#machiningtechnique
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 year ago
Text
youtube
ప్రతీ పురాతన ఆలయంలో ఈ రహస్య భాగం ఉంటుందా?🤔మకర ప్రణాలయ!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైనదాన్ని చూపించబోతున్నాను, దాని పేరే మకర ప్రణాలయా అని అంటారు. Okay guys, నేను archeologyలో చాలా అరుదైనదాన్ని కనిపెట్టాను సరేనా? So, మీలో ఎవరికైనా, ఇది ఏంటో తెలుసా లేదా అని నాకు తెలియదు, కానీ నిశితంగా పరిశీలించండి. ఇది ఒక వింత జంతువులా కనిపిస్తుంది కదా. ఈ 2 pieceలు ఒకటే. నిజానికి ఇవి, 1200 సంవత్సరాల కంటే చాలా పాతవి. ఇవి ఇక్కడ ఇండోనేషియాలో ఉన్నాయి, ఇది భారతదేశం కూడా కాదు, కానీ ఇవి చాలా అరుదైన వస్తువులు, ఇవి చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. సరేనా? వాటిలో చాలా వరకు విరిగిపోయాయి. ఒకవేళ వారు పని చేసుంటే, అవి ఈ పెద్ద ఆలయాలలో భాగమవుతాయి, కాబట్టి మీరు ఈ మొత్తం చూడడానికి మార్గం లేదు. ఇప్పుడు, దీనిని "మకర ప్రాణాలయ" అని పిలుస్తారు, ఇది చాలా అరుదు, ఎందుకంటే మకర ప్రాణాలయాలు మనలో ఎవరికీ పూర్తిగా కనిపించవు, సరేనా? మీరు వాటిని ఎప్పటికీ గుర్తించలేరు, కానీ, మీరు పురాతన ఆలయాలను చూస్తే...అక్కడ వాటిని స్థిరంగా ఉంచడాన్ని మీరు చూసినప్పుడు, అవి ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను, సరేనా.
So, దీన్ని మీరు చూడవచ్చు, ఇదే మకర ప్రాణాలయా, ఇది ఇప్పటికీ ఈ ఆలయంలో చెక్కుచెదరకుండా ఉంది చూడండి, ఇది చాలా పాతది. ఇది ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ దేవాలయం.ఈ మకర ప్రాణాలయ, సుమారు 1200 సంవత్సరాల నాటిది. So, ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. కనుక ఇది 21వ శతాబ్దము, అంటే 1200 సంవత్సరాల నాటిది, అయితే ఈ మకర ప్రాణాలయ ఇప్పటికీ చెక్కుచెదరలేదు చూడండి. ఇప్పుడు, ఈ ఆలయ గోపురంలో చూడండి, ఇంత చిన్న ప్రాంతంలో, మీరు ఒకే వరుసలో, ఈ మూడు మకర ప్రాణాలయాలను చూడవచ్చు. ఇది ప్రంబనన్ దేవాలయం యొక్క, పుణ్యక్షేత్రాలలో, ఒక వైపున మాత్రమే ఉంది. అంటే, ఆలయ సముదాయం అంతటా, ఎన్ని మకర ప్రాణాలయాలు ఉండేవో మీరు ఊహించవచ్చు. ఇక్కడ మీరు చూస్తే, డ్రాగన్ లేదా మొసలి వంటి వింత జంతువును మీరు చూడవచ్చు. దీనిని సంస్కృతంలో మకర అంటారు. ఈ జంతువును సంస్కృతంలో మకర అని పిలుస్తారు మరియు ఈ మొత్తం భాగాన్ని మకర ప్రాణాలయ అని పిలుస్తారు. So, మకర అంటే ఈ జంతువు అని అర్ధం, కానీ ప్రాణాలయ అంటే ఏమిటి?
ప్రణాలయ అంటే జలమార్గం అని అర్థం. ప్రాణ అంటే శ్వాస మరియు అలయ అంటే కొన్నిసార్లు ఇల్లు లేదా శ్వాస యొక్క స్థానం అని అర్ధం వస్తుంది. ఇంచుమించు, మకర యొక్క గాలి పైపు అని అర్థం. ఇప్పుడు, వాటిని దేవాలయాల్లో భాగంగా చూసినప్పుడు, అవి కేవలం చిన్న చిన్న ముక్కలే అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాటిని ఇక్కడి వరకు మాత్రమే చూడగలరు. కానీ ఇక్కడ, ఇది చాలా అద్భుతమైనది ఎందుకంటే, అవి ఎంత పెద్దవో మీరే చూడవచ్చు, సరేనా? ఇవి దాదాపు 3 అడుగుల లోతులో ఉన్నాయి, అలానే వారు ఆలయం లోపల, రెండున్నర అడుగుల కంటే ఎక్కువ వరకు ప్రతిష్టించారు. So, అన్ని పురాతన దేవాలయాలు, దీనినే కలిగి ఉంటాయి - వివిధ అంశాలలో ఇవి స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు, వారి యొక్క ప్రయోజనం ఏంటీ?
Praveen Mohan Telugu
2 notes · View notes
jacobdorpfeld · 7 years ago
Video
instagram
This is a good way to sand small pieces that I learned from machining and jewelry classes. All it is is a full sheet of sand paper attached with spray adhesive to a flat surface like the MDF here (a inspection block or table is even better). Moving a small piece over the flat surface make it much easier to keep things square and true and it’s easier to manipulate. #woodworking #finewoodworking #sanding #machiningtechniques #woodworkingtips #handsanding https://www.instagram.com/p/Bqsr0ZSgKZG/?utm_source=ig_tumblr_share&igshid=4nx75b0gfp0m
0 notes
praveenmohantelugu · 2 years ago
Video
youtube
వినాయకుని పక్కన ఇలాంటి శిల్పాలను ఎందుకు చెక్కారు? దాని అవసరం ఏంటి?
Hey guys, ఇక్కడ ఉన్న గణేష్ శిల్పం మీరు చూడవచ్చు. ఇది బేలూరు గుడిలో ఉన్న ఒక interesting అయిన శిల్పం. వినాయకుడు చాలా బలమైన దేవుడు, మనం ఎప్పుడూ చూసే విధంగానే, ఇక్కడ కూడా ఆయనికి, ఏనుగు ముఖం అలానే కుండా లాగ ఉన్న బొడ్డు ఉంది, కానీ అతను దేనిపైన నిలబడి ఉన్నారో చూడండి. అతను ఒక చిన్న ఎలుక పైన నిల్చున్నారు. అతని beltను చూడండి, అది ఏంటని మీకు తెలుస్తుందా? అది ఒక పాము. 
అతను ఒక చిన్న ఎలుక పైన నిల్చొని dance ఆడుతున్నారు. కానీ, ఇక్కడే చాలా interesting అయిన ఒక విషయం ఉంది. నేను నా వేళ్లను, దీని లోపల పెట్టగలుగుతున్నాను చూడండి. And ఈ side చూడండి, దీన్ని ఎవరో విరిచేసారు, దాదాపు దీన్ని పూర్తిగా విధ్వంసం చేసారని చెప్పాలి! ఇది ఎంత గోరం తెలుసా, ఎందుకంటే ఇది ఎంత బాగుందో చూడండి. మీరు ఇక్కడ touch చేస్తే ఇది చాలా smoothగా ఉంటుంది, దీని లోపల బాగా polish చేశారు. ఒకప్పుడు దీని లోపల రాయితో తయారు చేసిన ఒక ball ఉండుంటుంది, ఈ side కూడా అదేలాంటి ball ఉండేది.. ఇక్కడ మీరు, దీనిని బాగా చూడగలరని అనుకుంటున్నాను. 
రోజు ఈ ballను తిప్పుతూ ఉంటే, ఆ place చాలా roughగా damage అవుద్ది కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ballను తిప్పుతూ ఉండేవాళ్ళంట. కానీ దురదృష్టవశాత్తూ వాళ్ళు దానిని విరిచేసారు, ఒకవేళ ఆ ballను వాళ్ళు బయటకు తీయాలని  ప్రయత్నించుంటారు, అందుకే ఇది విరిగిపోయుంటది. గణేశుడు పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్రహ్మచారి అని, అతను జీవితమంతా ఒంటరిగానే ఉన్న దేవుడని మన అందరికి బాగానే తెలుసు. మీరు అతని పక్కనే ఉన్న, ఒక శృంగార శిల్పాన్ని చూడవచ్చు. 
ఇది నాకు నిజంగా చాలా interesting గా ఉంది. ఇక్కడ, ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకోవడం అలానే romance చేసుకోవడం మీరు చూడవచ్చు. ఆ తరువాత ఈ వైపు, ఆ శృంగారానికి ఫలితాన్ని చూడవచ్చు, అంటే ఈ శిల్పంలో ఈమెకు ఒక బిడ్డ జన్మించింది. ఇలా ఒక బ్రహ్మచారిగా ఉన్న దేవుడి పక్కనే, మనం ఇలాంటి శిల్పాలను చూస్తున్నాము. దీని యొక్క పూర్తి అ��్ధం ఏంటని, నాకు అర్ధం కాలేదు కానీ, ఇది నిజంగా చాలా interestingగా ఉంది. ఈ balls, విరిగిపోయిన ఈ వస్తువులు, ఒక బ్రహ్మచారి దేవుడు, శృంగార శిల్పాలు అలానే బిడ్డ జన్మించడం వీటన్నిటిని మీరు ఇక్కడ చూస్తున్నారు. 
బహుశా దీని నిజమైన రహస్యం ఇక్కడ ఉందేమో. ఇక్కడ మీరు దేన్నీ చూస్తున్నారో తెలుసా? ఒకవేళ మీ జీవిత అర్ధానికి ఒక కీలకం ఇందులో దాగి ఉండొచ్చు? ఈ వీడియో మీకు నంచిందని అనుకుంటున్నాను, నేను మీ ప్రవీణ్ మోహన్, వీడియో చూసినందుకు చాలా thanks, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, అలానే ప���రతీ ఒక update కోసం కింద ఉన్న bell buttonని click చేయండి ఈ వీడియోని like చేయండి and మీ friends కి share చేయండి, నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. Bye!
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 2 years ago
Video
youtube
చెన్నకేశవ ఆలయంలో గురుత్వాకర్షణ వ్యతిరేక స్తంభం దొరికింది? భారతదేశంలోని ప్రాచీన సాంకేతికతకు ఆధారం!
Hey guys, గత సంవత్సరం, సెప్టెంబర్ 17న, బేలూరులో ఉన్న ఈ పురాతన చెన్నకేశ్వర గుడిలో చాలా విచిత్రమైన ఒక విషయం జరిగింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో, ఈ స్థంభం పైనుండి ఒక చిన్న బాల్ లాంటి ఒక రాయి కింద పడింది. ఒకరు, ఇద్దరు మాత్రమే దీన్ని గమనించారు, ఇలాంటి ఒక సంఘటన జరిగిందని అక్కడున్న, చాలా మందికి తెలియదు. అలాంటి particular అయిన రోజున, ఆ సమయంలో, అంత ప్రత్యేకత ఏముంటుంది, ఆ సమయంలో ఏదో ఒక magic జరిగినట్టుగా, ఈ పురాతన స్థంభం నుంచి ఒక రాతి బంతి ఎందుకు పడింది?
అది జరిగిన కొన్ని నిమిషాల్లో, ఇక్కడ భూకంపం వచ్చిందని announce చేశారు, అది richter scaleపై 2.3 తీవ్రతతో తేలికపాటి భూకంపమే, కానీ ఎక్కడ కూడా, ఇలా విచిత్రంగా ఒక స్తంభం, అలా magicalగా రాతి బంతిని కింద పడేయదు, నిజానికి చెప్పాలంటే, భూకంపం వచ్చినప్పుడు, మొత్తం స్థంభమే కూలిపోయి కింద పడిపోతుంది. కానీ ఇక్కడ నిలబడి ఉన్న ఈ స్థంభం మాత్రం కింద పడలేదు, ఎందుకంటే, దీన్ని ఈ పెద్ద base లోపల గట్టిగా పాతిపెట్టారు కదా? కానీ మనం దీని పక్కకు వెళ్లి చూసినప్పుడే, ఒక పెద్ద shockఎహ్ ఉంది. 
అది ఏంటంటే, ఈ స్తంభాన్ని వాళ్ళు అస్సలు baseలో పాతిపెట్టలేదు, అంతెందుకు, అది ఈ baseకు attach చేసి కూడా లేదు చూడండి. ఈ స్తంభం, కింద లేదా పైన కానీ, ఎలాంటి support లేకుండా, ఈ స్థంభం ఇక్కడ నిలబడి ఉంది. ఇది పూర్తిగా, స్వేచ్ఛగా నిలబడి ఉన్న ఒక స్థంభం, వాళ్ళు దీనిని ఎలాంటి support లేకుండా, binding material లేకుండా, పునాది కూడా లేకుండా ఇక్కడ ఉంచారు, అలానే floorకి, ఈ స్తంభాన్ని attach చేయడానికి cement లేదా పాతకాలపు సున్నం కొంచెం కూడా లేదు. 
ఇది అసాధ్యం కదా, for example, ఒక పొడవైన pencilను tableపైన నిల్చోబెట్టామని అనుకుందాం. దాన్ని నిల్చోబెట్టడం చాలా కష్టం, కానీ ఏదో విధంగా నిల్చోబెట్టేసి, fan on చేసి, ఈ గుడిలో గాలి ఎలా వీస్తుందో ఆ విధంగా గాలి వీచేలా చేయండి. అది మాత్రమే కాకుండా, ఈ tableని కొంచెం కదిలించి చూడండి, అప్పుడు కూడా ఆ pencil అలానే నిలబడి ఉంటుందా? ఇది అస్సలు problemఎహ్ కాదు, దీనికంటే problem ఏంటంటే, ఈ స్థంభం మొత్తం నాలుగు మూలల్లో నిలబడలేదు, ��ది కేవలం మూడు కాళ్లపై  నిలబడి ఉంది, ఒక మూల అయితే పూర్తిగా నేలను తాకనే లేదు చూడండి. 
ఈ gapలో ఒక thin cloth లేదా ఒక paperని పెట్టి అది నేలను తాకలేదని prove చేయవచ్చు, దీన్ని ఇంతకు ముందు వరకు ఇలా చేస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ స్థంభం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరికీ అనుమతి లేదని అధికారులు చెప్తున్నారు. కానీ నేను మీకు zoom చేసి చూపిస్తాను, అప్పుడే అది నెలకు attach అవ్వలేదని మీకు clearగా కనిపిస్తుంది. ఈ స్థంభం చాలా పెద్దదిగా ఉంది, ఇది ఒకే రాయితో తయారు చేసిన స్థంభం అని archeologistలు చెప్తున్నారు, ఇది ఒక పెద్ద graite రాయితో తయారు చేసిన ఒక పెద్ద స్థంభం, ఇది దాదాపు 42 అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పు అలానే 45 టన్నుల బరువుతో, ఈ స్తంభాన్ని నిర్మించారు. 
అది మాత్రమే కాకుండా, ఇది recentగా నిర్మించిన స్థంభం కాదని, పురాతన కాలం నాటిదని archeologistలు confirm చేసి చెప్తున్నారు. దీన్ని ఎలా నిర్మించారు, ఎలాంటి support లేకుండా, ఇది ఎలా balance చేస్తుంది, మరీ ముఖ్యంగా ఇన్ని శతాబ్దాల తరువాత కూడా, ఇది ఎలా నిలబడుతుంది? ఈ విధంగా ఎలాంటి support లేకుండా, నిలబడాలంటే, గురుత్వాకర్షణ కేంద్రం అంటే center of gravityని లెక్కించే సామర్ధ్యం కలిగిన  silpulu  ఉండాలి. Center of gravity గురించి scientific knowledge లేకుండా, వాళ్ళు ఇలాంటి ఒక miracleను create చేయలేరు. 
కానీ పురాతన  silpulu, gravity గురించి అర్ధం చేసుకున్నారని prove చేయడానికి ఈ గుడిలోనే ఏదైనా ఆధారం ఉందా? ఈ గుడి గురించి చాలా విచిత్రమైన, అది మాత్రమే కాదు చాలా రహస్యమైన ఒక విషయం ఉంది. 1926 సంవత్సరంలో, గాంధీగారు మరియు నెహ్రూ వంటి మన భారతీయ నాయకులు ఈ గుడికి వచ్చారు, అలానే పాకిస్థాన్ యొక్క మొదటి ప్రధాన మంత్రి, మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ గుడికి వచ్చారు. విగ్రహ ఆరాధనపై నమ్మకం లేని ముస్లిం, ఈ గుడికి ఎందుకు వచ్చారు? 
అతను దర్శనం చేసుకోవడానికి రాలేదు, కానీ ఈ చెక్కడానికి సంబంధించిన ఒక విచిత్రమైన scientific phenomenon గురించి తెలుసుకోవాలని, ఆయన చాలా interestగా ఉన్నారు, అందుకే ఈ గుడికి వచ్చారు. ఈ నాయకులకు ఒక విచిత్రమైన demoని చూపించడం కోసం, మోహిని అని పిలవబడే ఈ ప్రత్యేక విగ్రహాన్ని, పై నుండి తొలగించి కిందికి తీసుకొచ్చారు. ఆమె poseను చూడండి, చాలా విచిత్రంగా ఉంది, దీన్ని చూస్తుంటే, ఈమె ఏదో ఒక తీగను పట్టుకొని, dance చేస్తున్న ఒక తోలుబొమ్మలా నిలబడి ఉంది కదా. 
ఆమె రెండు చేతులే మనకు clearగా సూచిస్తున్నాయి, కానీ అక్కడ తీగ లేదు, నిజానికి ఆమె తన తలపై ఉన్న చేతి వేలి నుండి నీటి బిందువును కిందికి వదులుతుంది. నాయకులు ముందు ఈ విగ్రహాన్ని నిలబెట్టేటప్పుడు, నిజంగానే ఒక చుక్క నీరును ఉపయోగించారు. ఆ చుక్క ఆమె కుడి చేతి వేలు నుండి పడి, సరిగ్గా ఆమె కనుబొమ్మల మధ్య, ముక్కును తాకి, ఆమె ఎడమ చనుమొనను తాకి, సరిగ్గా ఆమె రెండు కాళ్ళ మధ్యలో వెళ్లి, ఆమె ఎడమ కాలి బొటనవేలును తాకి, ఆ తరువాత నేలను తాకుతుంది. ఈ ప్రదర్శనను చుసిన వెంటనే, ముగ్గురు రాజకీయ నాయకులు లేచి చప్పట్లు కొట్టారంట.
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
'ఆర్క్ రియాక్టర్' కట్టుకథ కాదు! ఐరన్ మ్యాన్ 'ఆర్క్ రియాక్టర్'ను అధిగమించిన పురాతన సాంకేతికత!
Hey guys, ఈరోజు నేను మీకు 800 సంవత్సరాలకు ముందు ఉన్న, పురాతన arc reactorకు సంబంధించిన కొన్ని solid evidenceలను చూపించబోతున్నాను. మీలో కొంతమంది, ఇది comedyగా ఉందని కూడా అనుకోవచ్చు, కానీ ఈ వీడియోను చివరి వరకు చూసి నేను చెప్పింది, ఒకవేళ తప్పు అనిపిస్తే నాకు prove చేయండి. ఇక్కడ పురాతన గుడిలో, ceiling పైన ఉన్న, ఒక విచిత్రమైన చెక్కడాన్ని మీరు చూడవచ్చు. దీన్ని first చూడగానే, ఇంత పెద్ద ఎత్తులో, చాలా advanced అయినా designను చూడటం, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది పువ్వు designనో లేదా ఆకు designనో లేదా ప్రకృతికి సంబంధించిన design కూడా కాదు, ఇది ఒక technical device అని clearగా తెలుస్తుంది. 
ఈ గుడిని 1250 common eraలో కట్టారని archeologistలు అంచనా వేస్తున్నారు, ఆ విధంగా చూసుకుంటే దీన్ని 800 సంవత్సరాల క్రితమే నిర్మించారు, కానీ ఇది దానికంటే చాలా పురాతనమైయ్యుండొచ్చు. దీన్ని చూస్తుంటే విమానాలలో చూసే jet engine propeller యొక్క rotating mechanismలాగ కనిపిస్తుంది కదా. ఇక్కడ మధ్యలో నుండి పొడుచుకు వచ్చిన knobను చూడండి. ఇది స్పష్టంగా కనిపిస్తున్న ఒక knob ఎహ్, exactగా ఇదే విధమైన design, jet propellerలో కూడా ఉంటుంది. కానీ, ఈ design నిజంగానే modern day propeller కంటే, చాలా complicatedగా ఉంది. ఇక్కడ మధ్యలో, ఒక electrician bulbని fit చేశారు చూడండి. 
దీన్ని ఇప్పుడే recentగా చేశారు, కానీ, దాని wireని, ఈ చెక్కడం లోపలి దూర్చి ఎలా పెట్టారో చూడండి, ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఇలా లేదు, చాలా placeలలో కూడా ఇలానే ఉంది చూడండి. దీని అర్ధం ఏంటంటే, దీని లోపల మొత్తం, hollowగా ఉంది, ఇది ఒక advanced machine యొక్క complicated 3D model. దీని గురించి నేను ఇంకా deepగా చెప్పాలని అనుకోవడం లేదు, ఎందుకంటే, ఈ వీడియో ఏం ఒక technical power point కాదు, కానీ ఇందులో మొత్తం 5 concentric circles ఉన్నాయి, దాని మధ్యలో ఉండేటివి చూస్తుంటే, ఏవో radiating partsలాగ కనిపిస్తున్నాయి కదా. 
ఇందులో ఉన్న ఒకొక్క studs ఒక coil కావచ్చు, ఇప్పుడున్న modern day arc reactor కూడా, ఇదే designతో ఉంటుంది. మీలో చాలా మంది, ఇది ఒక fantastic అయిన design అని ఒప్పుకుంటారు, ఇది iron man movieలో వచ్చే, ఒక arc reactorని మీకు గుర్తుచేస్తుంది. కానీ, ఇది ఒక విధమైన energy device అని చెప్పడానికి, నా దగ్గర ఏదైనా ఆధారం ఉందని అడుగుతున్నారా? పురాతన స్థపతిలు మనల్ని impress చేయడానికి, ఈ విధమైన విచిత్రమైన pattern ని చెక్కారా, ఇది machine కాకపోయినా may be design గా కూడా అయుండొచ్చు కదా? ఇదే ప్రశ్నను నన్ను నేనే అడిగాను, కానీ, చూడండి గుడి గోడలపై నేను దీన్ని కనిపెట్టాను. 
ఇక్కడ మీరు ఇదే విధమైన, ఇంకొక deviceని కూడా చూడవచ్చు, ఈ device లోపల, ఒక circular partను మీరు చూడవచ్చు, కానీ ఇది thick అయిన cableతో attach అయ్యుంది, దీన్ని చూస్తుంటే, ఇప్పుడున్న modern day multi track cable లాగానే ఉంది. అదే విధంగా, ఈ రెండు ఎలా connect అయ్యి ఉన్నాయో అని, కూడా మీరు చూడవచ్చు. And ఇక్కడున్న ఒక వ్యక్తి, తన చేతులతో ఒక పెద్ద cylinderను పట్టుకోవడం, మీరు చూడవచ్చు. ఈ cylinder యొక్క ముగింపు, ఈ right sideలో attach అయ్యింది. కానీ, దీన్ని base చేసుకొని ఒక ముగింపుకి మనం రాకూడదు, ఈ cylinderకి అలానే arc reactorకి మధ్య ఉన్న సంబంధ ఏంటీ?
ఇంకొక వైపు వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం. మరోవైపు పాల సముద్రం నుండి అమృతాన్ని చిలికే కథను ఇక్కడ చూడవచ్చు. పురాతన గ్రంధాలలో ఉండే విధంగా, రాక్షసులు, దేవతలు కలిసి ఒక పామును తాడుగా మార్చి అలానే పర్వతాన్ని మధనంగా ఉపయోగించి సముద్రం నుండి అమృతాన్ని చిలికి తీసారు. కానీ, ఈ చెక్కడం చాలా విచిత్రమైనదాన్ని చూపుతుంది, అది ఏంటంటే, ఇది ఒక మధనం కాదు, ఇది ఒక స్థంభం, దీని మధ్యలో ఉన్న భాగం చాలా smoothగా, cylindrical shapeలో ఉంది, ఈ స్థంభానికి పైన, కింద ఉన్న భాగం square shapeలో ఉంది చూడండి. 
కానీ ఇక్కడ చాలా విచిత్రమైన ఒక భాగం ఉంది, ఆది ఏంటంటే. ఈ గుడిలో కూడా సరిగ్గా ఇదే లాంటి ఒక స్థంభం ఉంది, కానీ ఈ స్థంభం యొక్క పైభాగాన్ని, కింద భాగాన్ని చూడండి square shapeలో ఉంటుంది, అలానే మధ్యలో ఉన్న భాగం cylindrical shapeలో smoothగా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని చూడండి, ఈ turn marks అన్ని rotating lathe machine లేకుండా, వీటిని తయారు చేయలేమని archeologistలు కూడా confirm చేస్తున్నారు, ఒకవేళ పురాతన స్థపతిలు, వీటన్నిటిని, వాళ్ళు ఎలా create చేశారనే దాన్ని మనకు చూపించాలని అనుకున్నారేమో, వీటన్నిటిని ఎలా turn చేసారో అంటే ఎలా మధనంగా చేసారో అని కూడా చెప్పవచ్చు  కదా. 
కానీ, ఈ పెద్ద స్థంభం పైన ఏముందో కొంచెం చూడండి, ఇక్కడే ఒక పెద్ద arc reactor ఉంది. ఈ పెద్ద స్తంభం పక్కనే, పెద్ద ఎత్తులో arc reactorను పెట్టడం అనేది coincidenceఆ? ఇప్పుడు, ఈ arc reactorను చూడండి, ఇది directగా తాడుతో connect అయ్యి, ఈ స్తంభాన్ని తిప్పుతుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక రకమైన machineఎహ్, ఇది ఒక తాడుతో connect అయ్యి effectiveగా తిరగడానికే దీన్ని ఇలా fix చేశారు.
- Praveen Mohan Telugu
0 notes
praveenmohantelugu · 3 years ago
Video
youtube
భూమిపై ఉన్న వింతైన దేవాలయం? నరసింహ ఆలయ పురాతన రహస్యాలు బట్టబయలు!
Hey guys, ఈ రోజు మనం చాలా పురాతనమైన గుడిని చూడడానికి వెళ్తున్నాము. శ్రీ లక్ష్మి నరసింహ అనే ఈ గుడి జావగల్ అనే ఒక మారుమూల గ్రామంలో ఉంది.  ఈ గుడికి ఎవరూ పెద్దగా రారు, అంతెందుకు archaeologist లు కూడా ఈ గుడికి రారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న చెక్కడాలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయని, వాటిని ఎవరూ అర్థం చేసుకోలేరని చెప్తున్నారు. ఈరోజు ఈ శిల్పాలన్నిటిని పరీక్షించి నేను ఏమైనా అర్ధం చేసుకోగలుగుతున్నానా అని చెప్తాను, ఇంకా వీటిని ఎవరు సృష్టించి ఉంటారని నేను కనిపెట్టడానికి try చేస్తాను. 
అయితే first, నేను దీన్ని ఎదుర్కోవాలి ... నేను ఈ పురాతన గుడిలోకి వెళ్ధము అని అనుకున్నపుడు ఇది దారి వదలను అని అడ్డుగా నిలబడి ఉంది. నాకు అస్సలు దారి ఇవ్వనంటుంది. Why…?? Ok...?? ఎందుకు ఏడుస్తున్నావ్... Okay bye. ఇప్పుడు, ముందు నుండి చూస్తే ఈ గుడి మీకు చాలా చిన్నదిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ సుమారు వెయ్యి కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయని archeological reports చెప్తున్నాయి, గుడి లోపల కంటే చాలా వరకు శిల్పాలు బయటి గోడలపైనే కనిపిస్తాయి. 
అలా చుట్టూ చేస్తున్నప్పుడే, నేను ఒకటి చూసాను. So, ఇక్కడ మీరు నిజంగా ఒక విచిత్రమైన��ాన్ని చూడవచ్చు. ఇది ఒక box లాగ ఉంది, ఆ box లో ఒక తల, ఒక ముఖం ఉంది చుడండి. ఇంకా ఇలా ఒక చేయి ఉంది, ఒక పెట్టెలో ఉన్న తలను చూస్తుంటే gum తో అతికించినట్టు ఉంది. నేను దగ్గరకెళ్ళి చూసినప్పుడు, నాకు ఒక చేయి కనిపించలేదు, తలకి ఇరువైపులా 2 చేతులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒక విషయాన్ని చూపించడానికి try చేస్తున్నట్టుగా తలను, చేతులను ఒక పెట్టె పైన ఉంచారు, కానీ ఎందుకు? 
ఇది నిజంగానా చాలా విచిత్రమైన శిల్పం.ఇప్పుడు, మనం దీన్ని మరింత అర్థం చేసుకోగలమో లేదో చూడటానికి పక్కన ఉన్న చెక్కడాలను చూద్దాం, ఇక్కడ మనం ఒక పెద్ద ఆకారాన్ని చూడవచ్చు, ఖచ్చితంగా, అతనికి తల లేదని ఇంకా అతని 2 చేతులు మణికట్టు నుండి కత్తిరించబడిందని మనం చూడవచ్చు. అతని ప్రక్కనే, ఒక చిన్న కోతి లాంటి ఒక ఆకారం ఉంది చుడండి, ఇంకా ఇక్కడ ఒకతను చేతిలో విల్లును పట్టుకున్నట్లు మనం చూడవచ్చు, ఇది చాలా advanced అయిన ఒక compound విల్లు, ఎందుకంటే మీరు రెండు వైపులా గేర్‌లను చూడవచ్చు. ఈ advanced అయిన విల్లును పట్టుకుని ఉన్న వ్యక్తి రాముడు, అది మాత్రమే కాకుండా, ఈ మొత్తం సంఘటన పురాతన హిందూ గ్రంథాలలో వివరించబడింది.
 ఆ రాక్షసుడి పేరు కుంభకర్ణుడు, అతను యుద్ధభూమిలో తల మరియు చేతులు నరికివేయబడ్డాయి. అలా చుట్టూ నడుస్తున్నపుడు, నేను మరొక వింత శిల్పాన్నిచూసాను. శిల్ప నిపుణులను పూర్తిగా పిచ్చేంకించేలా చేసిన శిల్పాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ మీరు 2 పెద్ద ఆకారాలను చూడవచ్చు, రెండూ కూడా చూడడానికి కోతి లాగా ఉన్నాయి కదా, వాటిలో ఒకటి దాని ముఖంపైన పొడవైన ఒక సిలిండర్‌ను పట్టుకుని ఉంది చుడండి. కొందరు దీన్ని టెలిస్కోప్ అని కూడా చెప్తున్నారు. కానీ అది సాధ్యం కాదు, ఎందుకంటే దాన్ని మరొక చివరను మరొక పెద్ద కోతి పట్టుకుని ఉంది, దీని పైన, కొన్ని కోతులు నిలబడి ఉన్నాయి ఇంకా కింద కూడా మరికొన్ని కోతులు ఉండడం మీరు చూడవచ్చు. 
అది ఏ కథ అయ్యుంటుంది? సరే ఇప్పుడు మనం పక్కన ఉన్న శిల్పాల నుండి వేరే ఏవైనా information దొరుకుతుందో లేదో అని చూద్దాం రండి. కొంచెం వెనక్కి వెళ్లి ఇక్కడ ఏం ఉందని చూద్దాం. ఇక్కడ మీరు అలలను ఇంకా నీటిలో ఈదుతున్న చేపలను చూడవచ్చు. అంటే ఇవన్నీ నీటి పక్కనే జరుగుతుందనామాట. ఇక్కడ, ఒక కోతి రాళ్ల పై ఏదో పని చేస్తుంది, and మళ్ళీ అతని పక్కనే చాలా చేపలతో unna అలలను మీరు చూడవచ్చు. నీటికి అవతలి వైపు, రాక్షసులను ఉన్నారు చూడండి. మళ్ళీ, దీని గురించి కూడా పురాతన భారతీయ గ్రంథాలలో వివరించబడ్డాయి, భారతదేశానికి, శ్రీలంకాకి మధ్య వానరులు అనే కోతుల జాతి ఒక వంతెనను నిర్మిస్తుందని రామాయణంలో ఉంది. ఈ రెండు నల మరియు నీలుడు అనే పెద్ద కోతులు శ్రీలంకకు వెళ్ళడానికి ఆ వంతెనను కట్టారు. 
 అయితే ఈ పొడవైన వస్తువు కచ్చితంగా ఏదో ఒక construction వస్తువు అయి ఉండాలి, వాళ్లు అది strong గా ఉందా లేదని test చేస్తున్నారు. వానరులు దాని మీద నడిచి చూ��ి వంతెనపైన పెట్టడానికి ఈ material strong గా ఉందొ లేదా అని check చేస్తున్నారు. ఈరోజు కూడా 2 రాళ్ల మధ్య ఒక పలకను పెట్టి, అది బాగా strong గా ఉందా లేదా అని మొదట దాని మీద నడిచి చూస్తాము కదా, కానీ వీళ్ళు చాల బలవంతులు కాబట్టి, వాళ్ళు దానిని రెండు వైపులా పట్టుకొని కోతులను వాటిపై నడవమని చెప్పి అడుగుతున్నారు. 
కచ్చితంగా, 2 దేశాల మధ్య వంతెనను కట్టాలంటే అది కూడా సముద్రం మీద నిర్మించడం అంటే కచ్చితంగా ఒక పురాణాల కథ లాగానే కనిపిస్తుందని మీరు అనుకుంటారు, కానీ , భారతదేశానికి, శ్రీలంకాకు మధ్య ఒక పురాతన వంతెన ఉందని, ఇంకా అది natural గా ఏర్పడిన నిర్మాణం కాదని సైంటిస్టులు కొన్ని సంవత్సరాలకు ముందే ఒప్పుకున్నారు. ఇలాంటి విచిత్రమైన చెక్కడాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని డీకోడ్ చేయాలంటే మనం పురాతన గ్రంథాలను బాగా తెలుసుకోవాలి, అంటే మీరు సంవత్సరాలుగా హిందూ మతంలో ఉన్న పురాణాలూ, రామాయణం, మహాభారతం, వేదాలు అన్ని నేర్చుకోవలసిన  అవసరం ఉంటుంది, అందుకే ఈ రోజుల్లో ఉన్న చాలా మంది expert లు ఈ శిల్పాలను అర్థం చేసుకోలేకపోతున్నారని అనుకుంటున్నాను.
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
రాముని విల్లులో ఊహకు అందని రహస్యం! ఆశ్చర్యపరిచే పురాతన సాంకేతికత ఆధారాలు!
Hey guys, ఈ రోజు నేను రాముడి విల్లు మరియు బాణం గురించి నేను కనిపెట్టిన కొన్ని interesting ఐన వాటిని మీకు చూపించబోతున్నాను. ఇప్పట్లో కూడా, హిందువులు విల్లు మరియు బాణంతో సాధారణంగా కనిపించే రాముడిని పూజిస్తారు. రాముడు తన లక్ష్యాన్ని ఎన్నడూ కోల్పోలేదని, అతని బాణాలు ఒకే సమయంలో అనేక targetలను తాకుతాయని పురాతన భారతీయ గ్రంథాలు చెప్తున్నాయి, చివరి targetని కొట్టడానికి ముందు అతని బాణాలు 7 చెట్ల గుండా ఎలా వెళ్ళాయో అని ఈ చెక్కడంలో మనం చూడవచ్చు. 
ఇది మాయమైన మంత్ర విల్లునా? లేకపోతే ఈయన ఒక advanced technologyను ఉపయోగించారా? ఇక్కడ విల్లు, బాణాలను పట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులను మీరు చూడవచ్చు. అవి విల్లు అని స్పష్టంగా తెలుస్తుంది, ప్రాచీన కాలంలో ఆదిమ ప్రజలు ఉపయోగించిన సాధారణమైన చెక్క  విల్లులు లాగా చాలా simply గానే కనిపిస్తుంది. మళ్ళీ, మీరు మూడవదాన్ని చూడవచ్చు, కానీ బహుశా ఇవి సాధారణ బాణం విసిరే విద్యలు నేర్చుకునే వాళ్ళైయుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ dress ని చూడండి, కేవలం నడుముకు మాత్రమే వస్త్రం వేసుకున్నారు, వేరే ఏ ఆభరణాలు లేవు. 
వాళ్ళు సాధారణంగా ముందు వెళ్తున్న సైనికుల వెనుక ఒక alignment లో వెళ్తున్నారు. అయితే ఈ విల్లులను చూడండి.. విల్లుకు రెండు చివర్లలో విచిత్రమైన చక్రాలు ఉన్నాయి. ఇది crazy గా ఉంది కదా, మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు మనం విల్లులలో చక్రాలు లేదా క్యామ్‌లను ఉపయోగిస్తాము, వాటిని మనం కాంపౌండ్ బావ్స్ అని పిలుస్తాము. ఈ circles అన్ని smoothగా ఉండడం మీరు చూడవచ్చు, ఇప్పట్లో ఉన్న compound విల్లులపై ఉండే cam wheels లాగానే ఇది కూడా smooth గా ఉన్న ఒక circle గా ఉంటుంది. 
ఇది చాలా interestingగా ఉంది ఎందుకంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా search చేసి చూస్తే, కేవలం 50 సంవత్సరాలకు ముందు మాత్రమే USలో compound bow ని కనిపెట్టారని మీరు చూస్తారు. కానీ ఈ గుడి వెయ్యి సంవత్సరాల పురాతనమైనది, పురాతన కాలంలో స్థపతులు చక్రాలతో కూడిన కాంపౌండ్ విల్లులను ఎలా ఉపయోగించారని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. విల్లుపై చక్రాలు పెట్టడం వల్ల అది మరింత శక్తివంతంగా ఇంకా ప్రభా��వంతంగా ఉంటుందని easyగా మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే మీరు మనుషుల effort ని అధిగమించడానికి కొన్ని mechanical equipment లను మనం ఉపయోగిస్తున్నాము. 
అయితే అందుకేనా రాముడి విల్లు మరింత ప్రభావవంతంగా ఉండేది? రాముడు తన విల్లుకు చక్రాలు పెట్టి ఉపయోగించారా? ఇక్కడ నేను నిజంగా చాలా amazing ఐన విషయాన్నీ చూసాను. రాముడు మరియు అతని తమ్ముడైన లక్ష్మణుడు యొక్క కొన్ని పెద్ద శిల్పాలను నేను ఇక్కడ చూసాను, వాళ్ళ విల్లులు కొన్ని విచిత్రమైన వివరాలను చూపుతున్నాయి. First చూసినప్పుడు, వాళ్ళ విల్లులో చక్రాలు ఉన్నాయని నేను అనుకున్నాను, కానీ వాటిని దగ్గరగా పరిశీలించినప్పుడే, అవి చక్రాలు కాదు, gear లు అని నాకు అర్ధమైంది. 
I mean ఇక్కడ చూడండి, gear వీల్ యొక్క దంతాలను చూడవచ్చు, విల్లుకు ఈ gear మెకానిజం attach అయింది. ఇది చాలా advanced అయిన పురాతన టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడున్న విల్లులలో కూడా ఈ టెక్నాలజీ ను ఉపయోగించలేదు. కానీ 20 ఏళ్లలో అంటే 2040కి ముందే ఎవరైనా ఇలాంటి ఒక రకమైన విల్లును తయారు చేయడం ప్రారంభిస్తారు. అలాంటి విల్లును ఏమని పిలుస్తారని అనుకుంటున్నారు? “Pull-Back Bow" ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, కదా? ఎందుకంటే ఈరోజు మన దగ్గర పుల్ బ్యాక్ కార్లు ఉన్నాయి. 
చిన్నప్పుడు మన అందరి దగ్గర బొమ్మ కార్లు ఉంటాయి, అవి ముందుకు పోవాలని అనుకుంటే మనం వాటిని ముందుకు నెట్టుతాము, వెన్నకి వెళ్లాలంటే వెనక్కి నెట్టుతాము. కానీ అప్పుడు ఎవరో ఒకరు మనకు "పుల్-బ్యాక్ కార్" ని ఇచ్చారు, దానిని ముందుకు నెట్టడానికి బదులుగా, మీరు దానిని వెనక్కి లాగుతాము, అప్పుడు అది ఒక వింత క్లిక్ సౌండ్ చేస్తుంది కదా, మనం దానిని release చేసినప్పుడు, అది ఎంత వేగంగా ముందుకు పోతుందో అని మీకు గుర్తుంది. ఇదే రాముడు తన పురాతన విల్లులో ఉపయోగించిన పురాతన టెక్నాలజీ. 
పుల్ బ్యాక్ కార్లలో బ్యాటరీలు లేదా ఇంకేదైనా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఆ కారుని తెరిస్తే, లోపల మీకు రెండు గేర్లు, ఒక స్ప్రింగ్ కనిపిస్తాయి. అయితే, మనం దీన్ని టెక్నాలజీ కోసం ఉపయోగించినప్పుడు, మనం దానితో చాలా అద్భుతమైన విషయాలను చేయవచ్చు, గడియారాలు ఇంకా సైకిల్ లాంటి అనేక machines లలో ఈ technologyను ఉపయోగించవచ్చు. అయితే ఏదో ఒక రోజు, ఎవరో ఒకరు వచ్చి ఇది gear ఎహ్ కాదు, ఇవి కేవలం ఒక పువ్వు మాత్రమే అని వాదిస్తారు. అవునూ, మరి సైనికులు వాళ్ళ విల్లులపై పువ్వులు పెట్టి ఎందుకు ఉపయోగించారు? 
మీరు ఏదైనా పువ్వును చూస్తే, దాని రేకులు పెద్దగా ఉంటాయి ఇంకా రేకులతో పోలిస్తే మధ్యలో ఉన్న భాగం చిన్నదిగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా gear ను తీసుకుంటే, మధ్య భాగం పెద్దదిగా ఉంటుంది, side లో ఉన్న gear ల పళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. exact గా దీనినే మనం ఇక్కడ ఈ శిల్పంలో చూస్తున్నాము. ఇప్పట్లో మనం ఉపయోగించే విల్లులో తీగలు ఉన్న విధంగానే ఈ పురాతన విల్లులో కూడా తీగలు ఉండడం మీరు చూడవచ్చు. మీరు ఆ gear ను చూసిన ప్రతిసారీ, దానికి తీగలు attach అయ్యుండడం మీరు చూడవచ్��ు. విల్లులపై gearలు ఉన్న అన్ని శిల్పాలపై దీనిని మీరు చూడవచ్చు. లూసు��ా ఉండే తీగలను ఇంకా ఇక్కడ ఉన్న ఈ నాట్‌లను కొంచం గమనించండి.
- Praveen Mohan Telugu
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
https://www.facebook.com/praveenmohantelugu2000 సంవత్సరాల నాటి 'బాగ్దాద్ బ్యాటరీ' విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందా?
Hey Guys, ఈ రోజు మనం బాగ్దాద్ బ్యాటరీ అనే ఒక వింత విషయాన్ని చూడబోతున్నాం. ఈ బాగ్దాద్ బ్యాటరీ సుమారు 2000 సంవత్సరాలు పాతది, దీనికి విద్యుత్‌ని తయారుచేసే శక్తీ ఉంది. మనందరికీ తెలిసిందే, ఈ బ్యాటరీ ని అలెజండ్రో వోల్టా అనే వ్యక్తి 1800 సంవత్సరంలో అంటే కేవలం రెండువ��దల సంవత్సరాలకు ముందు కనిపెట్టాడని తెలుసు. కానీ history booksలలో ఉన్నవి తప్పు, ఎందుకంటే మన పురాతన technology గురించిన వాస్తవాలను దాచిపెట్టి తప్పైన factsని చెప్తున్నాయి. 
ఇప్పుడు మనం ఈ 2000 సంవత్సరాల నాటి బాగ్దాద్ బ్యాటరీ నే మళ్లీ తయారు చేసి అందులో ఒక light bulb ని  వెలిగించడంలో కానీ లేకపోతే ఒక మోటార్ ని నడపటానికి తగినంత విద్యుత్ శక్తిని తయారు చేస్తుందా? లేదా?అసలు మనకు దీనితో ఏదైనా ఉపయోగం ఉందా? లేదా?అని చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం 80 సంవత్సరాలు వెనక్కి వెళ్లి బాగ్దాద్ బ్యాటరీ ఎలా కనిపెట్టారనేదాన్ని చూద్దాం. 1938 వ సంవత్సరంలో Wilhelm Konig అనే ఒక జర్మన్ ఆర్కియాలజిస్టు ఇప్పుడు ఇరాక్, దేశం యొక్క capital అయిన బాగ్దాద్ సిటీ బయట ఒక డజన్ జార్లను కనిపెట్టాడు. 
ఈ జార్లు ఒక్కోటి ఐదంగుళాల పొడవు ఉంటాయి, ఇంకా వాటి set up చాలా uniqueగా ఉంది. ఇది ఒక copper cylinder, వీటిలోపల ఒక కాపర్ foilని roundగా చుట్టి ఒక సిలిండర్ లాగా తయారు చేసి ఈ జార్ మధ్యలో ఉంచారు. ఈ సిలిండర్ మధ్యలో ఒక ఇనప రోడ్ ని కూడా పెట్టారు. ఈ రెండు ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండడానికి ఒక bitumenని మధ్యలో పెట్టారు. Bitumen అంటే రోడ్ కు వేసే తారు లాగ. దీని నుండి నీళ్లు leak అవ్వకుండా ఒక water proof materialగా దీన్ని పాతకాలంలో use  చేసారు. 
ఇది చాలా అయిన సెటప్ ఇంకా ఈ  మొత్తం మెటల్ arrangement అంతా కూజా ఈ జార్ లోపల ఉంచారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జార్లలో గ్రేప్ జ్యూస్ లేదా wine juice యొక్క జాడలు ఉన్నాయి, ఈ గ్రేప్ జ్యూస్ ఇంకా వైన్ జ్యూస్ ఉండడం వల్ల ఈ మెటల్స్ అన్ని తప్పుపట్టినట్లుగా మనకి అక్కడక్కడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేయబోయే కొత్త బ్యాటరీ ఈ బాగ్దాద్ బ్యాటరీ లాంటిదే. నేను బాగ్దాద్ బ్యాటరీ యొక్క జార్ లాగ ఉన్న ఈ మట్టి కుండలో, కాపర్ సిలిండర్ ని ఇంకా ఈ మధ్యలో ఒక ఐరన్ రాడ్ ని కూడా పెడుతున్నాను. 
ఇప్పుడు ఒకటే తేడా ఏంటంటే ఈ copper cylinderకి, ఈ iron rodకి మధ్యలో ఒక cork stopperని అంటే bottleకి చెక్కతో చేసిన ఒక మూత వేస్తాము కదా, అలాంటిదాన్ని stopperగా use చేయబోతున్నాను. అంటే మన పాతకాలపు బ్బాగ్దాద్ బ్యాటరీలో bitumen ఉనింది. మరి నాకేమో ఆ bitumen దొరకలేదు కాబట్టి నేను ఈ stopperని use చేస్తున్నాను, ఈ stopper యొక్క use ఏంటంటే ఈ copper, iron rod ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉండడానికే. So ఇప్పుడు ఏ materialని వాడుతున్నాము అనేది పెద్ద విషయం కాదు.. 
కానీ ఇప్పుడు నేను తయారు చేసే ఈ కొత్త బ్యాటరీకి ఆ పాత బాగ్దాద్ బ్యాటరీ కి అదొక్కటే తేడా.  So ఇప్పుడు మీరు ఈ setupని చూస్తున్నారు కదా, దీన్ని నేను ఇంకొక stopperగా use చేయబోతున్నాను అప్పుడే ఇది లోపల పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మన next step ఏంటంటే దీంట్లో grape juice పోయాలి.  So ఇదిగోండి. ఇక్కడ నేను కొంచం grape juice చేసి పెట్టాను దీన్ని ఇందులో పోయపోతున్నాను. త��్వాత వీటినన్నిటిని ఈ jarలో పెట్టబోతున్నాను సొ ఇప్పుడు ఈ కాపర్ అనేది పాజిటివ్ టర్మినల్గా పనిచేస్తుంది ఈ ఐరన్ రోడ్ ఏమో నెగెటివ్ టర్మినల్‌గా పనిచేస్తుంది, ఇందాక మనం పోసిన గ్రేప్ జ్యూస్ ఏమో ఎలక్ట్రోలైట్ గా పనిచేస్తుంది.  
మీరు నమ్ముతారో లేదో నేను ఈ grape juiceని ఇందులో పోయగానే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్టుగా నాకు శబ్దం వినిపిస్తోంది. కానీ ఇక్కడ మనం ఉన్నది chemical reaction యొక్క శబ్దాన్ని వినడానికి మాత్రమే కాదు, ఈ బ్యాటరీ వల్ల ఎంత powerని create చేస్తుందని చూడాలి.  అందుకే ఇప్పుడు దీనిలోపల ఈ volt meterని పెట్టి ఎంత electricity produce అవుతుందని చూద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది నేను మీకు already ఒక పాత ఇండియన్ బ్యాటరీ ని చూపించాను.  అది మహర్షి అగస్త్య తయారు చేసిన 5000 సంవత్సరాల పురాతన బ్యాటరీ. ఆ బ్యాటరీతో ఒక్క వోల్ట్ విద్యుచ్ఛక్తి తయారైంది.ఇప్పుడు ఈ బ్యాటరీ ఎంత electricityని produce చేస్తుందో అని చూద్దాం రండి. 
ఈ బాగ్దాద్ బ్యాటరీ యొక్క speciality ఏంటంటే ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ సులభంగా దొరికే వస్తువులే.  మట్టి కుండ, రాగి, ఇనుము ఇవన్నీ కూడా సులభంగా దొరికేవే, ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే ఎవరైనా చేసుకోవచ్చు.ఇవే ఈ బాగ్దాద్ బ్యాటరీని తయారు చేయడానికి కావాల్సినవి. So నేనిప్పుడు ఈ వోల్టు  మీటర్ ని బాగ్దాద్ బ్యాటరీకి cnnect చేసి చూస్తే, ఇది 0.5 volts కంటే ఎక్కువ విద్యుత్‌శక్తిని తయారుచేస్తుందనే దాన్ని నేను clearగా చూడగలుగుతున్నాను. 
ఇది సగం volt కంటే ఎక్కువ విద్యుత్ ని create చేస్తుంది కాబట్టి ఇది కచ్చితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న బ్యాటరీనే. అయితే ఆర్కియాలజిస్టులు ఇంకా Historiansలు ఈ బాగ్దాద్ బ్యాటరీని ఒక నిజమైన బ్యాటరీ అని ఒప్పుకుంటున్నారు. కానీ సందేహంగా ఉండే కొంతమంది archeologists and historiansలు లేనిపోనివి చెప్పి ఈ బ్యాటరీతో ఏం చేయలేము అని చెప్తున్నారు. but చాలా మంది ముఖ్యమైన experts అందరూ దీన్ని ఒక నిజమైన బ్యాటరీగ�� ఒప్పుకున్నారు.  
- Praveen Mohan Telugu 
1 note · View note
praveenmohantelugu · 3 years ago
Video
youtube
అత్యంత భయంకరమైన పురాతన ఆయుధం! ప్రాచీన సిద్ధులు కనిపెట్టిన 'సాశుమాత'
Hey guys, ఈ రోజు మనం చాలా విచిత్రంగా ఉన్న ప్రత్యేకమైన ఒక పాతకాలపు ఆయుధం గురించే చూడబోతున్నాం. దీనిని Man Catcher అని అంటారు, ఈ ఆయుధాన్ని భారతదేశంలో, పాతకాలంలోనే తయారు చేసారు, దాని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు, దీనిని చూసిన వెంటనే ఎందుకు దీన్ని Man Catcher అని పిలుస్తున్నారని తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ చెట్టు కాండంనే ఒకరి మెడ అని అనుకోండి, ఈ ఆయుధాన్ని ఒకరి మెడ పైన పెట్టారంటే, అది ఇలా వెంటనే మెడ లోపలికి జారుతుంది. కానీ, దీనిలోపల ఇరుక్కుపోయిన వాళ్ళు బయటికి రావాలని ప్రయత్నించినా రాలేరు. 
ఈ Man Catcher అనేది ఒక ఏకైక ఆయుధం, ఎందుకంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఒకరిని పట్టుకోవడం లేదా వాళ్ళని control చేయడం తప్ప వాళ్ళని చంపలేదు. కాబట్టి, దీనిని ఆయుధం అని కాకుండా tool అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయుధాలన్నీ చంపడానికే ఉపయోగిస్తారు. Correct గా చెప్పాలంటే, దీనిని ఒక tool గానే ఉపయోగిస్తారు, కానీ దీనితో fight చేయరు. ఈ Man Catcher లో ఉన్న, ఈ ఇనుము పార్ట్ నిజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది, కేవలం ఇది ఒక అడుగు పొడవు మాత్రమే ��ంటుంది, కానీ దీనిని సాధారణంగా ఒక పొడవైన  స్థంభం పైనే ఉంచుతారు, దీని structure ఎహ్ చాలా intresting గా ఉంది. 
ఇందులో రెండు రెక్కలు లాంటి shapes ఉన్నాయి, వీటిని వంకరగా ఉన్న spring లతో attach చేసారు. కాబట్టి, మనం force తో మనిషి మెడ పైన దీనిని పెట్టినప్పుడు, ఈ రెక్కల లాంటి flaps రెండు తెరుచుకొని, ముందుకు వెళ్లి అతని మెడని మీరు easy గా పట్టుకోవచ్చు, అయితే, ఈ రెక్కల లాంటి flaps బయటికి రావు కాబట్టి, ఇది ఒకే మార్గంలాగ పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, దీని నుండి విడిపించు కోవాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం తీసుకోవాలి, కాబట్టి, ఇందులో ఒక మనిషి ఇరుక్కున్న ఒక్కడే దీని నుండి తప్పించుకోలేడు. 
అలానే, దీని చుట్టుపక్కల ఉన్న ఈ spike లను చూడండి, ఇవి ఉండడం వలన ఇందులో ఇరుక్కున్న manishi దీని నుండి తప్పించుకొని పారిపోలేడు and అతను వేగంగా నడవలేడు కూడా, ఎందుకంటే ఈ spikes అన్ని అతనికి గాయపరుస్తాయి. Actually, ఈ Man Catcher దాదాపు రెండువందల(200) సంవత్సరాల పాతది, దీనిని british వాళ్ళు ఉపయోగించారు. ఇది ఒక పాతకాలపు artifact, నా friend Jayesh దగ్గర ఇలాంటి పాత వస్తువులు అలానే పాతకాలపు ఆయుధాలు లెక్కలేనన్ని ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాని పరిపాలించినప్పుడు, హింసాత్మక నేరస్థులను control చేయడానికి ఈ Man Catcher లను ఉపయోగించారని చెప్తున్నారు. 
 Of course, ఇందులోనే దీనికంటే చాలా simpleగా ఉన్న models కూడా ఉన్నాయి, కొన్నిటిలో, ఒక పొడవైన స్థంభం పైన, ఒక U ఆకారం ఉండేలా చెక్కారు, So, ఇప్పుడు ఎందుకు ఈ Man Catcherని కనిపెట్టారని తెలుసుకుందాం. ఈ Man Catcherకి బదులుగా ఒక చాకుని కానీ లేదంటే ఒక పొడవైన కత్తిని కానీ శత్రువుపై ఉపయోగించడం easyనే కదా? ఈ Man Catcherని మొదటిగా, భారతదేశంలో ఉన్న హిందూ సాధువులే కనిపెట్టారు, వాళ్లపై దాడి చేసిన వ్యక్తిని వాళ్ళు చంపడానికి ఇష్టపడలేదు కానీ, వాళ్ళను అడ్డగించాలనుకున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి హిందువులపై దాడి చేసినప్పటికీ, ఒకరిని చంపడం లేదా బాధ పెట్టడం పాపమని హిందువులు సాధారణంగానే నమ్ముతారు. 
కానీ, అదే సమయంలో వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు కాపాడుకోవాలి కదా, అందుకోసమే Man Catcher ఒక సరైన ఆయుధంగా ఉండేది. కాబట్టి, హిందూ సాధువులు ఈ సాధనాన్ని చేతుల ద్వారా తీసుకెళ్లడం ఒక ఆచారంగా చేశారు, దీనిని దండం లేదా దండ అని పిలుస్తారు. ఇదే మొట్టమొదటిగా కనిపెట్టిన అత్యంత సులభమైన Man Catcher, దీనిని కనీసం రెండువేల(2000) సంవత్సరాలకు ముందే ఉపయోగించారు. ఎవరైనా వాళ్లపై దాడి చేయడానికి వస్తే, సాధువులు ఈ Man Catcherని ఉపయోగించి, వాళ్ళని అడ్డుకుంటారు. 
సుమారు పదిహేనువందల(1500) సంవత్సరాల క్రితం, బోధిధర్ముడు అనే ఒక భారతీయ యువరాజు, ఈ ఆయుధాన్ని చైనా మరియు జపాన్‌లకు తీసుకెళ్లాడు, చట్టవిరుద్ధమైన నేరస్థులను నియంత్రించడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు. కుంగ్ ఫూ వ్యవస్థను స్థాపించింది, కనిపెట్టింది బోధిధర్ముడే, ఈ ఆయుధాన్ని ఆయనే introduced చేశారు, దీనిని ఆయన సాసుమాత అని పిలిచేవారు, సంస్కృత భాషలో దీని అర్ధం ఏంటంటే ' సజీవంగా తీసుకున్నారు' అని అర్ధం. 
కానీ, ఈ పాతకాలపు సాధనం గురించి మన భారతదేశం వాళ్ళే పూర్తిగా మర్చిపోయారు కానీ, ఈ రోజు వరకు కూడా చైనా జపాన్ మరియు థాయిలాండ్ ప్రజలు, ఈ Man Catcherని బాగానే ఉపయోగిస్తున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు దీనిని సాసుమాత అనే పిలుస్తున్నారు. మనపై దాడి చేసిన వ్యక్తిని గాయపరచకుండా అరికట్టడానికి, వాళ్ళు దీన్ని ఒక మంచి ఆయుధంగా భావిస్తున్నారు, ఈ Man Catcherలో పొడవైన handle ఉంది కాబట్టి, శత్రువు నుండి కొంచెం దూరంలో   నిల్చోగలుగుతున్నారు, అందుకోసమే వాళ్ళు మీపై దాడి చేయడం కూడా అసాధ్యమే. 
And పోలీస్ అధికారులు, ఇప్పటికి కూడా దీనిని ఉపయోగిస్తునే ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఈ సాసుమాతని పట్టుకొని ఉంటే, మీపై దాడి చేసిన వ్యక్తిని మీరు పూర్తిగా మూలన పెట్టి, అతనిని easyగా లొంగదీసుకోవచ్చు. పదిహేను వందల(1500) సంవత్సరాలకు ముందు, ఈ Man Catcher భారతదేశం నుండి చైనా మరియు జపాన్‌లకు ఎలా వెళ్ళిదని ఇప్పుడు మనం చూసాము. చివరికి, ఈ Man Catcher, యూరోపి���న్ల దగ్గరకు వెళ్ళింది, వాళ్ళు దానిని మధ్యయుగ కాలంలో ఉపయోగించడం start చేశారు. లో ఇది చాలా popular అయిన ఒక సాధనంగా మారింది, వాళ్ళు దీనిని ఉపయోగించడంలో చాలా తెలివిగా ఉండేవాళ్ళు.  
- Praveen Mohan Telugu 
1 note · View note