Tumgik
#bananasaregoodsourceofvitaminC
batukamma · 4 years
Text
ఒక్క అరటిపండు... ఎన్నో ప్రయోజనాలు!
Tumblr media
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో అరటిపండు ఒకటి.. అరటిపండు ఎక్కువగా పండిచే దేశాలలో మన దేశం రెండో స్థానంలో ఉంది.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండును తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ అరటిపండు వలన మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకి అవేంటో తెలుసుకుందాం.. నిహారికకి కాబోయే భర్త ఎవరో తెలుసా? అరటిపండు రక్తపోటును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అరటిపండు చాలా తోడ్పడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకి, దంతాలకి చాలా మంచిది. బరువు తగ్గాలంటే అరటిపండు తప్పనిసరి.. ఇందులో కొవ్వు ఉండదు.. క్యాలరీలు కూడా చాలా తక్కువ.. అరటిపండు తినడం వల్ల ఉబ్బసం ఉన్న పిల్లలలో శ్వాసను నివారించవచ్చు.. అరటిపండు నిత్యం తినడం వలన కిడ్నిల సమస్య బారిన పడకుండా తప్పించుకోవచ్చు గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. జ్ఞాపకశక్తిని మరియు మానసిక స్థితిని పెంచుతుంది. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారు అరటిపండు తింటే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. అరటిపండుతో మన కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలతోపాటు మొటిమలు, మచ్చలను కూడా దూరం చేసుకోవచ్చు. నీరసంగా ఉన్న సమయంలో ఒక్క అరటిపండు తింటే సరే మంచి బూస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అల్సర్ తో భాదపడుతున్న వారు ఏం ఆలోచించకుండా అరటిపండు తినొచ్చు.. అరటిపండు తినడం వలన ఒత్తిడిని కూడా జయిస్తారు. అరటిపండు గర్భిణులకు ఎంతో మేలు చేస్తోంది. విటమిన్ B6 వలన ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. Read the full article
0 notes