలు గతంలో సాయి పల్లవి నటించిన ‘దియా’ సినిమాకు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ‘కణం’ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పల్లవి, విజయ్ ప్రేమించుకున్నట్లు కథనాలు వెలుబడ్డాయి. ప్రస్తుతం తన ఫోకస్ అంతా జయలలిత బయోపిక్ ఫై పెట్టాడు ఈ దర్శకుడు. తలైవి అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించనుండగా సముద్రఖని , సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
0 notes
Photo

#Chitralahari #SaiDharamTej #JrNTR 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరో తెలుసా..? మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చిత్రలహరి'. ఈ చిత్రంలో సుప్రీమ్ హీరో సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుండగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'సైరా' లో స్టైలిష్ స్టార్ ? తాజాగా ఈ చిత్రం ఏప్రిల్12 న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్స్ , ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా ఈ చిత్ర ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడని సమాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగారాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కొంతకాలంగా హిట్స్ లేక బాధపడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.అతి త్వరలోనే ఈ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.
0 notes
Text
వైఎస్ జగన్ హామీ పై సర్వత్రా హర్షం
#YSRCP #YCP #YSJagan వైఎస్ జగన్ హామీ పై సర్వత్రా హర్షం
‘బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. భారతదేశ కల్చర్’ అని అభివర్ణించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి .. బీసీల అభివృద్ధికి ప్రతిఏటా రూ.15వేల కోట్ల చొప్పున..ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి సంచలనం సృష్టించారు.
ఏపీ పాలిటిక్స్ :1100 మంది వైసీపీలో చేరిక
మాట తప్పని జగన్ అధికారంలోకి వస్తే.. తమ ఆశలు నెరవేరుతాయని బీసీల��� అభిప్రాయపడుతున్నారు. బీసీల్లో ఆర్థిక విప్లవం జగన్‌తోనే సాధ్యం…
View On WordPress
0 notes