Tumgik
#ఆరోగ్యచిట్కాలు
gamyam · 2 months
Video
youtube
ఇయర్ బడ్స్ తో ప్రమాదం #హోమియో మందులు #ఆరోగ్యచిట్కాలు #మునగాకు చేసే మేలు ...
0 notes
batukamma · 4 years
Text
Chicken VS Egg : చికెన్ VS గుడ్డు- ఏది ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది?
Tumblr media
Chicken VS Egg : మాంసం, గుడ్లు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు, సోయా మరియు చేపలు వంటి ఆహారాల నుండి ప్రోటీన్ పుష్కలంగా వస్తుంది. ప్రోటీన్ అనేది శరీర కణాలు, కండరాలు, చర్మం, కణజాలం మరియు అవయవాలకు బిల్డింగ్ బ్లాక్‌లుగా పనిచేస్తుంది. చికెన్ మరియు గుడ్డు రెండూ అధిక మొత్తంలో ప్రోటీన్‌తో కలిగినప్పటికీ ప్రోటీన్ యొక్క మంచి మూలం ఏది? 100 గ్రా చికెన్ యొక్క పోషక విలువలు: • ప్రోటీన్: 27 గ్రా • కొవ్వులు: 4 గ్రా • కేలరీలు: 153 • సోడియం: 51 మి.గ్రా • కొలెస్ట్రాల్: 75 మి.గ్రా 100 గ్రా గుడ్ల పోషక విలువలు: • ప్రోటీన్: 13 గ్రా • కొవ్వులు: 11 గ్రా • కేలరీలు: 155 • సోడియం: 124 ఎంజి • కొలెస్ట్రాల్: 373 మి.గ్రా కోడి మరియు గుడ్లు రెండూ తక్కువ కేలరీలు మరియు అధిక ప్రోటీన్ ఎంపిక. కాని చికెన్, గుడ్డు కంటే రెట్టింపు ప్రోటీన్ కలిగి ఉంటుంది, గుడ్లతో పోల్చితే చికెన్‌లో తక్కువ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికగా మారుతుంది. కాని గుడ్లు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 1. గుడ్లలో రిబోఫ్లేవిన్ లేదా విటమిన్ బి 2 పుష్కలంగా ఉంటాయి, ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది 2. గుడ్డులోని తెల్లసొన విటమిన్ డి, బి 6, బి 12 మరియు జింక్, ఇనుము మరియు రాగి వంటి ఖనిజాల యొక్క గొప్ప మూలం, ఇవన్నీ శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరం. కోడి మరియు గుడ్లు రెండూ దాదాపు సమానంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సరైన ఆరోగ్యానికి కీలకం మితంగా తినడం. ముహమ్మద్ అజ్గర్ అలీ. Pawan Kalyan : పవన్ బర్త్ డే ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురి మృతి Amazon : ఆర్డర్ చేస్తే 30 నిమిషాల్లోనే డెలివరీ.. అమెజాన్ అదుర్స్ High-Fiber Foods : రెగ్యులర్ గా ఇవి తింటే… ఆరోగ్యం మీ వెంటే Read the full article
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
Khader Vali Important Suggestions for Siridhanya Food Beginners
Tumblr media
Khader Vali Important Suggestions for Siridhanya Food Beginners కొత్తగా సిరిధాన్యాల ఆహరం తీసుకొనేవారికి ఖాదర్ వలి గారి సూచనలు
Read the full article
0 notes
gamyam · 6 months
Video
youtube
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే #ఆరోగ్యచిట్కాలు #cooldrinks #health #ques...
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
అపారమైన ఔషదం కలబంద - 9 Amazing Health Benefits of Aloe Vera
Tumblr media
అపారమైన ఔషధ గుణాలతో నిండి ఉన్న కలబంద (Aloe Vera)లో ఎ,బి,సి,డి,ఇ వంటి అత్యంత కీలకమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల ఒకటని చెప్పలేం. అందానికి,ఆరోగ్యానికి కలబంద ప్రధమ స్తానంలో ఉంటుంది. Health Benefits of Aloe Vera శరీరంలోని కొవ్వును,అలానే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు కలబందలో ఉన్న లిపాసెస్‌ ఎంజైము పనిచేస్తుంది. ప్రొటెనెస్‌ అనే మరో ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బ్రాడికీనెస్‌ అనే ఇంకొక ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో పాటు చర్మాన్ని మృధువుగా మారుస్తుంది. కలబందలో జీర్ణశక్తికి కావలసిన లవణాలు, ఎలిమెంట్లు కూడా కావలసినంతగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ చక్కబడుతుంది. అలానే శరీరంలోని వ్యర్థ విషపదార్థాలు సక్రమంగా విసర్జించబడతాయి. కలబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఈ సలిసైలిక్‌ యాసిడ్‌ వలన చర్మ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను,నాశనం చేయడంలో కలబంద ఎంతగానో సహకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలోనే దొరుకుతాయట.దీని ద్వారా ఎసిడిటిసమస్యలు, దీర్ఘకాలిక మలబ్ధకం, కూడా సులువుగా తగ్గించుకోవచ్చు. కలబందలో 12 రకాల క్రిమినాసికాలు ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలు,అలానే కడుపులో నొప్పులను నివారిస్తుంది. లివర్‌ సమస్యలు, గాస్ , మధుమేహం, రక్తహీనత, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, ఇలా అనేక సమస్యలకు కలబంద ఒక సరైన పరిష్కారం. తప్పక చదవండి : జామకాయ జామ ఆకులతో లాభాలెన్నో తెలుసా? Health Benefits of Guava Leaves మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి Read the full article
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
రోజూ 4 కరివేపాకు ఆకులు తినడం వల్ల కలుగు అద్భుతమైన లాభాలు
Tumblr media
మనం వండుకునే ఆహారపదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వటంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలైన ఔషధగుణాలున్నాయి. కానీ చాలా మంది కూరలో వేసిన కరివేపాకును తినడానికి ఇష్టపడరు. కానీ ఈ కరివేపాకును తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. కరివేపాకు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ కరివేపాకు ఆకులను తినటం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం (curry leaves uses health benefits) కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు రోజూ నాలుగు ఆకులు నమిలి మింగటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని బాడ్ కొలెస్ట్రాల్ తగ్గించటంతోపాటు శరీర బరువుని తగ్గించడంలో ఎక్కువగా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అంతేకాకుండా కరివేపాకు నమిలి మింగడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తప్పక చదవండి : ఆకుకూరలను రక్షిత ఆహార పదార్థాలు అని ఎందుకు అంటారో తెలుసా? కరివేపాకులో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల కర్వేపాకు నిత్యం తినటం వల్ల కళ్లకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కంటి చూపు మెరుగు పరచడంతో పాటు రేచీకటి సమస్యలను దూరం చేస్తుంది. వెంట్రుకలు రాలడం పలచబడడం చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలను దూరం చేసి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కరివేపాకు సహాయపడుతుంది. అందువల్ల కరివేపాకుని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. తప్పక చదవండి : జీడిపప్పు, బాదాం పప్పు కిస్మిస్ ఏం సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి Read the full article
0 notes