filmyedition-blog
filmyedition-blog
Untitled
18 posts
Don't wanna be here? Send us removal request.
filmyedition-blog · 5 years ago
Text
నాగశౌర్య #NS20 ఫస్ట్ లుక్... చూస్తే షాక్ అవ్వాల్సిందే
Tumblr media
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య టాలెంట్ గురించి అందరికీ తెలిసింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో పక్కింటి కుర్రాడిలా కనిపించి అందర్నీ మెప్పించాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు, ఎమోషన్, కంటెంట్ ఉండే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్యుతానంద, ఛలో వంటి మంచి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఓ రేంజ్‌లో ఉన్నాడు. కండలు తిరిగిన దేహం, బ్యాక్ సైడ్ లుక్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. #NS20 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. అందులో 6 ప్యాక్ తో చొక్కా విప్పి విల్లు ఎక్కుపెట్టి చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు శౌర్య. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ముందే చెప్పిన, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో నాగశౌర్య 'ఆర్చర్' గా కనిపించనునట్లు అర్ధమవుతుంది. అయితే ఇటీవల నాగ శౌర్య కాలు ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే.  సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డాడు. అయినా ఏమాత్రం పట్టు వదలక  సినిమా మీదున్న డెడికేషన్ తో ఇలా సిక్స్ ప్యాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉంది.   Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోన్న వయ్యారి...
Tumblr media
వివాదాలతో సహజీవనం అమలాపాల్ కి కొత్తేమీ కాదు. తన ఎంపికలే డిఫరెంట్. దానికి తగ్గట్టే వెండితెరపై ఆరబోతకు సైతం ఏమాత్రం భయపడని తత్వం తనది. లైఫ్ లో థ్రిల్లింగ్ సక్సెస్ కోసం పాల్ ఎత్తుగడలు ఇతర నాయికలతో పోలిస్తే ఎంతో విభిన్నం. ఏదైతేనేం.. లైఫ్ జర్నీలో కెరీర్ జర్నీలో అమలాపాల్ సాహసాలకు యూత్ మనసు పారేసుకున్నారు. ఆమె లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ ని ఎంచుకుని శహభాష్ అనిపించింది. ఏమాత్రం బెరుకు లేకుండా నగ్నంగా నటించిన డేరింగ్ గాళ్ గా పాల్ పేరు మార్మోగింది. అటుపై ఉత్తరాదికి చెందిన ఓ గాయకుడిని పెళ్లాడేసింది అంటూ వచ్చిన వార్తలతో మరోసారి అమలాపాల్ పేరు మార్మోగింది. అది కేవలం ఫోటోషూట్ మాత్రమేనని తర్వాత తెలిసింది. ఏదో ఒక జిమ్మిక్ తో పాపులారిటీ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటోంది పాల్. ఇటీవల ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోంది. రకరకాల కాన్సెప్ట్స్ తో వైల్డ్ గా కనిపిస్తోంది అమలా. డ్రీమింగ్ బిగ్ అండ్ వైల్డ్.. ఏ ఫోటో స్టోరి చాప్టర్ 4 అంటూ ఇంతకుముందు అగ్గిరాజేసే ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. అలాగే కాన్పెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ని తాజాగా రివీల్ చేస్తోంది. ఇందులో లేటెస్ట్ బోల్డ్ ఫోటో యువతర��లో వైరల్ గా మారింది. బ్లాక్ ఇన్నర్ .. షిమ్మరీ నైలాన్ గౌన్ లో అమలా అందాలు వేడెక్కిచేస్తున్నాయ్. తెలుగులో లస్ట్ స్టోరీస్ రీమేక్ సిరీస్ లో నటిస్తోంది. అధో అంధ పరవై పోలా-కాడవెర్ అనే రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేస్తున్న శృతి హాసన్
Tumblr media
కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో టెక్నికల్ యూనిట్ తో కలిసి పనిచేసిన శృతి ఆ తరువాత హీరోయిన్ గా ప్రమోట్ అయ్యింది. టెక్నిషియన్ గా రాణిస్తూనే హీరోయిన్ గా మెప్పించింది. తమిళంతో పాటుగా తెలుగులో అనేక సినిమాలు చేసింది శృతి హాసన్. అయితే, వరసగా సినిమాలు చేస్తున్న సమయంలో సడెన్ గా బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరమైనా శృతి హాసన్ తిరిగి మాస్ మహారాజా రవితేజ సినిమా క్రాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కాగా శృతి నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా మ్యూజిక్ కంపోజర్ గా కూడా సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేయనుందట. ఇప్పటి వరకు శృతి యూకెలో అంతటా మ్యూజికల్ ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తన మ్యూజిక్ టూర్లను ఇండియన్స్ మిస్ అయ్యారు.ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. "నేను సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడాను. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నా" అని తెలిపింది. ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. "ఈ ఛానల్లో ఇకపై నా సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్ తో పాటు నా ప్రదర్శనలు.. మ్యూజికల్ టూర్ల అన్నీ వీడియోలు అందులోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది శృతి. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
నితిన్ పెళ్ళికి వెళ్లొద్దు.. పవన్ కు ఫ్యాన్స్ రిక్వస్ట్.
Tumblr media
యూత్ స్టార్ నితిన్ తన ప్రేయసి షాలిని కందుకూరిని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 26న హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్లో ఈ జంట వివాహం కుటుంబ సభ్యులు.. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా జరగనుంది. తొలుత సిటీ ఔట్ స్కర్ట్స్ లోని ఓ ఫామ్ హౌస్ లో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారమైనా వెన్యూ ఫలక్ నుమా ప్యాలెస్ కి షిఫ్టయ్యిందని తాజా కథనాలు స్పష్ఠతనిస్తున్నాయి. ఈ పెళ్లి వేడుకకు ముఖ్య అతిథుల జాబితాల్ని ఇదివరకూ వెళ్లడించాం. నితిన్ ఫేవరెట్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. పవన్ తో పాటే త్రివిక్రమ్ కూడా ఆశీస్సులు అందించేందుకు విచ్చేస్తున్నారని ఆ ఇద్దరినీ నితిన్ పెళ్లికి ఆహ్వానించారని ప్రచారమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఐటీ మంత్రి కేటీఆర్ లను నితిన్ ఆహ్వానించారని తెలుస్తోంది. అయితే పవర్ స్టార్ ఈ పెళ్లికి వెళ్లడం ఫ్యాన్స్ కి ఇష్ఠం లేదట. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని అసలే వైరస్ మహహ్మారీ ఒణికించేస్తోంది. రోజుకు వందలాది పాజిటివ్ కేసులు నమోదవుతూ హడలెత్తిస్తున్నాయి. ఇలాంటప్పుడు పెళ్లి వేడుకలు.. విందు అంటే అది ప్రమాదకరం. తమ ఫేవరెట్ కి ఎలాంటి ముప్పు ఉంటుందోననే భయాందోళనలో ఫ్యాన్స్ ఉన్నారట. అందుక��� ఈ పెళ్లికి వెళ్లకపోతేనే బెటర్ అని ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని అంటూ కొందరు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఒకవేళ పెళ్లికి వెళితే నితిన్ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచిస్తున్నారు మరికొందరు. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
వర్కౌట్ పిక్స్ తో హీట్ పెంచుతున్న ఆంటీ
Tumblr media
హీరోయిన్స్ మాత్రమే కాదు.. సీనీయర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. హీరోయిన్స్ తో పోలిస్తే మేము కూడా ఏం తక్కువ కాదు అంటున్నారు. ఇప్పటికే సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇక హీరోయిన్ల తల్లి పాత్రలు చేసే ప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు నటించే సినిమాల్లోని ఆన్ సెట్స్ ఫోటోలతో పాటు.. పర్సనల్ ఫొటోస్ ను కూడా షేర్ చెయ్యడం చేస్తుంటారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఈ మధ్య ఫొటోలతో డ్యాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సినిమాల్లో పద్దతిగా కనిపించే ఈమెలో ఇంత హాట్ నెస్ ఉందా..? అనేలా ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా మరో సారి ప్రగతి తన వర్కౌట్ ఫొటోలను షేర్ చేసింది. ఈసారి మరింత ఎక్కువగా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. చెమటలు కార్చి మరీ వర్కౌట్స్ చేసింది. ఈ ఫొటోస్ కి గోల్ ని ఏ మాత్రం తగ్గించవద్దని అంటూ.. ప్రయత్నాన్ని మరింత పెంచాలని కొటేషన్ ఇచ్చి ఓ వర్గం వారికి మంచి సందేశం ఇచ్చారు. ఇక ఆమె వర్కౌట్స్ చేస్తూ ఇచ్చిన స్టీల్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి... Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
ఈ సారి మరింత హాట్ గా 'థ్రిల్లర్' స్టిల్స్ ను పోస్ట్ చేసిన వర్మ...
Tumblr media
రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను రూపొందించేసిన విషయం తెలిసిందే . ఆపై పవర్ స్టార్ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌తో సోషల్ మీడియానూ షేక్ చేస్తున్నాడు వర్మ . ఇక ఈ గ్యాప్ లో అప్సర రాణి అనే హాట్ బ్యూటీ తో థ్రిల్లర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ అమ్మడి హాట్ ఫొటోస్ ను షేర్ చేసిన వర్మ. తాజాగా మరికొన్ని ఫోటోలను రిలీజ్ చేసాడు. 'ఒడిషాలోని మరో టాలెంట్ నటుడిని కనిపెట్టానని, అప్సరకు జోడిగా రాక్ కచ్చి అనే అతడిని ఫిక్స్ చేశానని' తెలిపాడు వర్మ. ఇక హీరో హీరోయిన్ రొమాన్స్ లో మునిగి తేలుతున్న స్టిల్స్ ను పోస్ట్ చేసాడు వర్మ. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
కరోనాకు హాట్ హీరోయిన్ చిట్కా
Tumblr media
కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో విలయతాండవం చేస్తున్నది. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు పౌష్టికాహారం తీసుకోవడం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్, యోగ ట్రైనర్, మలైకా అరోరా కరోనా నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు చెప్పింది. మలైకా అరోరా అనగానే అందరికి ఆమె వేసే యోగాసనాలు గుర్తుకు వస్తాయి. వై యోగాసనాలు వేసి వాటిద్వారా కరోనా తగ్గించుకోమంటే ఎలా అని షాక్ అవ్వకండి. మేలైన చెప్తున్నా కరోనా టిప్స్ యోగ గురించి కాదు. ఆహరం గురించే. పసుపు, ఆపిల్, అల్లం, వెనిగర్, పెప్పర్ ను ఉపయోగించి కాషాయం తయారు చేసుకొని సేవిస్తే కరోనా నుంచి బయటపడొచ్చని చెప్తున్నది. కాషాయం అనగానే చేదుగా ఉండే మందు గుర్తుకు వస్తుంది. రోగాన్ని తగ్గించేది చేదు స్వభావం ఉన్న మందులే. కాబట్టి మలైకా చెప్పినట్టుగా ఒకేసారి ట్రై చేసి చూడండి. గుణం కనిపిస్తే ఫాలో చేయండి. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
హీరోయిన్ ని ముద్దులతో నలిపేసిన సెన్సేషనల్ డైరెక్టర్
Tumblr media
కరోనా సీజన్‌లో సినిమాల మీద సినిమాలు చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ప్రాజెక్టు ‘థ్రిల్లర్’ సినిమా చేపట్టాడు. ఈ సినిమాకు మరో బ్యూటిఫుల్ హీరోయిన్‌ అప్సర రాణి ని ఎంపిక చేశాడు వర్మ. తన కొత్త సినిమా హీరోయిన్‌ను చాలా ��ాట్‌గా పరిచయం చేశాడు. నిజానికి అప్సర రాణి తెలుగులో 'ఉల్లాల ఉల్లాల', '4 లెటర్స్' అనే సినిమాల్లో నటించింది గాని ఆ సినిమాలు ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు వర్మ దృష్టిలో పడి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వర్మ కూడా గ్యాప్ ఇవ్వకుండా అమ్మడి ఫొటోస్ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో వర్మ ఆమెతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మ ఈ ఫొటోలో ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ పెట్టేసేసాడు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
మీ సింగింగ్ టాలెంట్ ను పరిచయం చేయడానికి సరైన వేదిక “స్టార్ ఆఫ్ ది ఇయర్”
Tumblr media
సంగీతానికి రాళ్ళు సైతం కరుగుతాయని అంటారు... సంగీతానికి అంత శక్తి ఉంది. అందమైన గాత్రం ఎలాంటి పాటకైనా వన్నె తెస్తుంది. మనలోనూ ఎంతో మంది అద్భుతమైన సింగర్లు ఉన్నారు, తమలో ఉన్న అద్భుతమైన టాలెంట్ ను బయట పెట్టుకోవడానికి సరైన  అవకాశం కోసం ఎదుచూస్తుంటారు. అలాంటి వారికోసం "స్టార్ ఆఫ్ ది ఇయర్" అనే బిగ్ సింగింగ్ టాలెంట్ హంట్ ఈవెంట్ ప్రారంభం అయ్యింది. ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ జరగనున్నాయి. తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టాలనుకున్నవారు www.staroftheyear.in/ అనే వెబ్ సైట్ ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిగ్ సింగింగ్ టాలెంట్ హంట్ ఈవెంట్ పోస్టర్ ను "నువ్విలా", "కార్తికేయ", "సినిమా చూపిస్తా మావా", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "సుబ్రహ్మణ్యపురం", "118" ఇలా చెప్పుకుంటుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు "శేఖర్ చంద్ర" లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగింగ్ టాలెంట్ ను నిరూపించుకోవడానికి "స్టార్ ఆఫ్ ది ఇయర్" మంచి ఫ్లాట్ ఫామ్ అని, ప్రతి ఒక్కరు తమలో ఉన్న సింగింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చెయ్యాలని అన్నారు. అంతే కాకుండా అందమైన గాత్రం మీసొంతమైతే తన సినిమాలో అవకాశం కూడా కల్పిస్తానని శేఖర్ చంద్ర అన్నారు. సింగింగ్ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సరైన ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్న స్టార్ ఆఫ్ ది ఇయర్ టీమ్ కు ఆయన అభినందనలు తెలిపారు.   Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
అందాలతో మతులు పోగుడుతున్న సోనమ్ కపూర్
Tumblr media
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సోనమ్ కపూర్ అంటే ఓ ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడు చూసినా తాజాగా అప్పుడే సముద్ర తీరంలో దొరికిన ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. నిజానికి సోనమ్ మేనిఛాయ కూడా మెరుపులాగే ఉంటుందనుకోండి. ఈ బ్యూటీ ఎల్లప్పుడూ తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉంటుంది. అమ్మడి ఫోటోషూట్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఉత్త‌రాదిన ఎంత‌మంది ముద్దుగుమ్మలైనా ఉండొచ్చు కానీ క‌చ్చితంగా వాళ్లలో సోన‌మ్ క‌పూర్ మాత్రం వేరు. ఈమె స్టైల్ కు ఐకాన్ కాదు.. కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తుంది. పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ అదే దూకుడు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు మ‌రోసారి సోన‌మ్ అందాల ఆర‌బోత హైలైట్ అయింది. తాజాగా సోషల్ మీడియాలో సోనమ్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూసాక కుర్రాళ్ళ నోట మాటరాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎద అందాలను ఎరగావేస్తూ సోనమ్ ఇచ్చిన ఫోజ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు . మీరు ఆ ఫోటో పై ఓ లుక్కెయ్యండి. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
ఆ హీరోయిన్ నాకు హ్యాండ్ ఇచ్చింది : మెగా హీరో
Tumblr media
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ‘సూపర్ మచ్చి’. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. గ్యాప్ లేకుండా కళ్యాణ్ దేవ్ షూటింగ్ లో పాల్గొంటునాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .. " ఈ సినిమాలో బార్ లో పని చేసే సింగర్ గా నటిస్తున్నాను. ఇంకా ఒక సాంగ్ రెండు రోజుల టాకీపార్టు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని అన్నారు. ఈ కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ లో పాల్గొనడానికి మా సినిమా నిర్మాతలు ముఖ్య కారణం. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించాను. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక షూటింగ్ లో పాల్గొనడం గురించి మామయ్య చిరంజీవితో మాట్లాడాను. 'ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. నీకు ఓకే అనుకుంటే షూటింగ్ కి వెళ్లు' అని అన్నారు. అలాగే ��యే జాగ్రత్తలు తీసుకోవాలో మామయ్య చెప్పారు'' అని చెప్పారు. అంతే కాకుండా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లానని, ఇంట్లోనే ఓ గదిలో ఉంటూ తనపనులు తానే చేసుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు . తమ మొదటి కూతురు బర్త్ డేకి ఇంట్లోనే ఉంటూ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ .. ఈ సినిమాలో మొదట రియా చక్రవర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు.. కొన్ని రోజులు షూటింగ్ చేశాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సినిమా ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయిందట.. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకుని రీషూట్ చేసినట్టు కళ్యాణ్ తెలిపారు. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
ఈ సొగసరి సోయగాలకు కుర్రకారు ఫిదా...
Tumblr media
బాలీవుడ్ సినిమా స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2 నటి అనన్య పాండే హాట్ అందాలు.. అదరహో అనిపించేలా ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ మరిన్ని సినిమాలతో దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు తనుగా సెపెరేట్ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ లేత అందాల భామ.. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది . ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన అనన్య పాండే.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అనన్యకి మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడి పోస్టుల కోసం ఫ్యాన్స్ ఎగబడి ఎదురు చూస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలో అమ్మడు అలా సోయగాల పాన్పు పై సున్నితంగా వాలి పోజిచ్చింది.ఈ ఫోటో పై కుర్రకారు లైకుల వర్షం కురిపిస్తున్నారు. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు : "నగ్నం" హీరోయిన్
Tumblr media
ఇటీవల 'నగ్నం' అనే షార్ట్ ఫిల్మ్ తో సంచలనం సృష్టించాడు రామ్ గోపాల్ వర్మ . ఈ సినిమాను తన ఆర్జీవీ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు వర్మ .  నగ్నం సినిమా ఎలా ఉందన్న మాట పక్కనపెడితే.. ఆ సినిమాలోని ‘నగ్న’ సుందరి స్వీటీ.. అలియాస్ వెస్ట్ గోదావరి శ్రీ రాపాక ఇంటర్వ్యూలు మాత్రం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి..  తాజాగా ఈ భామ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది . చాలా మంది పెళ్లికి ముందు సెక్స్ కరెక్ట్ కాదంటారు. కాని తన ఉద్దేశ్యంలో పెళ్లికి ముందు సెక్స్ తప్పనిసరి అని అంటుంది ఈ బోల్డ్ బ్యూటీ.  దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పింది .  డాక్టర్ చదివిన తన ఫ్రెండ్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చూసుకుందట. పెళ్లి తర్వాత మొదటి రాత్రి రోజు అతడు 'గే' అని తెలిసిందంట . కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఒక డాక్టర్ విషయంలోనే ఇలా జరిగితే ఇది సామాన్యుల పరిస్థితి ఏంటి అని స్వీటీ ప్రశ్నిస్తుంది. అందుకే పెళ్ళికి ముందే సెక్స్ తో సహా అని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పుకొచ్చింది ఈ బోల్డ్ భామ. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
భయపెడుతున్న వర్మ "12 ఓ క్లాక్"
Tumblr media
కరోనా కారణంగా ప్రపంచమంతా ఆగిపోయినా వర్మ మాత్రం ఆగడం లేదు . కరోనా కాలం లో వరుసగా సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల శృంగార తార మియా మాల్కోవా తో 'క్లైమాక్స్' , ఆ తర్వాత 'నగ్నం' సినిమాలను తెరకెక్కించాడు. ఇక ప్రణయ్ హత్య ఘటన పై 'మర్డర్' అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు వర్మ. వాటిని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌న ఆర్జీవీ వ‌ర‌ల్డ్ యాప్‌లో ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తున్నాడు . ఇదిలా ఉండగానే 12 ఓ క్లాక్ అనే హారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ కొద్దిసేపటిక్రితమే ఈ సినిమా కు సంబందించిన టీజర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. చాలా రోజులతర్వాత వర్మ హారర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. వర్మ గతంలో 'రాత్రి ', 'భూత్' వంటి హారర్ చిత్రాలను తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా తెర‌కెక్కుతున్న ఈ '12 ఓ క్లాక్‌' మూవీని కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తుండ‌గా, ఎంఎం కీర‌వాణి మ్యూజిక్‌ను అందిస్తున్నారు. భయపెడుతున్న ఈ టీజర్ పై మీరు ఓ లుకేయ్యండి... Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
నేను 'కమిట్మెంట్' కు రెడీ...
Tumblr media
నేడు బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ తేజస్వి మదివాడ పుట్టిన రోజు. 1991 సంవత్సరంలో జన్మించిన ఈ బ్యూటీ నేటితో 29వ ఏటలో కి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తేజస్వికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె లేటెస్ట్ మూవీ 'కమిట్మెంట్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ‘క‌మిట్‌మెంట్‌’ వెబ్ అంథాల‌జీ సిరీస్‌లోని న‌లుగురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ విడుద‌ల చేసిన స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. న‌లుగురి క‌థ‌గా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో తేజ‌స్వి మ‌దివాడ, ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. “ల‌వ్‌.. డ్రీమ్‌.. హోప్‌.. ఫైట్” అనేది ట్యాగ్‌లైన్‌.ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
"ఎన్టీఆర్" డ్యాన్స్ ను దించేసిన "జపనీస్" జంట
Tumblr media
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సమీరారెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అశోక్‌’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 2006లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అశోక్ సినిమాలోని గోల గోల అనే మాస్ డ్యూయెట్ కి జపాన్ జంట డ్యాన్స్ ఇరగదీసింది.మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటకు ఎన్టీఆర్, సమీరారెడ్డి చేసిన డ్యాన్స్ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.తాజాగా ఈ పాటకు ఓ జపనీస్ క‌పుల్ డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట తెగ హ‌ల్ చల్ చేస్తోంది‌. కాస్టూమ్స్ తో సహా ఎన్టీఆర్, సమీరల డ్యాన్స్ స్టెప్పులను అచ్చుగుద్దినట్టు దింపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read the full article
0 notes
filmyedition-blog · 5 years ago
Text
నిహారిక పెళ్లి పై నాగబాబు కామెంట్.. ఇలా అనేశాడేంటి!!
Tumblr media
టాలీవుడ్ లో పెళ్లి సంద‌డి న‌డుస్తూనే ఉంది. నిఖిల్ ఇటీవ‌లే పెళ్లి చేసుకోగా, త్వ‌ర‌లో నితిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక భల్లాల దేవా రానా కూడా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్న విషయం తెలిసిందే .  మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఓ ఎంఎన్సీ కంపెనీలో టాప్ పొజిష‌న్ లో ఉన్న ఏపీ పోలీస్ అధికారి కొడుకుతో పెద్ద‌లు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఆగ‌స్టులో ఎంగెజ్మెంట్, వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి అనుకుంటున్నారు . తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి నాగబాబు ఆసక్తికరంగా స్పందించారు. మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు?'' అని యాంకర్ వేసిన ప్రశ్న అడగగా త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని ఆయన చెప్పడం గమనార్హం. అయితే కరోనా కారణంగా అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. Read the full article
0 notes