Tumgik
#bananabenefitsintelugu
batukamma · 4 years
Text
ఒక్క అరటిపండు... ఎన్నో ప్రయోజనాలు!
Tumblr media
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో అరటిపండు ఒకటి.. అరటిపండు ఎక్కువగా పండిచే దేశాలలో మన దేశం రెండో స్థానంలో ఉంది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండును తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ అరటిపండు వలన మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకి అవేంటో తెలుసుకుందాం.. నిహారికకి కాబోయే భర్త ఎవరో తెలుసా? అరటిపండు రక్తపోటును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అరటిపండు చాలా తోడ్పడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకి, దంతాలకి చాలా మంచిది. బరువు తగ్గాలంటే అరటిపండు తప్పనిసరి.. ఇందులో కొవ్వు ఉండదు.. క్యాలరీలు కూడా చాలా తక్కువ.. అరటిపండు తినడం వల్ల ఉబ్బసం ఉన్న పిల్లలలో శ్వాసను నివారించవచ్చు.. అరటిపండు నిత్యం తినడం వలన కిడ్నిల సమస్య బారిన పడకుండా తప్పించుకోవచ్చు గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని మరియు మానసిక స్థితిని పెంచుతుంది. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారు అరటిపండు తింటే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. అరటిపండుతో మన కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలతోపాటు మొటిమలు, మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చు. నీరసంగా ఉన్న సమయంలో ఒక్క అరటిపండు తింటే సరే మంచి బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అల్సర్ తో భాదపడుతున్న వారు ఏం ఆలోచించకుండా అరటిపండు తినొచ్చు.. అరటిపండు తినడం వలన ఒత్తిడిని కూడా జయిస్తారు. అరటిపండు గర్భిణులకు ఎంతో మేలు చేస్తోంది. విటమిన్ B6 వలన ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. Read the full article
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
ప్రతిరోజు ఉదయాన్నే ఒక్క అరటి పండు తింటే ఎం జరుగుతుందో తెలుసా Amazing Health Benefits of Banana
Tumblr media
అరటి పండును మనలో చాలామంది ఇష్టంగా తింటుంటారు. పిల్లలు అయితే మరీ ఇష్టపడతారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. దేశ వారి అరటిపండు, చెక్కరకేళి, బొంత, కర్పూర, మద్రాసి చెక్కరకేళి ఇలా ఎన్నో రకాల అరటి పండ్లు ఉన్నాయి. ఇన్ని రకాల అరటి పండ్లలో ఏ అరటి పండ్లు తిన్న శరీరానికి చాలా ఉపయోగాలు లాభాలు కలుగుతాయి. ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. మన శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందాలంటే ప్రతి రోజూ రెండు అరటి పండ్లు తినమని వైద్యులు మరియు పెద్దలు సలహా ఇస్తుంటారు. ఇవి మనం తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఇది మన శరీరానికి కావల్సినంత ఎనర్జీని అందిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన మన శరీరంలో ఇమ్మ్యూనిటి పెంచి  వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే అరటిపండును  తింటే చాలా మంది బరువు పె���ిగి పోతామని దీనికి దూరంగా ఉంటారు. అలాంటి వారు ఈ చిన్న ట్రిక్ తో అరటి పండ్లు తినవచ్చు. అరటి పండుతో కూడా లావుని తగ్గించుకోవచ్చు. మీకు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాలా మంది ఇలా ట్రై చేసి అనుభవపూర్వకంగా వ్యక్త పరిచారు. అదెలాగంటే బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో రెండు అరటి పండ్లు తిని ఒక గ్లాస్ వేడి నీళ్లను తాగాలి. ఇలా తినడం వలన శరీరంలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అలాగే ఇది పొట్ట నిండినట్టు అనిపించి ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా నిదానంగా లావు తగ్గిపోతారు. కావున మీలో ఎవరైనా లావు తగ్గాలంటే ఈ చిన్న చిట్కాలు తప్పకుండా ట్రై చేయండి. అలాగే బరువు పెరగాలనుకునే వారికి కూడా అరటిపండు బాగా సహాయపడుతుంది. అదెలాగంటే అరటిపండుతో పాలల్లో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలుపుకొని  తీసుకోవాలి. ఇలా తాగడం వలన బరువు పెరుగుతారు. అలాగే ఇది ఎముకలను కండరాలను బలంగా మార్చుతుంది. అరటి పండు రోజు తినడం వలన గుండెపోటు రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి. అరటి పండు తింటే మన ఆరోగ్యానికి శరీరానికి మంచిదేన అప్పటికీ జ్వరం జలుబు దగ్గు కఫం వంటివి ఏర్పడినప్పుడు మాత్రం ఈ అరటి పండు తినకపోవడమే మంచిది. ఈ ఆర్టికల్ మీకు  నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి. గమనిక : ఈ ఆర్టికల్ లోని విషయ సమాచారం అంతా ఇంటర్నెట్ లోని వివిధ వెబ్ సైట్ లను శోధించి విశ్లేషించి వాటి ఆధారంగా రాయబడినది.  కావున ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్టికల్ లోని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. Read the full article
0 notes